Software Engineer: టెకీలకు కొత్త కష్టాలు.. ఇక ఈ జన్మలో పెళ్లియోగం లేనట్లే! నెట్టింట రచ్చ
కాలం మారుతోంది. ఖర్చులు పెరుగుతున్నాయి. వీటికి అనుగుణంగా సంపాదన కూడా ఉండాలని నేటి తరం యువత భావిస్తోంది. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా.. లక్షల్లో సంపాదన ఉన్నా యువతులు తమను పెళ్లాడేందుకు ఆసక్తి చూపడం లేదంటూ కొందరు టెకీలు తలలు పట్టుకుంటున్నారు. భారీ ప్యాకేజీ ఉన్న వారివైపే మొగ్గు చూపుతున్నారట. తాజా పరిణామం నెట్టింట కొత్త చర్చకు దారితీసింది. ఇందుకు సంబంధించిన..
కాలం మారుతోంది. ఖర్చులు పెరుగుతున్నాయి. వీటికి అనుగుణంగా సంపాదన కూడా ఉండాలని నేటి తరం యువత భావిస్తోంది. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా.. లక్షల్లో సంపాదన ఉన్నా యువతులు తమను పెళ్లాడేందుకు ఆసక్తి చూపడం లేదంటూ కొందరు టెకీలు తలలు పట్టుకుంటున్నారు. భారీ ప్యాకేజీ ఉన్న వారివైపే మొగ్గు చూపుతున్నారట. తాజా పరిణామం నెట్టింట కొత్త చర్చకు దారితీసింది. ఇందుకు సంబంధించిన సోసల్ మీడియా పోస్ట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకెళ్తే..
ఓ యువకుడు బాగా చదువుకుని ఇంజనీరింగ్ కొలువు కొట్టాడు. ఉద్యోగం వచ్చింది కదా అని రెండేళ్ల తర్వాత తల్లిదండ్రులు చూసిన అమ్మాయిని అరేంజ్‌డ్ మ్యారేజ్ చేసుకునేందుకు సిద్ధపడ్డాడు. అలా ఓ అమ్మాయిని చూసేందుకు వారి ఇంటికి వెళ్లారు. మాటల మధ్యలో వరుడి వార్షిక వేతనం ఎంత అని వధువు తరపు బంధువులు ప్రశ్నించారు. రూ.8 లక్షలు అని వరుడు సమాధానం చెప్పాడు. దీంతో వెంటనే వధువు సదరు పెళ్లి సంబంధాన్ని తిరస్కరించింది. కారణం ఏంటని ప్రశ్నించగా తనకు ఉద్యోగం లేదని, వరుడికి కనీసం ఏడాదికి రూ.25 లక్షల జీతం ఉంటే తప్ప కుటుంబం గడవదని ఇంత తక్కువ జీతంతో కుటుంబాన్ని నడపడం కష్టమని వివరణ ఇచ్చింది. వధువు సమాధానం విని వరుడు తరపు బంధువులు నోరెల్ల బెట్టారు.
One of my engineer friend who is earning 8LPA and it’s been only two years of his job and belongs to a well to do baniya family got rejected for arranged marriage by a girl who left her job last year because she felt exhausted and not she’s not doing anything now…reason for
— IMG🩺 (@peacehipeace) April 3, 2024
ఏడాదికి రూ.8 లక్షల ప్యాకేజీ ఉన్న తనను వివాహం చేసుకునేందుకు ఓ యువతి తిరస్కరించిందని తన గోడును స్నేహితునికి చెప్పుకుని గొల్లుమన్నాడు. దీంతో సదరు స్నేహితుడు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఏడాదికి రూ.8 లక్షలు సంపాదించే తన ఇంజనీర్ ఫ్రెండ్ వివాహ కష్టాలు తెలిపాడు. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. నెట్టింట పోస్ట్ చేసిన ఒక్క రోజులోనే 5.1లక్షల వీక్షణలు, వేలల్లో లైక్స్ వచ్చాయి. అయితే.. చాలా మంది ఆ వదువుకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.
‘పర్లేదు. అంచనాలు పెట్టుకోవడంలో తప్పేముంది? పెళ్లికి ముందే ఆమె తన అంచనాలను స్పష్టంగా వెల్లడించింది. ఇది అబ్బాయికి సదావకాశం. రాబోయే 2-4 సంవత్సరాలలో తన వార్షిక వేతనం రూ. 25 లక్షలకు పెంచుకునే పనిలో ఉంటాడు. లేదంటే ఏడాదికి రూ.5 లక్షలు ఆశించే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు అంటూ ఓ యూజర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. దంపతులు మెట్రో నగరంలో నివసించాల్సి వస్తే ఏడాదికి రూ.8 లక్షలు చాలా తక్కువ. కనీసం రూ.15 లక్షలైనా ఉండాలని మరో యూజర్ వాస్తవాన్ని అంగీకరించాల్సిందేనని రాసుకొచ్చాడు. ఏదైమైనా ఇదే ట్రెండ్ మనుముందు కొనసాగితే టెకీలంతా పెళ్లికాని ప్రసాదులై పోతారేమో.. నని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇంతకీ మీరేమంటారు..?
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.