భారత అమ్ములపొదిలో ‘సుదర్శన చక్రం’!.. అందుబాటులోకి ‘ఇంటిగ్రేటెడ్ ఎయిర్‌డిఫెన్స్ వెపన్ సిస్టమ్’
నాగాస్త్రం.. పౌరాణిక సినిమాల్లోనే విని ఉంటాం. ఓ ఐదు రోజుల క్రితం DRDO అగ్ని-5 ప్రయోగించింది. జనరల్‌గా బాలిస్టిక్ మిస్సైల్ గీత గీసినట్టు స్ట్రైయిట్‌గా వెళ్తుంది. కాని, అగ్ని-5 పాము వెళ్లినట్టు జిగ్‌జాగ్‌గా వెళ్లింది. అంటే.. ఒక నాగాస్త్రంలా. ఆ వీడియో చూసి అగ్ని-5 లక్ష్యాన్ని ఛేదించలేకపోయిందని రాసుకొచ్చింది పాక్ మీడియా. బట్.. శత్రువుల మిస్సైల్స్, రాడార్‌కు అందకుండా DRDO వాడిన టెక్నాలజీ అది. ఆమాత్రం బ్రెయిన్ వాడలేకపోయింది పాక్. అగ్ని మిస్సైల్స్‌పై పాక్ ఏడుపు ఎలాంటిదంటే.. భారత మిస్సైల్ టెక్నాలజీని ఆపలేకపోతే చైనా, అమెరికాకు సైతం యుద్ధంలో ఓటమి తప్పదని రాసింది. చైనాను కాదని భారత్‌పైనే అమెరికా టారిఫ్స్ ఎందుకంటే.. ఇదిగో ఇలా ఇందుకే అని ఒక థియరీ ఉంది. సరే.. ఇంతకీ ఈ ప్రస్తావన ఎందుకు? మొన్న శనివారం.. ఇంటిగ్రేటెడ్ ఎయిర్‌డిఫెన్స్ వెపన్ సిస్టమ్ పరీక్ష విజయవంతం అయింది. S-400పైనే ఆధారపడకుండా సొంతంగా తయారుచేసుకుంటున్న శత్రు దుర్భేద్య కవచం అది. ఈ మంగళవారం.. శత్రువులు కళ్లు తెరిచేలోపే అటాక్ చేసి వచ్చేసే ఫ్రిగేటర్స్‌ను దింపుతోంది ఇండియన్ నేవీ. సుదర్శన చక్రం రాబోతోంది అని ఆగస్ట్ 15న ఎర్రకోట వేదికగా మోదీ ఇచ్చిన స్టేట్‌మెంట్ నిజమవుతోంది. గత వారం రోజులుగా భారత రక్షణరంగం సాధిస్తున్న విజయాలు శత్రువులకు నిద్రలేకుండా చేస్తున్నాయ్. ఆ డిటైల్స్ మరింత క్లారిటీగా....

ఆపరేషన్ సింధూర్‌లో బ్రహ్మోస్ పవర్ ఏంటో తెలిశాక.. ‘మేమిచ్చిన F-16 యుద్ధ విమానాలను అర్జెంట్‌గా ఎక్కడైనా దాచేయ్’ అని పాక్‌ను అలర్ట్ చేసింది అమెరికా. INS విక్రాంత్ అరేబియా సంద్రంలో అడుగుపెట్టిందని తెలియగానే.. చైనా, తుర్కియే ఇచ్చిన వార్‌షిప్స్‌ను గ్వాదర్ పోర్టులో దాచేశారు. పాక్ దగ్గరున్న అమెరికా వార్ షిప్పులను సివిల్ పోర్టులో ఎవరికీ కనిపించకుండా కవర్ చేశారు. కరాచీ నేవీ బేస్ నుంచి ఒక్కరు కూడా బయటకు రాలేకపోయారు ఆపరేషన్ సింధూర్ టైమ్‌లో. దటీజ్.. ఇండియన్ నేవీ పవర్. ఇండియన్ నేవీ అనే పేరెత్తగానే గజగజ వణికిపోతుంటుంది పాక్. అలాంటిది.. మరో రెండు వార్‌షిప్స్ రంగంలోకి దిగుతున్నాయ్. అది కూడా విశాఖ సముద్రతీరం నుంచి. వాటిని చూస్తే కాదు.. వాటి గురించి విన్నా చాలు పాక్ షేక్ అవ్వాల్సిందే. చైనా ఆయుధ సంపత్తి అంత ఇంత అని మాట్లాడుతుంటారు గానీ.. చాలావరకు రష్యా ఆయుధాలనే రివర్స్ ఇంజనీరింగ్ చేసి తయారుచేసుకుంది చైనా. చైనా తయారుచేసిన ఆయుధాలు బీభత్సం సృష్టించాయి అని ఇప్పటి వరకు ఎక్కడా ప్రూవ్ కాలేదు కూడా. అలాంటి ఆయుధాలను అరువుకు తెచ్చుకుని వాడుతోంది పాకిస్తాన్. ఇక యూకే, ఫ్రాన్స్ దగ్గర అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వెపన్స్ ఉన్నాయ్. బట్.. కొంత టెక్నాలజీని అమెరికా నుంచి అరువు తెచ్చుకున్నాయి ఆ దేశాలు. ఇక పాకిస్తాన్‌కైతే.. సొంతంగా చిన్న మిస్సైల్‌ను కూడా తయారుచేయడం చేతకాదు. బట్.. భారత్ అలా కాదు. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో...




