AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Children missing: ఒకే ఊర్లో ముగ్గురు అమ్మాయిలు మిస్సింగ్.. ఇంట్లో దొరికిన లేఖలు.. వాటిలో ఏముందంటే..

పిల్లలు కనిపించకుండా పోయి 9 రోజులు కావస్తున్నా ఇప్పటికీ ఆచూకీ లభించకపోవటంతో వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ లేకుండా పోయింది. 

Children missing: ఒకే ఊర్లో ముగ్గురు అమ్మాయిలు మిస్సింగ్.. ఇంట్లో దొరికిన లేఖలు.. వాటిలో ఏముందంటే..
Children Missing
Jyothi Gadda
|

Updated on: Sep 14, 2022 | 11:23 AM

Share

Children missing: ముగ్గురు బాలికల మిస్సింగ్‌ మిస్టరీ కలకలం రేపుతోంది. ముగ్గురు విద్యార్థినులు అదృశ్యం కావడంపై వారి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పులకేశినగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కనిపించకుండా పోయిన చిన్నారులు శక్తిశ్వరి (15), వారుణిక (16), నందిని (15) లుగా తెలిసింది. సెప్టెంబర్ 6న బెంగళూరు ప్రొమెనేడ్ రోడ్డులోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ హై ప్రైమరీ స్కూల్ నుంచి బాలికలు అదృశ్యమయ్యారు. పిల్లలు కనిపించకుండా పోయి 9 రోజులు కావస్తున్నా ఇప్పటికీ ఆచూకీ లభించకపోవటంతో వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ లేకుండా పోయింది.  పాఠశాలలో ఆరాతీయగా సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పాఠశాల యాజమాన్యాన్ని తీరుపై పేరెంట్స్ మండిపడుతున్నారు. మరోవైపు ఇంట్లో సమస్యలు ఉన్నాయని, కాబట్టి తామే ఇంటి నుండి వెళ్లిపోతున్నామని, మాకు చదువుకోవడం ఇష్టం లేదని ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నామని లేఖ రాసి బాలికలు ఇంటి నుంచి అదృశ్యమయ్యారు.

ఇదిలా ఉంటే, బెళగావి జిల్లాలోని పలు ప్రాంతాల్లో చిన్నారుల దొంగలన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పిల్లలను దొంగిలించి వారి శరీర భాగాలను తొలగించి విక్రయిస్తున్నారని వదంతులు వ్యాపిస్తున్నాయి. బెళగావి జిల్లాలో ఇలాంటి ఘటనలు జరగలేదు. నందగడలో రగ్గులు అమ్మేవారిని పట్టుకుని పిల్లల దొంగలుగా గుర్తించారు. మరో సందర్భంలో అనారోగ్యంతో ఉన్న వ్యక్తి పిల్లల దొంగ అని చెప్పారు. అతడికి మానసిక వ్యాధి ఉందని తెలియడంతో కుటుంబసభ్యులకు చేర్చారు. కౌజలగి గ్రామంలో కనిపించే వారు సాధువులు, ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. బెల్గాం జిల్లాలో ఇప్పటి వరకు పిల్లల చోరీ కేసులు లేవు. దీన్ని ఎవరూ నమ్మకూడదు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దంటూ పోలీసులు కోరుతున్నారు.. మీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు కనిపిస్తే బాంద్రా 112కి కాల్ చేయండి. ఈ విషయంలో జిల్లా ప్రజలు సహకరించాలని ఎస్పీ డా.సంజీవ పాటిల్ విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి