ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం 10 గంటలకు జాతినుద్ధేశించి ప్రసంగించనున్నారు. 21 రోజుల పాటు లాక్‌డౌన్ ఈ రోజుతో ముగియనున్న విషయం తెలిసిందే. కాగా.. ఇప్పటికే తెలంగాణతో పాటు పలు ప్రాంతాల్లో మరో రెండు వారాలపాటు లాక్‌డౌన్ పొడిగించాయి. అయితే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పొడిగిస్తారా? లేదా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. కాగా ఆర్థిక కార్యకలాపాలు కూడా కొనసాగించేందుకు కొన్ని నిబంధనలను సడలింపు చేస్తారని ఇప్పటికే కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రధాని ప్రసంగానికి ప్రాధాన్యమేర్పడింది. అలాగే భౌతిక దూరం పాటించేందుకు అనువుగా లాక్‌డౌన్‌ను పొడిగించినప్పటికీ ఆర్థిక కార్యకలాపాలను నడిపంచేందుకు వీలుగా కొన్ని మినహాయింపులను ప్రధాని ప్రకటించవచ్చునని అంచనా. కొన్ని రాష్ట్రాలు ఏప్రిల్ 30వ తేదీవరకూ లాక్‌డౌన్‌ను కొనసాగించాలని మొగ్గు చూపుతుండగా.. మరికొన్ని రాష్ట్రాలు ఆర్థిక కార్యకలాపాలను మొదలు పెట్టడం కూడా ముఖ్యమన్న ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళుతోందని ఓ కేంద్ర ప్రభుత్వ అధికారి తెలిపారు.
ఇవి కూడా చదవండి:
జూ.ఎన్టీఆర్ కెరీర్‌లో విడుదల కాని ఫస్ట్ సినిమా ఇదే..!
రిలయన్స్ శాస్త్రవేత్తల పరిశోధన.. సముద్ర నాచుతో కరోనాకి చెక్?
లాక్‌డౌన్-2.0కు మార్గదర్శకాలు సిద్ధం చేస్తోన్న కేంద్రం
సీఎం కేసీఆర్ చెప్పిన ‘హెలికాఫ్టర్ మనీ’కి అర్థమేంటంటే..?