Omicron Cases In India: దేశవ్యాప్తంగా దడ పుట్టిస్తున్న ఒమిక్రాన్.. నేటి రాత్రి నుంచి అక్కడ కర్ఫ్యూ

దేశంలో ఒమిక్రాన్‌ కల్లోలం స‌ృష్టిస్తోంది. 17రాష్ట్రాలకు న్యూ వేరియంట్‌ పాకింది. జెట్‌ స్పీడ్‌తో పరుగులు పెడుతూ 4వందల మార్క్‌ను కూడా క్రాస్‌ చేసేసింది.

Omicron Cases In India: దేశవ్యాప్తంగా దడ పుట్టిస్తున్న ఒమిక్రాన్.. నేటి రాత్రి నుంచి అక్కడ కర్ఫ్యూ
తూర్పు మద్య దేశాలు, పశ్చిమ పసిఫిక్ ప్రాంతాల్లో కేసుల సంఖ్య గతం వారంతో పోలిస్తే సమానంగా ఉంది. అటు ఆఫ్రికన్ ప్రాంతంలో మాత్రం మరణాల సంఖ్య భారీగా పెరిగింది. ఈ ప్రాంతంలో ఏకంగా 72 శాతం మరణాలు సంభవించాయి. అటు దక్షిణ తూర్పు ఆసియాలో 9 శాతం మరణాలుంటే..అమెరికా ప్రాంతంలో 7 శాతం మరణాలున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 278 మిలియన్ల కోవిడ్ కేసులుంటే..5.4 మిలియన్ల మంది మరణించారు.
Follow us

|

Updated on: Dec 25, 2021 | 3:49 PM

దేశంలో ఒమిక్రాన్‌ కల్లోలం స‌ృష్టిస్తోంది. 17రాష్ట్రాలకు న్యూ వేరియంట్‌ పాకింది. జెట్‌ స్పీడ్‌తో పరుగులు పెడుతూ 4వందల మార్క్‌ను కూడా క్రాస్‌ చేసేసింది. రెండ్రోజుల క్రితమే 2వందలకు చేరాయి కేసులు. కానీ రెండ్రోజుల్లోనే డబుల్‌ అయ్యాయి. ఇప్పటివరకు దేశంలో 415కు చేరింది ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య. మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్‌ టాప్‌-3 ప్లేస్‌లో ఉన్నాయి.

మహారాష్ట్ర ఒమిక్రాన్‌కు సెంటర్‌ పాయింట్‌గా మారింది. అక్కడ సెంచరీని దాటేశాయి ఒమిక్రాన్‌ పాజిటివ్స్‌. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో108 కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో మహారాష్ట్రలో నైట్‌ కర్ఫ్యూ విధించింది ప్రభుత్వం. క్రిస్మస్‌ సెలబ్రేషన్స్‌పైనా ఆంక్షలు పెట్టింది. చర్చిల్లో 50శాతం వరకే అనుమతించాలని నిబంధన విధించింది.

ఇక మహారాష్ట్ర తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో 79కేసులు..గుజరాత్‌లో 43కేసులు వెలుగులోకొచ్చాయి. ఈ మూడు రాష్ట్రాల్లోనే సగానికి పైగా కేసులు వెలుగులోకొచ్చాయి. విదేశాల నుంచి వచ్చిన వారికి ఎయిర్‌పోర్టుల్లో చేసిన పరీక్షల్లో నెగిటివ్ వచ్చినా..ఆ తర్వాత పాజిటివ్‌ వస్తోంది. అప్పటికే వారు.. కుటుంబసభ్యులు, స్థానికులను కలవడంతో కేసులు పెరిగిపోతున్నాయి.

తెలంగాణలో ఇప్పటివరకు 38 కేసులు నమోదయ్యాయి. ఐతే ఒమిక్రాన్‌ బాధితుల్లో 10మందికి నెగెటివ్‌ రావడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. దీంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య 28కి తగ్గింది. రోజురోజుకీ కేసులు పెరిగిపోతుండటంతో ఒమిక్రాన్ కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. పాజిటివ్ వచ్చిన వారిని గచ్చిబౌలిలోని టిమ్స్, గాంధీ ఆస్పత్రులకు తరలించి ఐసోలేషన్‌ చేస్తున్నారు. కేసులెక్కువున్న ప్రాంతాల్లో ఆంక్షలు అమలు చేస్తున్నారు.

ఇక ఏపీలో నిన్న రెండు ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. ఈ రెండు కేసులతో ఏపీలో ఒమిక్రాన్‌ కేసులు నాలుగుకు చేరాయి. కోనసీమలో అయినవెల్లి మండలం నేదునూరిపాలెంకు చెందిన మహిళకు ఒమిక్రాన్‌ నిర్ధారణైంది. ఈనెల 19న కువైట్‌ నుంచి వచ్చిందామె. దీంతో ఆమె కుటుంబసభ్యులుకు కరోనా పరీక్షలు నిర్వహించారు.

దేశంలో ఒకవైపు ఒమిక్రాన్‌ విజృంభణ..మరోవైపు క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌. దీంతో పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. నైట్‌ కర్ఫ్యూతో పాటు 144సెక్షన్‌ అమలుచేస్తున్నాయి. క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకలపైనా నిషేధం విధించాయి.

ఐతే ఫిబ్రవరి 3 నాటికి థర్డ్‌ వేవ్‌ తీవ్రత మరింత పెరిగే అవకాశముందని హెచ్చరించింది ఐఐటీ కాన్పూర్‌. ఈ నెల 15 నుంచే దేశంలో కేసులు పెరుగుతున్నాయని..కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని సూచించింది. . అయితే సెకండ్‌ వేవ్‌తో పోలిస్తే థర్డ్‌ వేవ్‌ వినాశకరమైనది కాదని వివరించింది.

ఒమిక్రాన్‌ విజృంభణతో అప్రమత్తమైంది కేంద్రం. కొవిడ్‌ కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలతో పాటు వ్యాక్సినేషన్ తక్కువగా జరుగుతున్న రాష్ట్రాలపై దృష్టి పెట్టింది. పది రాష్ట్రాలకు కేంద్ర బృందాలను పంపిస్తోంది.కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, బెంగాల్‌, మిజోరాం, కర్నాటక, బీహార్, జార్ఖండ్, పంజాబ్, యూపీకి వెళ్లనున్నాయి కేంద్ర బృందాలు. 3-5 రోజుల పాటు ఆయా రాష్ట్రాల్లో పర్యటించనున్నాయి. యూపీలో నేటి నుంచి రాత్రి కర్ఫ్యూను కానున్నది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. శనివారం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 వరకు నైట్ కర్ఫ్యూ అమలు కానున్నది. మహారాష్ట్రలో సైతం శనివారం రాత్రి నుంచి ఇక్కడ కూడా కర్ఫ్యూ అమల్లోకి రానున్నది. హరియాణాలో శుక్రవారం రాత్రి నుంచే రాత్రి కర్ఫ్యూ అమలోకి వచ్చింది.  రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూ ని విధించింది అక్కడ ప్రభుత్వం.

Also Read: వ్యాపారుల దోపిడి తాళలేక జామ రైతు ఈ పనిచేశాడు.. ఇప్పుడు డబుల్ ప్రాఫిట్

ఇదెక్కడి మాస్‌రా మామ..! పుష్ప సాంగ్‌పై మీమ్ చూసి పిచ్చిపిచ్చిగా నవ్విన సమంత