AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

5G Service: ఆ ప్రాంతాల్లో 5జి సేవలు ఉండవు.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం..

5జీ సర్వీసెస్ అందుబాటులోకి వస్తున్నాయంటే యావత్ దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తమ వద్ద ఉన్న 4 జీ ఫోన్లను అప్‌గ్రేడ్ చేసుకుని 5జీ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు.

5G Service: ఆ ప్రాంతాల్లో 5జి సేవలు ఉండవు.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం..
5g Service At Airport
Shiva Prajapati
|

Updated on: Nov 30, 2022 | 4:18 PM

Share

5జీ సర్వీసెస్ అందుబాటులోకి వస్తున్నాయంటే యావత్ దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తమ వద్ద ఉన్న 4 జీ ఫోన్లను అప్‌గ్రేడ్ చేసుకుని 5జీ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. 5జీ సేవలను వినియోగించుకునేందుకు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. అయితే, 5జీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న జనాలకు చిన్న ఝలక్ ఇచ్చిన కేంద్ర సర్కార్. అయితే, అందరికీ కాదండోయ్.. కొందరికి మాత్రమే ఈ ఎఫెక్ట్ ఉంటుంది. అవును, విమానాశ్రయం రన్‌వేకి ఇరువైపులా 2 కిలోమీటర్ల వరకు 5జీ సేవలను అందించవద్దని టెలికాం డిపార్ట్‌మెంట్(DoT).. టెలికాం కంపెనీలను ఆదేశించింది. అలాగే రన్‌వేకు 910 మీటర్ల వరకు కంపెనీలు సేవలను అందించవద్దని స్పష్టం చేసింది. అంటే విమానంలో కూర్చున్న వారు, విమానాశ్రయం రన్‌వే కు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారు సైతం ఈ 5జీ సేవలను పొందలేరు. అంతేకాదు.. దేశంలో చాలా విమానాశ్రయాలు చాలా చిన్నవిగా ఉన్నాయి. ఇక్కడ 5జీ సేవలను అందించడం చాలా కష్టం అంటున్నారు అధికారులు.

కాగా, విమనాశ్రయాల్లోనూ 5జీ సేవలను ప్రారంభించనున్నట్లు టెలికాం కంపెనీలు ఎంతో ఆర్భాటంగా ప్రకటించాయి. భారతీ ఎయిర్‌టెల్ దేశంలోని 5 విమానాశ్రయాలలో 5జీ సేవలను అందించనున్నట్లు ప్రకటించారు. అయితే, విమానానికి సంబంధించిన అల్టిమీటర్ 5జీ సిగ్నల్‌కు ప్రభావితం అవుతుంది. ఈ నేపథ్యంలోనే విమానాల ఆల్టిమీటర్లను వేగవంతం చేయాలని టెలికాం శాఖ డీజీసీఏనె కోరింది.

5జీ బేస్ స్టేషన్‌లను ఎక్కడ ఏర్పాటు చేయొచ్చు..?

రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలకు ఇదే లేఖలలో ఈ 2.1 కిమీ పరిమితిని దాటి 540 మీటర్ల విస్తీర్ణంలో 5G బేస్ స్టేషన్‌లను ఏర్పాటు చేయవచ్చని సూచించింది కేంద్ర టెలికాం డిపార్ట్‌మెంట్. అయితే విద్యుత్ ఉద్గారాలను 58 dBm/MHz కి పరిమితం చేయాలని స్పష్టం చేసింది. DoT తెలిపింది. టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు తక్షణమే ఈ ఆదేశాలను పాటించాలని, అన్ని ఎయిర్‌క్రాఫ్ట్ రేడియో ఆల్టిమీటర్ ఫిల్టర్‌లను DGCA భర్తీ చేసే వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని DoT తన లేఖలో పేర్కొంది.

ఇవి కూడా చదవండి

ఆల్టిమీటర్‌ను త్వరగా మార్చడానికి సూచనలు..

టెలికాం డిపార్ట్‌మెంట్ ఆదేశాల ప్రకారం.. విమానాశ్రయాల పరిసర ప్రాంతాల్లో 5జీ సేవలు ఉండవు. ఉదాహరణకు ఢిల్లీలోని వసంత్ కుంజ్, ద్వారక వంటి ప్రాంతాల్లో 5జీ సేవలు ఉండవు. దీనికి కారణం.. 5జీ ఉద్గారాలు రేడియో ఆల్టీమీటర్‌లకు అంతరాయం కలిగించడమే. అయితే, ఎలాంటి అంతరాయం కలిగించడకుండా ఉండేందుకు ఈప్రాంతాల్లో 5జీ బేస్ స్టేషన్ల ఎత్తును తగ్గించాలని టెలికాం సంస్థలకు సూచించింది DoT. ఆల్టిమీటర్ రీప్లేస్‌మెంట్‌కు సంబంధించి డిజిసిఎ త్వరితగతిన చర్యలు చేపడుతుందని డిఒటీ తెలిపింది. ఆ తరువాత ఆంక్షలు తొలగించడం జరుగుతుందని పేర్కొన్నారు. అయితే, ఈ ఆదేశాలపై మూడు ప్రముఖ టెలికాం కంపెనీల నుంచి ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..