Elections 2024: రాముడు vs రిజర్వేషన్స్‌.. ఇవే ఈ ఎన్నికల్లో హాట్ టాపిక్స్

దేశవ్యాప్తంగా జనరల్‌ ఎలక్షన్స్‌ జరుగుతున్న వేళ... జనం మద్దతు కూడగట్టేందుకు ప్రధాన పార్టీలు పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నాయి. అందులో భాగంగానే ఒకరు రాముణ్ని నమ్ముకుంటే... మరొకరు రిజర్వేషన్ల అంశాన్ని ఎత్తుకున్నారు. తాజాగా, బుల్డోజర్లు కూడా... మరోసారి పొలిటికల్‌ తెరమీదకు వచ్చాయి. ఐదోదశ ఎన్నికల ప్రచారంలో భాగంగా... ప్రత్యర్థులను టార్గెట్‌ చేస్తూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అదే స్థాయిలో కాంగ్రెస్‌ కూడా కౌంటర్ ఇస్తుండటంతో... ఉత్తరాదిన ఎన్నికల రాజకీయం కుతకుతలాడుతోంది. వ్యవహారం కాస్తా.. రాముడు వర్సెస్‌ రిజర్వేషన్స్‌ అన్నట్టుగా మారింది.

Elections 2024: రాముడు vs రిజర్వేషన్స్‌.. ఇవే ఈ ఎన్నికల్లో హాట్ టాపిక్స్
Weekend Hour Debate
Follow us
Ram Naramaneni

|

Updated on: May 18, 2024 | 7:13 PM

దేశంలో ఎన్నికల రాజకీయం పూర్తిగా మతంరంగు పులుముకుంది. గడిచిన నాలుగుదశలు ఒకెత్తు… ఆ తర్వాత జరిగే దశలు మరోఎత్తు అన్నట్టుగా ఎన్నికలవేడి పతాకస్థాయికి చేరింది. ఇప్పటికే హిందూ, ముస్లిం అంటూ… రిజర్వేషన్ల అంశం రచ్చరంబోలా చేస్తుండగా… తాజాగా ప్రధాని మోదీ చేసిన కామెంట్స్‌ మరో రేంజ్‌ దుమారానికి నాంది వేశాయి.

ఐదోదశ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. యూపీలో పర్యటించిన మోదీ, అయోధ్య రామాలయం కేంద్రంగా కూటమి పార్టీలపై విమర్శలు ఎక్కుపెట్టారు. కాంగ్రెస్‌, ఎస్పీ గెలిస్తే.. అయోధ్యలో రామమందిరంపైకి బుల్డోజర్లు తోలుతారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మోదీ. బుల్డోజర్‌ ఎలా వాడాలో యోగి దగ్గర నేర్చుకోవాలంటూ విపక్షాలకు చురకలంటించారు.

అయితే బుల్డోజర్ల సంస్కృతిని తీసుకొచ్చిందే బీజేపీ అంటోంది కాంగ్రెస్‌ పార్టీ. విద్వేషాలు రెచ్చగొట్టేందుకే ప్రధాని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించింది. ఫైజాబాద్‌ కోర్టు తీర్పును గౌరవించి 1989లోనే రాజీవ్‌గాంధీ.. అయోధ్యలో రాముడి గుడికి అంకురార్పణ చేశారని చెబుతోంది. అప్పుడు మోదీ ఎక్కడున్నారో చెప్పాలని ప్రశ్నిస్తోంది.

ఇక, దర్యాప్తు సంస్థలకు సంబంధించి ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలకు అదేస్థాయిలో కౌంటరిచ్చారు మోదీ. అవినీతి కేసుల్లో ఈడీ జప్తు చేస్తున్న సొమ్మునంతా.. ప్రజలకు పంచుతామని చెప్పారు. గతంలో ఈడీ నిరుపయోగంగా ఉండేదన్న ఆయన.. తమ హయాంలోనే అది మెరుగ్గా పనిచేస్తోందన్నారు.

మరోసారి బీజేపీ వస్తే రిజర్వేషన్లకు మంగళం పాడేస్తారని కాంగ్రెస్‌ అంటుంటే… కాంగ్రెస్‌ వస్తే రాముడి గుడికి డేంజర్‌ అంటోంది బీజేపీ. రాముడు వర్సెస్‌ రిజర్వేషన్స్‌గా మారిన ఎన్నికల సమరంలో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!