PM Narendra Modi: ప్రధాని మోదీ అకౌంట్ హ్యాక్‌‌పై స్పందించిన ట్విట్టర్.. ఏమని చెప్పిందంటే..?

Twitter Responds: ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ ఆదివారం తెల్లవారుజామున హ్యాక్ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశంలో కలకలం రేపింది. ఆదివారం తెల్లవారుజామున

PM Narendra Modi: ప్రధాని మోదీ అకౌంట్ హ్యాక్‌‌పై స్పందించిన ట్విట్టర్.. ఏమని చెప్పిందంటే..?
Pm Narendra Modi Twitter
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 12, 2021 | 11:42 AM

Twitter Responds: ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ ఆదివారం తెల్లవారుజామున హ్యాక్ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశంలో కలకలం రేపింది. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ప్రధాని మోదీ వ్యక్తిగత ట్విటర్‌ అకౌంట్‌లో బిట్‌కాయిన్‌లు కొనాలంటూ ఆగంతకులు పోస్టు చేశారు. భారత్‌లో బిట్‌కాయిన్‌ను లీగల్‌ చేశారని, ప్రభుత్వం 500 బిట్‌కాయిన్లను కొనుగోలు చేసి ప్రజలకు పంచుతుందన్న లింక్‌లను ఆగంతకులు పోస్ట్‌ చేశారు. దీంతో ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) వెంటనే ట్విటర్‌కు సమాచారం అందించగా.. కాసేపటి తర్వాత ఈ అకౌంట్ పునరుద్ధరణ జరిగిందంటూ పీఎంఓ ప్రకటించింది. హ్యాకింగ్‌ సమయంలో ట్వీట్‌లను పట్టించుకోవద్దని ప్రధాని కార్యాలయం విజ్ఞప్తి చేసింది. అయితే.. ప్రధాని మోదీ ఖాతా హ్యాకింగ్‌పై ఘటనపై ట్విట్టర్ స్పందించింది.

ఈ హ్యాకింగ్ గురించి తెలిసిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ హ్యాండిల్‌ను భద్రపరచడానికి అవసరమైన చర్యలు తీసుకున్నట్లు ట్విట్టర్ ఆదివారం స్పష్టం చేసింది. ప్రధాన మంత్రి కార్యాలయంతో తాము 24X7 ఓపెన్ లైన్‌లను కలిగి ఉన్నామమని.. దీని గురించి తమకు తెలిసిన వెంటనే తమ బృందాలు ఖాతాను భద్రపరచడానికి అవసరమైన చర్యలు తీసుకున్నాయని తెలిపింది. ఈ సమయంలో ఇతర ప్రభావిత ఖాతాల సంకేతాలు ఏవీ లేవని తమ పరిశోధనలో వెల్లడైందంటూ ట్విట్టర్ ప్రతినిధి వెల్లడించారు. ఈ సమాచారం వచ్చిన వెంటనే ఆ ట్వీట్‌ను తొలగించి.. ప్రధాని మోదీ ట్విట్టర్‌ ఖాతాను రీస్టోర్‌ చేసినట్లు వెల్లడించింది.

కాగా.. ఈ ఘటన దేశంలో కలకలం సృష్టించింది. భారత ప్రభుత్వం.. క్రిప్టోకరెన్సీలపై బిల్లును ప్రవేశపెట్టేందుకు సమాయత్తమవుతున్న సమయంలో ఇలా జరగడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో కొందరు ఆగంతకులు తప్పుడు వాగ్దానాలతో పెట్టుబడులను ఆకర్షించేందుకు క్రిప్టో కరెన్సీలను ఉపయోగించుకుని, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులను మళ్ళించే అవకాశం ఉందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది.

కాగా.. అంతకుముందు 2020 సెప్టెంబర్ ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత వెబ్‌సైట్, మొబైల్ యాప్‌ను అప్‌డేట్ చేసే ట్విట్టర్ ఖాతాను గుర్తుతెలియని ఆగంతకులు హ్యాక్ చేసిన సంగతి తెలిసిందే.

Also Read:

Modi Twitter Account Hacked: ప్రధాని నరేంద్రమోడీ ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్‌..!

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..