లోకోపైలట్ నిర్లక్ష్యం.. దెబ్బకు రైలును ప్లాట్‌ఫారం ఎక్కించేశాడు..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర రైల్వే స్టేషన్లో ప్రమాదం జరిగింది. అక్కడ ఓ లోకో పైలట్ వీడియో కాల్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. దీంతో అక్కడ ఆగి ఉన్నటువంటి రైలు కాస్తా ప్లాట్‌ఫారంపైకి దూసుకెళ్లి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. అయితే ప్రమాదంలో ఒక మహిళ కరెంట్ షాక్‌కు గురయ్యారు. అయితే ఇందుకు సంబంధించినటువంటి వీడియో కూడా సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో ఆ లోకపైలట్ వ్యవహరించిన తీరు బయటపడింది. ఈ వీడియోలో గమనిస్తే ఢిల్లీలోని షకుర్ బస్తీ నుంచి వచ్చినటువంటి ఎలెక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్(ఈఎంయూ) అనే రైలు మధుర జంక్షన్ స్టేషన్‌కు చేరుకొంది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర రైల్వే స్టేషన్లో ప్రమాదం జరిగింది. అక్కడ ఓ లోకో పైలట్ వీడియో కాల్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. దీంతో అక్కడ ఆగి ఉన్నటువంటి రైలు కాస్తా ప్లాట్‌ఫారంపైకి దూసుకెళ్లి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. అయితే ప్రమాదంలో ఒక మహిళ కరెంట్ షాక్‌కు గురయ్యారు. అయితే ఇందుకు సంబంధించినటువంటి వీడియో కూడా సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో ఆ లోకపైలట్ వ్యవహరించిన తీరు బయటపడింది. ఈ వీడియోలో గమనిస్తే ఢిల్లీలోని షకుర్ బస్తీ నుంచి వచ్చినటువంటి ఎలెక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్(ఈఎంయూ) అనే రైలు మధుర జంక్షన్ స్టేషన్‌కు చేరుకొంది. అయితే అప్పటివరకు విధులు నిర్వహించిన లోకోపైలట్ రైలు ఆగిన అనంతరం కిందకు దిగాడు. దీంతో అంతలో సచిన్ అనే మరో లోకో పైలన్ విధులు నిర్వహించడానికి ఫోన్లో వీడియో కాల్ మాట్లాడుతూనే రైలులోకి ఎక్కాడు. అయితే ఆ వీడియో కాల్‌లో బిజీగా ఉన్న సచిన్.. తన భుజానికున్నటువంటి బ్యాగును తీసి అక్కడ ఉన్న ఇంజిన్ రాడ్ పైన పెట్టాడు.
मथुरा ट्रेन हादसे के समय मोबाइल देख रहा था ड्राइवर। CCTV से ट्रेन के प्लेटफॉर्म पर चढ़ने का राज खुला। इसका वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है।
ఇవి కూడా చదవండి#MathuraJunction #TrainAccident #CCTV pic.twitter.com/muia6Zu2Gi
— FirstBiharJharkhand (@firstbiharnews) September 28, 2023
అయితే ఆ బరువుకు ఇంజిన్ హ్యాండిల్ ముందుకు కదలింది. దీంతో ఆ రైలు ముందుకు వెళ్లింది. అయితే ఇలా రైలు కదులుతున్న విషయాన్ని కూడా ఆ లోకోపైలట్ సచిన్ గమనించకుండా వీడియో కాల్‌లో బిజీగా ఉన్నాడు. అయితే చూస్తుడంగానే.. ఆ రైలు ప్లాట్‌ఫామ పైకి దూసుకెళ్లి.. అక్కడ ఉన్నటువంటి ఓ కరెంటు స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం వల్ల ఓ మహిళ కరెంట్ షాక్‌కు గురైంది. దీంతో ఆమెను హుటాహుటీనా సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఈ ఘటన జరిగిన సమయంలో… రైలులోని ప్రయాణికులంతా రైలు దిగిపోయారు. దీంతో పెను ప్రమాదం తప్పిందంటున్నారు అక్కడున్న ప్రయాణికులు. అయితే ఈ ప్రమాదం వల్ల మాల్వా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, అమృత్‌సర్-బాంద్రా ఎక్స్‌ప్రెస్ అలాగే దక్షిణ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అంతరాయం కలిగింది. దీంతో వెంటనే స్పందించిన రైల్వే యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి సచిన్‌తో పాటు.. మరో నలుగురిని కూడా సస్పెండ్ చేసింది.
यूपी के मथुरा में एक अजीबोगरीब हादसे में मथुरा जंक्शन रेलवे स्टेशन पर एक लोकल ट्रेन प्लेटफॉर्म से टकरा गई. किसी के हताहत होने की सूचना नहीं है.#Mathura #MathuraJunction pic.twitter.com/ODdtgKinUl
— iMayankofficial 🇮🇳 (@imayankindian) September 26, 2023