NMMC: విధులకు ఆలస్యంగా వచ్చిన కార్పొరేషన్ ఉద్యోగులకు దిమ్మదిరిగే షాక్..
Navi Mumbai: విధులకు ఆలస్యంగా వస్తే మరోసారి ఇలా చేయకూడదని ఉన్నతాధికారులు సూచిస్తారు. అయినా పద్ధతి మార్చుకోకుంటే కాస్త గట్టిగానే మందలిస్తారు. అయితే ఆఫీస్ లకు..
Navi Mumbai: విధులకు ఆలస్యంగా వస్తే మరోసారి ఇలా చేయకూడదని ఉన్నతాధికారులు సూచిస్తారు. అయినా పద్ధతి మార్చుకోకుంటే కాస్త గట్టిగానే మందలిస్తారు. అయితే ఆఫీస్ లకు వచ్చేందుకు నిర్లక్ష్యం చూపిస్తున్న సిబ్బందిపై నవీ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (NMMC) అధికారులు చర్యలు చేపట్టారు. వారి ప్రవర్తనతో విసిగిపోయిన బాధితుల ఫిర్యాదు (Complaint) తో చర్యలకు ఉపక్రమించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బంది జీతాల్లో (Salaries) కోత విధించారు. నవీ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ కు చెందిన 191 మంది ఉద్యోగులు, సిబ్బంది జీతాన్ని ఉన్నతాధికారులు తగ్గించారు. ఒకటి నుంచి మూడు రోజులు విధులకు ఆలస్యంగా వచ్చారంటూ ఈ చర్యలు చేపట్టింది. అంతే కాకుండా ఆలస్యంగా విధులకు హాజరైన ముగ్గురు ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించారు. ఫిర్యాదులు అందిన తర్వాత, గత నెలలో రెండుసార్లు అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో విధులకు ఆలస్యంగా వస్తున్నారని గుర్తించిన అధికారులు.. తమ పద్ధతి మార్చుకోవాలని సూచించారు. ఈ మేరకు ఎన్‌ఎంఎంసి కమిషనర్ అభిజిత్ భంగర్ ఒక ప్రకటనలో తెలిపారు.
నవీ ముంబై పౌర సంస్థ ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని ఉంటుంది. ఉద్యోగులందరూ క్రమశిక్షణ, సమయపాలన పాటించాలి. అలా చేయడంలో విఫలమైతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సివిక్ ముఖ్య అధికారి ఒకరు తెలిపారు. “కార్యాలయ పనిని ప్రభావితం చేసే సమయ పరిమితులను ఉద్యోగులు పాటించడం లేదని మాకు అనేక వర్గాల నుంచి ఫిర్యాదులు అందాయి. కార్యాలయ క్రమశిక్షణను పాటించాలని ప్రతి ఒక్కరికీ నోటీసు జారీ చేశాం. వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని అందులో పేర్కొన్నాం”. అని అభిజిత్ భంగర్ అన్నారు.
Also Read: Covid-19: కేంద్రం కీలక నిర్ణయం.. మార్చి 31 నుంచి కరోనా నిబంధనలు పూర్తిగా ఎత్తివేత.. కానీ