AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kyrgyzstan: కిర్గిస్థాన్‌లో భారతీయ విద్యార్ధులే లక్ష్యంగా దాడులు.. అల్లర్లలో చిక్కుకున్న తెలుగు విద్యార్ధులు!

కిర్గిస్థాన్‌లో పరిస్థితి చేజారిపోతోంంది. విదేశీ విద్యార్ధులు ముఖ్యంగా భారతీయ విద్యార్ధులే లక్ష్యంగా అల్లరి మూకలు దాడులకు పాల్పడుతున్నాయి. కిర్గిస్థాన్‌లో మెడిసిన్‌ చదవడానికి వెళ్లిన తెలుగు విద్యార్థులు కూడా ప్రాణభయంతో వణికిపోతున్నారు. తమను కాపాడాలని కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు.

Kyrgyzstan: కిర్గిస్థాన్‌లో భారతీయ విద్యార్ధులే లక్ష్యంగా దాడులు.. అల్లర్లలో చిక్కుకున్న తెలుగు విద్యార్ధులు!
Bishkek Mob Violence
Balaraju Goud
|

Updated on: May 18, 2024 | 6:22 PM

Share

కిర్గిస్థాన్‌లో పరిస్థితి చేజారిపోతోంంది. విదేశీ విద్యార్ధులు ముఖ్యంగా భారతీయ విద్యార్ధులే లక్ష్యంగా అల్లరి మూకలు దాడులకు పాల్పడుతున్నాయి. కిర్గిస్థాన్‌లో మెడిసిన్‌ చదవడానికి వెళ్లిన తెలుగు విద్యార్థులు కూడా ప్రాణభయంతో వణికిపోతున్నారు. తమను కాపాడాలని కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు.

కిర్గిస్థాన్‌ రాజధాని బిష్కెక్‌లో గత రెండు రోజులుగా స్థానికులు, విదేశీ విద్యార్థులకు మధ్య ఘర్షణలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన విద్యార్థులపై దాడులకు చేస్తున్నారు. ఈ హింసాత్మక సంఘటనల్లో ఇప్పటికే ముగ్గురు పాకిస్తానీ విద్యార్థులు మరణించినట్లు నివేదికలు ఉన్నాయి. భారత్, పాకిస్తాన్ దేశాలు తమ పౌరులను ఇళ్లకే పరిమితం కావాలని సలహాలు జారీ చేసింది. స్థానిక నివేదికల ప్రకారం.. పాకిస్తానీ, ఈజిప్టు విద్యార్థులతో స్థానికులకు హాస్టల్‌లో గొడవ జరిగిందని ఇదే హింసకు కారణమైందని తెలుస్తోంది.

కాగా, ఈ గొడవలకు సంబంధించి ముగ్గురు విదేశీయులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉంది, విద్యార్థులు ప్రస్తుతానికి ఇంట్లోనే ఉండాలని సూచించారు” అని భారత కాన్సులేట్ ట్వీట్ చేసింది.

కాగా, శుక్రవారం రాత్రి నుంచి ఘర్షణలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వైరల్ వీడియోలో, ముగ్గురు విద్యార్థులు బాధాకరమైన పరిస్థితిని వివరిస్తున్నారు. స్థానికులు, ఈజిప్టు విద్యార్థుల మధ్య గొడవ తర్వాత గుంపులుగా అంతర్జాతీయ విద్యార్థులపై దాడి చేయడం ప్రారంభించాయని విద్యార్థి ఒకరు చెప్పారు. ఆరుగురు విద్యార్థులు తమ జాతీయతను పేర్కొనకపోయినప్పటికీ దాడికి తెగబడ్డారని తెలిపారు. అంతర్జాతీయ విద్యార్థులకు పోలీసులు సహాయం చేయడం లేదని పేర్కొంటున్నారు. మరోవైపు పరిస్థితి నిలకడగా ఉందని, ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా పోలీసులు ఆందోళనకారులతో చర్చలు జరిపారని కిర్గిజ్‌స్థాన్ ప్రభుత్వం తెలిపింది.

ఇదిలావుంటే, తణుకు ఉండ్రాజవరంకు చెందిన సజ్జా శ్రీకాంత్ కిర్గిస్థాన్‌లో లో ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. అక్కడ చిక్కుకున్న వారిలో మంచిర్యాలకు చెందిన నిఖిత, కాకినాడకు చెందిన దయ, రాజమండ్రికి చెందిన పలువురు వైద్య విద్యార్దులు ఉన్నారు. దీంతో వాళ్ల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తమ పిల్లలను ఎలాగైనా సురక్షితంగా కాపాడాలని వేడుకుంటున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..