AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధం ఆపేందుకు వారిని బెదిరించాను! మరోసారి ట్రంప్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత్-పాకిస్తాన్ మధ్య అణు యుద్ధాన్ని తాను అరికట్టానని ప్రకటించారు. రెండు దేశాలకు 24 గంటల గడువు ఇచ్చి, వాణిజ్యాన్ని ఆయుధంగా ఉపయోగించారని తెలిపారు. మే నెలలోని ఉద్రిక్తతలను గురించి వివరిస్తూ, ట్రంప్ తన జోక్యాన్ని ప్రశంసించుకున్నారు.

భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధం ఆపేందుకు వారిని బెదిరించాను! మరోసారి ట్రంప్‌ వివాదాస్పద వ్యాఖ్యలు
Trump Pm Modi Pak Army
SN Pasha
|

Updated on: Aug 26, 2025 | 6:50 AM

Share

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతను తానే ఆపినట్లు ప్రకటించుకున్నారు. అణు యుద్ధానికి దారి తీయబోతుంటే తానే దాన్ని ఆపేసినట్లు ఆయన పేర్కొన్నారు. “నేను ఈ యుద్ధాలన్నింటినీ ఆపాను. భారత్‌, పాకిస్తాన్ మధ్య పెద్ద యుద్ధం అయ్యేది. భారత్‌, పాకిస్తాన్‌తో యుద్ధం అణు యుద్ధం కాబోతోన్న తదుపరి స్థాయి.. వారు ఇప్పటికే ఏడు జెట్‌లను కూల్చివేశారు” అని ట్రంప్ అన్నారు.

24 గంటల్లో రెండు దేశాలు పోరాటం ఆపే వరకు వాణిజ్యం ఉండదని తాను బెదిరించానని కూడా ఆయన అన్నారు. నేను ‘మీరు వ్యాపారం చేయాలనుకుంటున్నారా? మీరు పోరాడుతూనే ఉంటే మేము మీతో ఎటువంటి వ్యాపారం చేయం, దాన్ని పరిష్కరించడానికి మీకు 24 గంటల సమయం ఉంది’ అని అన్నాను. వారు ‘సరే, ఇక యుద్ధం ఆపేస్తాం’ అని అన్నారు. నేను దానిని చాలా సందర్భాలలో ఉపయోగించాను. యుద్ధం ఆపేందుకు వాణిజ్యంతో ఉపయోగించాల్సిన ప్రతిదాన్ని ఉపయోగించాను అని ట్రంప్‌ పేర్కొన్నారు. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లను నాశనం చేయడానికి భారత్‌ ఆపరేషన్ సిందూర్ తర్వాత మే నెలలో భారత్‌ పాక్‌ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి .

ఏప్రిల్ 22న కాశ్మీర్‌లోని పహల్గామ్ దాడిలో 26 మంది పౌరులు మరణించినందుకు ప్రతీకారంగా ఈ చర్య తీసుకుంది భారత ప్రభుత్వం. పోరాటం ఆగిపోయే ముందు అంటే మే 7-10 నుండి రెండు దేశాలు తీవ్ర ఉద్రిక్తతను చవిచూశాయి. ట్రంప్ అనేక సందర్భాల్లో తాను సంధిలో పాల్గొన్నానని పేర్కొన్నప్పటికీ, భారతదేశం దానిని తిరస్కరించింది, భారత్‌, పాక్‌ కాల్పుల విరమణకు అంగీకరించడానికి DGMO స్థాయి చర్చలు జరిగాయని పేర్కొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి