Rhino Horn: ఖడ్గ మృగం కొమ్ములు బంగారం కంటే ఖరీదైనవి.. లక్షల్లో ధర.. వాటికి ఎందుకంత ప్రాధాన్యత..!

Rhino Horn: ఖడ్గ మృగం గురించి మీరు చాలా విని ఉంటారు. కానీ దాని కొమ్ము గురించి మీకు తెలుసా. ఖడ్గమృగం ఒక కొమ్ము చాలా ఖరీదైనది. దీని కంటే బంగారం చౌకగా వస్తుంది..

Rhino Horn: ఖడ్గ మృగం కొమ్ములు బంగారం కంటే ఖరీదైనవి.. లక్షల్లో ధర.. వాటికి ఎందుకంత ప్రాధాన్యత..!
Follow us
Subhash Goud

|

Updated on: Dec 25, 2021 | 1:51 PM

Rhino Horn: ఖడ్గ మృగం గురించి మీరు చాలా విని ఉంటారు. కానీ దాని కొమ్ము గురించి మీకు తెలుసా. ఖడ్గ మృగం ఒక కొమ్ము చాలా ఖరీదైనది. దీని కంటే బంగారం చౌకగా వస్తుంది. అయితే ఈ కొమ్ములో ప్రాధాన్యత ఏమిటి..? అంత ఖరీదు ఎందుకు ఉంటుంది. దీని కొమ్ము లక్షల్లో విలువ ఉంటుంది. ఈ జంతువులు వేటగాళ్లు ఉచ్చులో పడి బలవుతున్నాయి. వేటగాళ్లకు బలి కాకుండా ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపడుతున్నాయి.

ఖడ్గ మృగం కొమ్ములో కెరాటిన్‌.. వాస్తవానికి ఖడ్గమృగం కొమ్ములో కెరాటిన్ ఉంటుంది. ఈ కెరాటిన్ ధర చాలా ఎక్కువ. ఇది బంగారం కంటే చాలా ఎక్కువ విలువ కలిగి ఉంటుంది. ఈ కెరాటిన్ కారణంగా ఖడ్గమృగాల కొమ్ములు చాలా ధరకు అమ్ముడుపోతాయి. దీని కోసం చాలా మంది వేటగాళ్లు ఖడ్గ మృగాలను వేటాడుతుంటారు. దీన్ని చైనాలో మ్యాజికల్ మెడిసిన్ అంటారు. అయితే ఇప్పుడు ఈ వేటను ఆపడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక చర్యలు తీసుకుంటున్నారు. దీని కొమ్ములో ఉండే కెరాటిన్‌ జట్టుకు సంబంధించిన చికిత్సలో వాడుతుంటారు. ఖడ్గమృగాల కొమ్ముల వ్యాపారం చేసుకుని కొందరు గుట్టుచప్పుడు కాకుండా వాటి కొమ్ములను నరికి వేస్తున్నారు.

కొమ్ములు ఔషధాల తయారీలో వినియోగం.. ఈ ఖడ్గ మృగం కొమ్ములను కత్తిరించి భారీ ధరలకు అమ్ముతుంటారు. ఈ కొమ్ములను పొడిగా తయారు చేసి వివిధ రకాల ఔషధాల్లో ఉపయోగిస్తారు. ఇందులో ఉండే కెరాటిన్‌ ఔషధాలకు, ఇతర వాటికి ఉపయోగపడతాయి. క్యాన్సర్‌ వ్యాధి నుంచి హ్యాంగోవర్‌ వరకు, వివిధ రకాల మందుల తయారీలో ఈ ఖడ్గ మృగం కొమ్ములను ఉపయోగిస్తారని అధికారులు చెబుతున్నారు. చైనాలో తయారు చేసే ఔషధాల్లో ఈ కొమ్ములను అధికంగా వాడుతారు. ఆయా దేశాల్లో కూడా ఈ కొమ్ములకు డిమాండ్‌ చాలా ఉంటుంది. అందుకే ఇవి లక్షల్లో ధర పలుకుతాయి. ఖడ్గ మృగం కొమ్ము కోసినా తిరిగి మళ్లీ పెరుగుతుంది. ఈ కొమ్ము ప్రతి కిలోగ్రాము లక్షల్లో ధర ఉంటుంది. ఖడ్గమృగాల కొమ్ములో లభించే కెరాటిన్ ఆసియాలో బంగారం కంటే ఎక్కువ ధరకు అమ్ముడవుతోంది. భారతదేశంలో ఒక కొమ్ము ధర లక్ష రూపాయల పలుకుతున్నట్లు సమాచారం.

వేటగాళ్ల చేతిలో బలవుతున్న ఖడ్గ మృగాలు.. 2020 సంవత్సరపు నివేదిక ప్రకారం.. గత పదేళ్లలో దేశవ్యాప్తంగా 102 కొమ్ములున్న ఖడ్గ మృగాలు వేటాడినట్లు నివేదికలు చెబుతున్నాయి. వీటిలో గత రెండేళ్లలో 32 ఖడ్గ మృగాలను వేటగాళ్లు చంపేశారు. నేడు ఈ మృగాలు అంతరించిపోతున్నాయి. ప్రస్తుతం కేవలం మూడు వేలకు పైగా భారతీయ ఖడ్గమృగాలు అడవిలో సజీవంగా ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. వీటిలో దాదాపు 2000 భారతదేశంలోని అస్సాంలో మాత్రమే కనిపిస్తాయి.

ఇవి కూడా చదవండి:

Googld, Facebook: గూగుల్‌, ఫేస్‌బుక్‌లకు 130 మిలియన్ల డాలర్ల జరిమానా.. ఎందుకంటే..

Telecom Companies: టెలికం కంపెనీలకు కొత్త నిబంధనలు.. యూజర్ల డేటా రెండేళ్ల పాటు ఉంచాలి: కేంద్రం

హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.