Samosa: రూ.10 సమోసా అప్పుగా అడిగాడనీ.. మరుగుతోన్న నూనె కస్టమర్‌పై పోసిన వ్యాపారి
మోసాలు అప్పుగా అడిగినందుకు అతని ప్రాణాల మీదకు వచ్చింది. కేవలం రూ.10లకు సమోసాలు అప్పుగా ఇవ్వాలని కస్టమర్ అడగడంతో దుకాణదారుడికి పట్టరాని కోపం వచ్చింది. దీంతో పాన్‌లో కాగుతున్న వేడివేడి నూనెను వ్యక్తి ముఖంపై పోశాడు. ఈ ఘటనలో బాధితుడి వీపు భాగం తీవ్రంగా కాలిపోయింది. గమనించిన స్థానికులు హుటాహుటీన బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. బాధిత కస్టమర్ తండ్రి దుకాణదారుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయ్యింది. ఈ ఘటన కాన్పూర్‌లోని నౌబస్తా పోలీస్ స్టేషన్ పరిధిలోని మచారియా బుధ్‌పూర్‌లో..

కాన్పూర్, అక్టోబర్ 2: సమోసాలు అప్పుగా అడిగినందుకు అతని ప్రాణాల మీదకు వచ్చింది. కేవలం రూ.10లకు సమోసాలు అప్పుగా ఇవ్వాలని కస్టమర్ అడగడంతో దుకాణదారుడికి పట్టరాని కోపం వచ్చింది. దీంతో పాన్‌లో కాగుతున్న వేడివేడి నూనెను వ్యక్తి ముఖంపై పోశాడు. ఈ ఘటనలో బాధితుడి వీపు భాగం తీవ్రంగా కాలిపోయింది. గమనించిన స్థానికులు హుటాహుటీన బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. బాధిత కస్టమర్ తండ్రి దుకాణదారుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయ్యింది. ఈ ఘటన కాన్పూర్‌లోని నౌబస్తా పోలీస్ స్టేషన్ పరిధిలోని మచారియా బుధ్‌పూర్‌లో శనివారం (అక్టోబర్ 2) సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..
ఈ ఘటన కాన్పూర్‌లోని నౌబస్తా పోలీస్ స్టేషన్ పరిధిలోని మచారియా బుధ్‌పూర్‌కు చెందిన రామ్ స్వరూప్ తాపీ మేస్త్రీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతని కుమారుడు అశు శనివారం సాయంత్రం ఇంటి పక్కనున్న దుకాణంలో సమోసాలు కొనేందుకు వెళ్లాడు. ఆ సమయంలో ఆశు వద్ద కేవలం రూ.10 మాత్రమే ఉన్నాయి. పది రూపాయాలు షాపు యజమానికి ఇచ్చి సమోసాలు తీసుకున్నాడు. అప్పుడు అతని అక్క ఫోన్ చేసి మరికొన్ని సమోసాలు అదనంగా తీసుకురావాలని అసును కోరింది. అయితే ఆశు వద్ద సరిపడా డబ్బులు లేకపోవడంతో సమోసాలు అప్పుగా ఇవ్వాలని దుకాణదారుడిని కోరాడు. ఆశుకు సమోసాలు ఇచ్చేందుకు దుకాణదారుడు నిరాకరించాడు. అనంతరం తీవ్ర కోపోద్రిక్తుడైన షాపు యజమాని అశు చేతిలోని సమోపాలను లాక్కుని విసిరిపారేశాడు. దీంతో షాపు యజమాని, ఆశుకి మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. క్షణికావేశంలో షాపు యజమాని పొయ్యిపై మరుగుతున్న వేడివేడి నూనెను తీసుకుని ఆశుపై పోశాడు. వేడి నూనె తనపై పడటంతో మంటతో బాధితుడు అరవడం ప్రారంభించాడు. పరిస్థితి విషమించడంతో ఇరుగుపొరుగు అశును కాన్పూర్‌లోని ఉర్సాలా ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు.
దుకాణదారుడికి దేహశుద్ధి చేసిన స్థానికులు
ఘటన అనంతరం దుకాణదారుడు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే అక్కడే ఉన్న జనం నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు దుకాణదారుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సమోసాలు అమ్మే దుకాణదారుడు గతంలోనూ పలుమార్లు అనేక మందితో గొడవ పడేవాడని, దురుసుగా ప్రవర్తించేవాడని అశు తండ్రి రాంస్వరూప్ పోలీసులకు తెలిపాడు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




