Shraddha Murder Case: అఫ్తాబ్ రెండో గాళ్‌ఫ్రెండ్ ఓ సైకాలజిస్ట్.. ఆమె అతడి గురించి ఏం చెప్పిందంటే..?
అఫ్తాబ్ హత్య తేదీని తప్పుగా చెబుతున్నట్టు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అతడి గురించి మరింత లోతైన సమాచారం సేకరిస్తున్నారు. అతడు చిన్నప్పుటి నుంచి ఎలా పెరిగాడో తెలుసుకుంటున్నారు.

శ్రద్ధా వాకర్ హత్య కేసులో రోజుకో రకమైన అప్ డేట్ నమోదవుతోంది. ఈరోజు తాజా సమాచారం ఏంటంటే.. శ్రద్ధావాకర్ హత్య ఎప్పుడు జరిగింది? ఆ తేదీలో ఏదైనా మార్పు ఉందా? అన్న ఉత్కంఠ ఎదురవుతోంది. మే 18 రాత్రి 9 గంటల సమయంలో తాను శ్రద్ధా వాకర్ ను హత్య చేశానని పోలీసులతో చెప్పాడు అఫ్తాబ్. సరిగ్గా గంట తర్వాత, అంటే పదింటికి యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసినట్టు చెప్పాడు. కావాలంటే తన ఫోన్ రికార్డులను కూడా చూడమని అంటున్నాడు. సరిగ్గా ఇక్కడే పోలీసులకు అనుమానం వస్తోంది. అఫ్తాబ్ చెబుతోన్న హత్య తేదీ కరెక్టా.. కాదా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇదేదో ఎత్తుగడలా ఉందని భావిస్తున్నారు ఢిల్లీ పోలీసులు. హత్య జరిగిన గంట లోగా ఒక వ్యక్తి ఇంత సాధారణంగా వ్యవహరించగలడా? అన్న దగ్గరే డౌట్ గా ఉందంటున్నారు నిపుణులు.
సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో నిందితులు ఎంతో ఒత్తిడితో ఉంటారు. తినడం గురించి ఆలోచించడం అసాధారణం. కొందరైతే.. కనీసం దాహం తీర్చుకోవాలని కూడా ఆలోచించరనీ.. ఇదేదే తేడాగా ఉందని అనుమానిస్తున్నారు పోలీసులు. అఫ్తాబ్ గురించి అతడి రెండో గాళ్ ఫ్రెండ్ కొన్ని ఇంపార్టెంట్ అప్ డేట్స్ అందించింది. బేసిగ్గా ఆఫ్తాబ్ కి రకరకాల ఆహారం అంటే ఎంతో ఇష్టమని.. మరీ ముఖ్యంగా వివిధ రెస్టారెంట్ల నుంచి మాంసాహార పదార్ధాలను ఆర్డర్ చేసేవాడనీ.. ఆయా రెస్టారెంట్లలోని చెఫ్ లు ఆహారాన్ని ఎలా అలంకరిస్తారనే దాని గురించి కూడా చెప్పేవాడనీ అంటారీమె.
ఇక ఆఫ్తాబ్ సిగరెట్లు ఎక్కువ తాగేవాడనీ. సరిగ్గా అదే సమయంలో ధూమ పానం మానేయడం గురించి తరచూ మాట్లాడేవాడనీ. అతడి ప్రవర్తన తనకు ఎంతో సాధారణంగా అనిపించేదనీ. అఫ్తాబ్ ఇతరులపై చూపే శ్రద్ధ కూడా ఎంతో మెరుగ్గా ఉండేదని. అతని మానసిక స్థితి చెడుగా ఉన్నట్టే తనకు అనిపించేది కాదనీ అందామె. అఫ్తాబ్ రెండో గాళ్ ఫ్రెండ్ అయిన ఈమె ఒక సైకాలజిస్ట్. ప్రస్తుతం ఈమె తీవ్రమైన షాక్ లో ఉండటంతో.. మానిసిక చికిత్స పొందుతోంది. డేటింగ్ యాప్ ల ద్వారా అఫ్తాబ్ కి ఇరవై మంది అమ్మాయిల వరకూ పరిచయాలున్నాయనీ గుర్తించారు పోలీసులు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి