Narendra singh Tomar: సాగు చట్టాలు మళ్లీ తీసుకొస్తాం.. కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సంచలన వ్యాఖ్యలు
కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాగు చట్టాలు మళ్లీ తీసుకొస్తామని చెప్పారు.....
కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాగు చట్టాలు మళ్లీ తీసుకొస్తామని చెప్పారు. స్వల్ప మార్పులతో చట్టాలు తిరిగి తీసుకొస్తామని తెలిపారు. రైతుల కోసం ప్రధాని ఎంతో చేశారని వివరించారు. 70 ఏళ్లలో ఎవరు చేయని పనిని మోడీ చేశారని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతుల ఆందోళనతో ప్రభుత్వం గత నెలలో మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంది. అయితే ఈ చట్టలను ప్రవేశపెట్టవచ్చని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ శుక్రవారం మహారాష్ట్రలో జరిగిన ఒక కార్యక్రమంలో చెప్పారు.
“మేము వ్యవసాయ సవరణ చట్టాలను తీసుకువచ్చాము. అయితే కొంతమందికి ఈ చట్టాలు నచ్చలేదు. స్వాతంత్ర్యం వచ్చిన 70 సంవత్సరాల తరువాత, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇది పెద్ద సంస్కరణ” అని వ్యవసాయ మంత్రి అన్నారు. “కానీ ప్రభుత్వం నిరాశ చెందలేదు. మేము ఒక అడుగు వెనక్కి తీసుకున్నాం. రైతులు భారతదేశానికి వెన్నెముక కాబట్టి మేము మళ్లీ ముందుకు సాగుతాం.” అని చెప్పారు.
Will farm laws make a come-back??? Union agri minister Narendra Tomar @nstomar drops hint during the inauguration of Agro Vision Expo in Nagpur on Friday. @ndtv pic.twitter.com/HDvateXQ6h
— Mohammad Ghazali (@ghazalimohammad) December 25, 2021
Read Also.. Assembly Elections: 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరపాలా? వద్దా?.. కేంద్ర ఎన్నికల సంఘం తర్జన భర్జన..