Telangana: సెప్టెంబర్ 17 చరిత్రను ప్రజలకు తెలియకుండా చేశారు.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ వేడుకలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా అమరవీరుల స్తూపం వద్ద అమిత్ షా నివాళులర్పించారు. ఆ తర్వాత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం భద్రతా బలగాల నుంచి ఆయన గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ప్రాంతానికి వెంటనే స్వాతంత్ర్యం రాలేదని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ వేడుకలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా అమరవీరుల స్తూపం వద్ద అమిత్ షా నివాళులర్పించారు. ఆ తర్వాత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం భద్రతా బలగాల నుంచి ఆయన గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ప్రాంతానికి వెంటనే స్వాతంత్ర్యం రాలేదని అన్నారు. దీనికోసం 13 నెలల పాటు వేచి చూడాల్సిన పరిస్థతి వచ్చిందని పేర్కొన్నారు. చివరికి లక్షలాది మంది పోరాటం, వేలాదిమంది బలిదానాల తర్వాత భారత సైన్యం పోరాటంతో ముడురంగుల జెండా ఎగిరిందని వ్యాఖ్యానించారు. 13 నెలల పాటు దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య పండుగ చేసుకుంటే.. తెలంగాణ ప్రాంతంలో మాత్రం గ్రామీణ ప్రాంతాలు, పేద ప్రజలు, రైతుల మీద పడి రజాకార్లు అనేక ఆకృత్యాలకు పాల్పడ్డారని అన్నారు.
తెలంగాణ ఆడపడుచులతో నగ్నంగా బతుకమ్మలు ఆడించారని.. అలాగే అత్యాచారాలు కూడా చేశారని, వేలాది మందిని హత్య చేశారని పేర్కొన్నారు. ప్రతిగ్రామంలోను నిజాంకు వ్యతిరేకంగా పోరాటం జరిగిందని.. 75 ఏళ్లుగా ఈ చరిత్రను తొక్కిపెట్టే ప్రయత్నాలు చేశారన్నారు. దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించినటువంటి పార్టీలు.. ఈ సెప్టెంబర్ 17 చరిత్రను ప్రజలకు తెలియకుండా చేశారని మండిపడ్డారు. 75 ఏళ్లకు ముందు అప్పటి హోంమంత్రి ఈ గడ్డపై కేంద్ర ప్రభుత్వం తరపున జాతీయ జెండా ఎగరవేస్తే.. 75 ఏల్ల తర్వాత ఇప్పటి హోంమంత్రి అమత్ షా జెండా ఎగరవేశారని అన్నారు. ఇక్కడి చరిత్రను కనుమరుగు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ప్రయత్నాలు జరిగాయని వ్యాఖ్యానించారు. అలాగే 75 ఏళ్లుగా తెలంగాణ విమోచన ఉత్సవాలు జరపకుండా కూడా కుట్రలు చేశారని పేర్కొన్నారు. అయితే ఇప్పటికీ కూడా సమైక్య దినం అంటూ మోసం చేస్తున్నారని విమర్శించారు. భూమి కోసం, భుక్తి కోసం.. పోరాటాలు, బలిదానాలు చేసి తెచ్చుకున్నది సమైక్యతా దినమా అంటూ ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా మరోవైపు కేంద్రమంత్రి అమిత్ షా పలు వ్యాఖ్యలు చేశారు. నిజాంపై చేసిన అలుపెరగని పోరాటం.. దేశభక్తికి నిదర్శనమని అన్నారు. హైదరాబాద్ విముక్తి కోసం అమరులైన వీరులందరికి నివాళులర్పిస్తానని పేర్కొన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం గురించి దేశ ప్రజలకు ఈ విషయం తెలియాలని.. సర్దార్ వల్లభభాయ్ పటేల్ చొరవతో హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కలిగినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది మహనుభావులు ప్రాణత్యాగాలు చేశారని.. రావి నారణయణరెడ్డి, కాళోజీ నారాయణరావు, బద్దం ఎల్లారెడ్డి, బూర్గులు రామకృష్ణరావు, నరసింహరావుకు నివాళులర్పిస్తున్నానని చెప్పారు. ఆపరేషన్ పోలో అనే పేరుతో సర్దార్ వల్లభభాయ్ పటేల్ నిజాం మెడలు వంచి.. రక్తం చిందకుండా నిజాం రజాకారులు లొంగిపోయేలా చేశారంటూ వివరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




