Covid-19: కేంద్రం కీలక నిర్ణయం.. ఆ రోజు నుంచి కరోనా నిబంధనలు పూర్తిగా ఎత్తివేత.. కానీ
Coronavirus Restrictions in India: దేశంలో కరోనావైరస్ మహమ్మారి కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. కోవిడ్-19 పూర్తిగా అదుపులోకి వస్తున్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం
Coronavirus Restrictions in India: దేశంలో కరోనావైరస్ మహమ్మారి కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. కోవిడ్-19 పూర్తిగా అదుపులోకి వస్తున్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 నుంచి కోవిడ్-19 నిబంధనలను పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు కొనసాగుతాయంటూ కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. ప్రజలంతా చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచనలు చేసింది. కరోనావైరస్ (Covid-19) నియంత్రణలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలంటూ పేర్కొంది. రాష్ట్రాలలో కేసులు పెరిగితే.. స్థానిక ప్రభుత్వాలు నిబంధనలు విదించుకోవచని కేంద్ర హోం శాఖ తెలిపింది.
కాగా.. రెండేళ్ల క్రితం దేశంలో కరోనా విజృంభించడంతో నియంత్రణ కోసం కేంద్రం పలు కఠిన నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మహమ్మారి కట్టడి కోసం 2020 మార్చి 24న విపత్తు నిర్వహణ చట్టం కింద తొలిసారిగా మార్గదర్శకాలను జారీ చేసింది. ఆ తర్వాత కేసుల సంఖ్యలో మార్పులు చేటుచేసుకున్న నేపథ్యంలో పలుమార్లు వీటిల్లో మార్పులు, చేర్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గత ఏడు వారాలుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తున్నాయి. దీంతో ఈ నిబంధనలను పూర్తిగా ఎత్తివేయాలని హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
కరోనా మహమ్మారిని ఎదుర్కోడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కూడా తమ సామర్థ్యాన్ని పెంచుకొని సొంత వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాయి. ప్రస్తుతం దేశంలో కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న తర్వాత జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని నిబంధనలు ఇకపై పొడగించాల్సిన అసవరం లేదని భావిస్తున్నాం. మార్చి 31న ప్రస్తుతమున్న ఆంక్షల గడువు ముగియనుంది. ఆ తర్వాత హోంశాఖ ఎలాంటి కొత్త ఆదేశాలు జారీ చేయదు అంటూ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్రాలకు పంపిన ఉత్తర్వుల్లో తెలిపారు.
Also Read: