Good News: టెన్త్ అర్హతతో.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 3603 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల!
భారత ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్, పెన్షన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC).. మల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్) స్టాఫ్, హవల్దార్ (Multi-Tasking Staff and Havaldar Posts) పోస్టుల భర్తీకి..
SSC MTS Recruitment 2022: భారత ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్, పెన్షన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC).. మల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్) స్టాఫ్, హవల్దార్ (Multi-Tasking Staff and Havaldar Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 3603 (మల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్) స్టాఫ్ ఖాళీల వివరాలు ఇంకా ప్రకటించలేదు)
పోస్టుల వివరాలు: మల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్) స్టాఫ్, హవల్దార్ (CBIC, CBN) పోస్టులు
పే స్కేల్: నెలకు రూ.31,000ల నుంచి రూ.75,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
వయోపరిమితి: జనవరి 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్తిస్తుంది.
అర్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము:
- జనరల్/ఓబీసీ అభ్యర్ధులకు: రూ.100
- ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
ముఖ్యమైన తేదీలు..
- దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 30, 2022.
- ఆన్‌లైన్‌లో దరఖాస్తు రుసుము చెల్లించడానికి చివరితేదీ: మే 2, 2022.
- చలానా ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేదీ: మే 3, 2022.
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (టైర్ 1) తేదీ: జులై, 2022.
- రాత పరీక్ష (టైర్ 2) తేదీ ఇంకా ప్రకటించలేదు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: