US President Biden: భారత్ భయపడుతోందన్న పెద్దన్న..బైడెన్ మాటలపై అమెరికా నష్టనివారణ చర్యలు!
US President Biden: జో బైడెన్ అమెరికా అధ్యక్షుడుగా పదవిని చేపట్టిన అనంతరం ఆయన చేస్తున్న కొన్ని ప్రకటనలు ఆదేశానికి నష్టం కలిగించేవిగా ఉంటున్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ (Ukraine),..
US President Biden: జో బైడెన్ అమెరికా అధ్యక్షుడుగా పదవిని చేపట్టిన అనంతరం ఆయన చేస్తున్న కొన్ని ప్రకటనలు ఆదేశానికి నష్టం కలిగించేవిగా ఉంటున్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ (Ukraine), రష్యా(Russia) యుద్ధం విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు, మాట్లాడుతున్న తీరుపై సర్వత్రా విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఉక్రెయిన్ కు యుద్ధం సమయంలో నాటో తరపున ఆయుధాలను సరఫరా చేస్తామని ప్రకటించిన బైడెన్.. అనంతరం ఆయుధాల సరఫరా మాటకూడా ఎత్తడం లేదు. తాజాగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధం విషయంలో రష్యాని నిలువరించడం లేదని.. రష్యాని చూసి భారత భయపడుతుంది అంటూ వివాదాస్పదంగా బైడెన్ కామెంట్ చేశారు. అయితే బైడెన్ చేసిన వ్యాఖ్యలపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. బైడెన్ చేసిన వ్యాఖ్యలపై భారత్ నొచ్చుకుంది. ఇరు దేశాల మధ్య సమస్యకు యుద్ధం కాదని.. చర్చల ద్వారా మాత్రమేనని.. అందుకనే నాటో, అమెరికా, యురోపియన్ దేశాల చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ప్రధాని మోడీ ఇప్పటికే పలు మార్లు, పలు సందర్భాల్లో చెప్పారు. ఇదే విషయాన్నీ మళ్ళీ ప్రస్తావిస్తూ.. ప్రస్తుతం రష్యాపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేమని భారత్ తేల్చి చెప్పింది.
తాజాగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ చేసిన “భారత్ భయపడుతోంది” వ్యాఖ్యలపై అమెరికా నష్టనివారణ చర్యలకు దిగింది. తాజాగా అమెరికా అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ మాట్లాడుతూ.. క్వాడ్ కూటమిలో భారత్ తమకు అత్యంత ప్రధాన భాగస్వామి అని.. భారత్ లేకుండా ఇండో పసిఫిక్ ప్రాంతంలో బహిరంగ, స్వేచ్ఛ కదలికలు సాధ్యం కాదని చెప్పారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో రక్షణ, భద్రత పరంగా భారత్ తో తమ భాగస్వామ్యం ఎంతో అవసరమని చెప్పారు. అమెరికాకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర భాగస్వామ్య దేశాలు, మిత్రదేశాల వలనే ఇప్పుడు భారత్ కూడా తమ దేశ భాగ్యస్వామి అని ప్రైస్ వార్తా సంస్థ చెప్పిందని ANI తెలిపింది.
Also Read: Viral Video: కుష్టు రోగులకు సేవ.. పద్మశ్రీ అందుకున్న 125 ఏళ్ల స్వామి శివానంద.. వీడియో వైరల్