Telangana Paddy: తెలంగాణ బియ్యం ఎగుమతులకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్.. కీలక ప్రకటన చేసిన మంత్రి పీయూష్ గోయల్
Telangana Paddy Procurement: లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు క్లారిటీగా సమాధానం ఇచ్చారు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ మంత్రి గోయల్ స్పష్టం చేశారు. తెలంగాణలో ఉత్పత్తి అయిన ధాన్యం, బియ్యం మొత్తాన్ని కొనలేమన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షాక్ ఇచ్చింది. తెలంగాణలో ఉత్పత్తి అయిన ధాన్యం, బియ్యం(grain and paddy) మొత్తాన్ని కొనలేమని పార్లమెంట్‌లో తెగేసి చెప్పింది. కేవలం ఆయా రాష్ట్రాల్లో ఉత్పత్తుల ఆధారంగా కొనుగోళ్లు చేయలేమని తెలిపింది. అదనంగా ఉన్న ఉత్పత్తులు, రేటు, డిమాండ్. సరఫరా పరిస్థితుల ఆధారంగానే కొనుగోళ్లు జరుగుతాయని కేంద్రం స్పష్టం చేసింది. లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు క్లారిటీగా సమాధానం ఇచ్చారు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ మంత్రి గోయల్(Union Minister Piyush Goyal) స్పష్టం చేశారు. తెలంగాణలో ఉత్పత్తి అయిన ధాన్యం, బియ్యం మొత్తాన్ని కొనలేమన్నారు. అదనంగా ఉన్న ఉత్పత్తుల డిమాండ్, సరఫరా ఆధారంగానే కొనుగోలు ఉంటాయని స్పష్టం చేశారు మంత్రి పీయూష్ గోయల్. అస్సాంలో ధాన్యం సేకరణపై అడిగిన ప్రశ్నకు లోక్ సభ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ధాన్యం సేకరణ కేవలం ఉత్పత్తి పైనే ఆధారపడి ఉండదు. మద్దతు ధర, డిమాండ్ , సప్లై లాంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని స్పష్టత ఇచ్చారు కేంద్ర మంత్రి.
వరి ధాన్యం కోనుగోలుపై కేంద్రంపై తెలంగాణ సీఎం కేసీఆర్ సీరియస్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఉత్పత్తి అయిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. బీజేపీ ఎంపీలు మంగళవారం మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి, టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ విషయంలో దుష్ప్రచారం చేస్తోందంటూ చర్చించిన విషయం తెలిసిందే. మరోవైపు వడ్ల కొనుగోలు అంశంపై గురువారం తెలంగాణ మంత్రులకు పీయూష్ గోయల్ అపాయింట్‌మెంట్ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి: Egg Storing Hacks: వేసవిలో గుడ్లు తొందరగా పాడవుతున్నాయా..? ఎక్కువ రోజులు ఎలా నిల్వ చేయాలో తెలుసా..
Coconut Water: వేసవికాలంలో కొబ్బరి నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎంటో తెలుసా..