21 రోజుల లాక్‌డౌన్ దెబ్బకి.. రూ.8 లక్షల కోట్ల నష్టం

21 రోజుల లాక్‌డౌన్ దెబ్బకి.. రూ.8 లక్షల కోట్ల నష్టం

ఇప్పటికే కరోనా లాక్‌డౌన్‌ దెబ్బకి దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తాం చిన్నాభిన్నమైంది. దేశంలో భారీ కంపెనీలు, పరిశ్రమలు, ఫ్యాక్టరీలు అన్నీ మూతపడ్డాయి. అన్ని రకాల వ్యాపారాలూ కుదేలయ్యాయి. విమానాలు రన్‌వేకి అతుక్కుపోయాయి. రైళ్లు, బస్సులు ఎక్కడికక్కడ ని..

TV9 Telugu Digital Desk

| Edited By:

Apr 14, 2020 | 8:49 AM

ఇప్పటికే కరోనా లాక్‌డౌన్‌ దెబ్బకి దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తాం చిన్నాభిన్నమైంది. దేశంలో భారీ కంపెనీలు, పరిశ్రమలు, ఫ్యాక్టరీలు అన్నీ మూతపడ్డాయి. అన్ని రకాల వ్యాపారాలూ కుదేలయ్యాయి. విమానాలు రన్‌వేకి అతుక్కుపోయాయి. రైళ్లు, బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దాదాపు ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఫలితంగా ఆర్థిక వ్యవస్థకు దాదాపు రూ.7 నుంచి 8 లక్షల కోట్ల నష్టం జరిగినట్లు అంచనా వేశారు వ్యాపార విశ్లేషకులు.

కరోనా వైరస్‌కి చెక్ పెట్టేందుకు మార్చి 25న ప్రధాని నరేంద్ర మోదీ 21 రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ విధించింది మంచికే అయినా.. దాని దెబ్బకి ఎక్కడి కార్యకలాపాలు అక్కడ ఆగిపోయాయి. మనుషుల ద్వారా, వస్తువుల ద్వారా సోకే వైరస్ కావడంతో ఇవన్నీ ఆగిపోక తప్పలేదు. దీంతో ఎగుమతులు, దిగుమతులు, పెట్టుబడులు అన్నీ స్తంభించిపోయాయి. నిత్యవసరాలు, అత్యవసరాలు, మందులు మాత్రమే ప్రస్తుతానికి వాడుకలో ఉన్నాయి. అలాగే వ్యవసాయానికి సంబంధించిన అన్ని రంగాలకు ప్రధాని పర్మిషన్ ఇచ్చారు.

ఇప్పటికే అభివృద్ధి దశలో ఉన్న భారత్‌కు ఈ కరోనాతో మరింత వృద్ధి రేటు పడిపోయిందనే చెప్పాలి. దీనిపై ప్రపంచ బ్యాంక్‌ కూడా అంచనా వేసింది. దాదాపు రోజూ భారత్‌కి రూ.35 వేల కోట్ల నష్టం కలుగుతోంది. అలాగే చిన్న, మధ్య, పెద్ద తరహా పరిశ్రమల మూసివేత కారణంగా 45 కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. కాగా ప్రస్తుతం గనుక మోదీ పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను ఎత్తివేసి.. కొన్ని వెసులుబాట్లు కల్పిస్తే.. అది ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. అలా కాకుండా ఇంకా లాక్‌డౌన్‌ కొనసాగిస్తే మాత్రం దేశం నష్టాల్లోకి జారిపోయే ప్రమాదం ఉంది. కరోనా కట్టడికి లాక్‌డౌన్ ఎంత మంచిదో.. ఆర్థిక వ్యవస్థకి అంత చెడ్డది కూడా.

కాగా.. ఈ విషయంపైనే ఈ రోజు ప్రధాని మోదీ జాతినుద్ధేశించి ప్రసంగించనున్నారు. మరి లాక్‌డౌన్‌పై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఆసక్తి ఏర్పడింది. అలాగే ఆర్థిక కార్యకలాపాలు కూడా కొనసాగించేందుకు కొన్ని నిబంధనలను సడలింపు చేస్తారని ఇప్పటికే కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రధాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి:

జూ.ఎన్టీఆర్ కెరీర్‌లో విడుదల కాని ఫస్ట్ సినిమా ఇదే..!

రిలయన్స్ శాస్త్రవేత్తల పరిశోధన.. సముద్ర నాచుతో కరోనాకి చెక్?

లాక్‌డౌన్-2.0కు మార్గదర్శకాలు సిద్ధం చేస్తోన్న కేంద్రం

సీఎం కేసీఆర్ చెప్పిన ‘హెలికాఫ్టర్ మనీ’కి అర్థమేంటంటే..?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu