AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bodhan: బోధన్ అల్లర్ల లో కీలక మలుపు.. కేసులో టీఆర్ఎస్ కౌన్సిలర్ ప్రమేయం

నిజామాబాద్ జిల్లా బోద‌న్(Bodhan) అల్లర్ల కేసులో కీల‌క మ‌లుపు చోటు చేసుకుంది. ఈ కేసులో టీఆర్ఎస్ (TRS) కౌన్సిలర్, మున్సిప‌ల్ ఛైర్ ప‌ర్సన్ భ‌ర్త శ‌ర‌త్ రెడ్డి ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించారు. విగ్రహాన్ని కొనుగోలు చేసి..

Bodhan: బోధన్ అల్లర్ల లో కీలక మలుపు.. కేసులో టీఆర్ఎస్ కౌన్సిలర్ ప్రమేయం
Bodan Case
Ganesh Mudavath
|

Updated on: Mar 23, 2022 | 1:57 PM

Share

నిజామాబాద్ జిల్లా బోద‌న్(Bodhan) అల్లర్ల కేసులో కీల‌క మ‌లుపు చోటు చేసుకుంది. ఈ కేసులో టీఆర్ఎస్ (TRS) కౌన్సిలర్, మున్సిప‌ల్ ఛైర్ ప‌ర్సన్ భ‌ర్త శ‌ర‌త్ రెడ్డి ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించారు. విగ్రహాన్ని కొనుగోలు చేసి.. శ‌ర‌త్ రెడ్డికి చెందిన రైస్ మిల్లులో దాచారని చెప్పారు. ఎవ‌రు లేని స‌మ‌యంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ప్రణాళిక రచించారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే గోపిని అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద శ‌రత్ పై కేసు న‌మోదు చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడంతో పాటు, గొడ‌వ‌ల‌కు కార‌ణ‌య్యారనే సెక్షన్లను యాడ్ చేశారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ (MLA Shakeel) కు కొంతకాలంగా శరత్ రెడ్డితో విభేదాలు ఉన్నాయి. ఎమ్మెల్యే అన్న సోహెల్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ హోదాలో తాననుకున్నదే చేయడంతో వివాదం ముదిరింది. దీంతో పట్టణంలో శివాజీ విగ్రహ ప్రతిష్ఠాపనకు తనతో సన్నిహితంగా ఉండే కౌన్సిలర్లతో మున్సిపల్ లో తీర్మానం చేశారు. ప్రతి పనిలో తనను అడ్డుకుంటున్నారని శివాజీ విగ్రహావిష్కరణకు శివసేన గోపితో కలిసి పెట్టినట్టుగా పోలీసులు వెల్లడించారు.

బోధన్‌లో శివాజీ విగ్రహం ఏర్పాటుపై వివాదానికి కారణమైంది. శివసేన, బీజేపీ కార్యకర్తలు రాత్రికి రాత్రి శివాజీ విగ్రహాన్ని ప్రతిష్టించారు. దీంతో మైనార్టీకి చెందిన నాయకులు ఆందోళనకు దిగారు. విగ్రహం తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో బోధన్‌ నివురుగప్పిన నిప్పులా మారిపోయింది. శివసేన(Shiv Sena), బీజేపీ(BJP) ఇచ్చిన పిలుపుతో బంద్‌ కొనసాగింది. ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటుచేశారు. సాధారణ పరిస్థితులు నెలకొనేవరకు బోధన్‌లో 144 సెక్షన్‌ కొనసాగించనున్నారు. బోధన్‌ ఘటనలో ఇప్పటి వరకు ఇరువర్గాలకు చెందిన 24 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు పోలీసులు. పరారీలో ఉన్న వారు వెంటనే పోలీస్ స్టేషన్లో లొంగిపోవాలని వారి కుటుంబ సభ్యులకు బోధన్ టౌన్ పోలీసులు నోటీసులు అందజేశారు.

Also Read

Kadiri Temple: కొనసాగుతున్న కాటమరాయుడి బ్రహ్మోత్సవాలు.. నేడు రథోత్సవ వేడుక.. భారీగా తరలివచ్చిన భక్తులు

US President Biden: భారత్ భయపడుతోందన్న పెద్దన్న..బైడెన్ మాటలపై అమెరికా నష్టనివారణ చర్యలు!