గర్భవతి అయినట్లు చెప్పిన ప్రియురాలు.. షాక్‌తో ప్రియుడు ఏం చేశాడంటే..

ప్రస్తుత కాలంలో ప్రేమ అంటే అర్థం పూర్తిగా మారిపోయింది. ప్రేమ పేరుతో పిచ్చి పనులన్నీ చేస్తున్నారు యువతీయువకులు. తీరా తప్పులన్నీ చేశాక..

గర్భవతి అయినట్లు చెప్పిన ప్రియురాలు.. షాక్‌తో ప్రియుడు ఏం చేశాడంటే..
Pregnant
Follow us

|

Updated on: Nov 30, 2022 | 3:41 PM

ప్రస్తుత కాలంలో ప్రేమ అంటే అర్థం పూర్తిగా మారిపోయింది. ప్రేమ పేరుతో పిచ్చి పనులన్నీ చేస్తున్నారు యువతీయువకులు. తీరా తప్పులన్నీ చేశాక.. తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటాయోననే భయంతో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో అలాంటి దారుణ ఘటన ఒకటి వెలుగు చూసింది. తన ప్రియురాలు గర్భవతి అని తెలియడంతో భయపడిపోయిన యువకుడు.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు ఆ యువకుడు తన ప్రియురాలితో ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్నాడు. ఇంతలో ఆమె తాను గర్భవతి అని చెప్పడంతో బెదిరిపోయిన యువకుడు.. ఫోన్ కట్ చేసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యను సెల్ఫీ వీడియో తీసుకుని ప్రియురాలికి పంపించాడు. అనంతరం ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

సంజయ్ నగర్‌ పరిధిలోని అట్రైలా గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అట్రైలా గ్రామానికి చెందిన వినయ్ కుమార్ ద్వివేది(29).. సంజయ్ నగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. గత సోమవారం అర్థరాత్రి వినయ్ తన గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయం అయినా వినయ్ గది నుంచి బయటకు రాలేదు. దాంతో ఇంటి యజమానికి అనుమానం వచ్చి ఇంట్లోకి చూశాడు. గదిలో వినయ్ విగత జీవిత జీవిగా పడి ఉండటం గమనించిన ఇంటి యజమాని.. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.

గర్భవతి అని భయపడి..

వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. తలుపులు పగులగొట్టి గదిలోకి ప్రవేశించారు. ఉరికొయ్యకు వేలాడుతున్న వినయ్ మృతదేహాన్ని కిందకు దించారు అధికారులు. అతని మొబైల్ బెడ్‌పై పడి ఉండగా.. దానిని స్వాధీనం చేసుకుని విచారణ జరిపారు. వినయ్ ఆత్మహత్యకు ముందు ప్రియురాలితో మాట్లాడినట్లు తేల్చారు పోలీసులు. వినయ్ ప్రియురాలు గర్భవతి అయ్యిందని, దానికి భయపడిన వినయ్ ఇలా ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు నిర్ధారించారు.

ఇవి కూడా చదవండి

తల్లిదండ్రులతోనూ హ్యాపీగా..

వినయ్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు వినయ్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే బంధువులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వినయ్ విద్యుత్ శాఖ సబ్ స్టేషన్‌లో మెయింటెనెన్స్ పనులు చేసేవాడని బంధువులు తెలిపారు. ఈ ఘటనకు ముందు తమతో మాట్లాడాడని, ఆ సమయంలో చాలా సంతోషంగా మాట్లాడినట్లు పోలీసులకు వివరించారు కుటుంబ సభ్యులు.

ప్రియురాలిని విచారణ..

పోస్టుమార్టం అనంతరం వినయ్ మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు పోలీసులు. మృతుడి మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. సైబర్ సెల్ సహాయం కూడా తీసుకుని విచారణ జరుపుతున్నారు. మృతుడి మొబైల్ డేటా అన్నీ పరిశీలిస్తున్నారు. విచారణలో ప్రియురాలి పాత్ర అనుమానాస్పదంగా కనిపిస్తే ఆమెను కూడా విచారిస్తామని పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..