TN Seshan: ఎన్నికల సంఘం చరిత్రలో ఆయనో మైలు రాయి.. అలాంటి వ్యక్తి అవసరమంటూ కీర్తించిన సుప్రీం..
ఒకప్పటి రోజుల్లో బీహార్ అంతటా 'లాలూ యుగం’ అన్నట్టుగా ఉండేది. అలాగే అప్పట్లో ఎన్నికల సందర్భంగా బూత్ క్యాప్చరింగ్ లాంటి వార్తలు శరామామూలే. అయితే 1995 నాటికి ఎన్నికల కమిషనర్‌గా
ఒకప్పటి రోజుల్లో బీహార్ అంతటా ‘లాలూ యుగం’ అన్నట్టుగా ఉండేది. అలాగే అప్పట్లో ఎన్నికల సందర్భంగా బూత్ క్యాప్చరింగ్ లాంటి వార్తలు శరామామూలే. అయితే 1995 నాటికి ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా టీఎన్ శేషన్ ఉన్నారు. ఆయన పోలింగ్ తేదీలను మార్చడం ద్వారా దశలవారీగా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. అది దేశంలోనే సంచలనాత్మకమైన నిర్ణయం. అప్పుడు ఆయన పర్యవేక్షణలో భద్రతా వ్యవస్థ పటిష్టంగా ఉండడమే కాక.. పరిపాలనా సన్నాహాలు కూడా ఖచ్చితంగా ఉండేవి. ఆయన ఎన్నికల కమీషనర్‌గా ఉన్నప్పుడు.. అధికార ఆర్జేడీ ఆశించిన రీతిలో అన్ని పనులు జరగడం లేదు. బహుశా బీహార్ ప్రజలు మొదటిసారిగా అలాంటి పరిస్థితిని అనుభవించారు.
శేషన్ కఠిన చర్యలపై లాలూ ప్రసాద్ మండిపడ్డారు. శేషన్ ఆధ్వర్యంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.ఆ ఎన్నికలలో జనతాదళ్ 167 సీట్ల మెజారిటీతో.. లాలూ మళ్లీ సీఎం అయ్యారు. కానీ ఆయన ఓట్ల శాతం తగ్గింది. శేషన్ ప్రభావంతో బీహార్‌లో 61.79 శాతం ఓటింగ్ జరిగింది. అయితే తొలగించిన ఓట్ల సంఖ్య దాదాపు 5,65,851 (1990) నుంచి 11,25,854 (1995)కి రెట్టింపు అయింది. శేషన్ 4 దశల్లో ఎన్నికలు నిర్వహించి నాలుగు సార్లు తేదీలను మార్చారు. బీహార్ చరిత్రలో ఇదే అతి సుదీర్ఘమైన ఓటింగ్. ఆ క్రమంలో చిన్నచిన్న సంఘటనలు మినహా ఎలాంటి అవాంతరాలు చోటు చేసుకోలేదు.
వెనకడుగు వేసేవారు కాదు..
శేషన్ 1990 నుంచి 1996 వరకు ఎన్నికల సంఘానకిి ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఉన్నారు. తన పదవీకాలంలో ఆయన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గుల్షేర్ అహ్మద్, బీహార్ సీఎం లాలూ ప్రసాద్, బెంగాల్ సీఎం జ్యోతిబసు నుంచి ప్రధానమంత్రి నరసింహారావు వరకు ఎవరినీ విడిచిపెట్టలేదు. ‘నేను అల్పాహారం కోసం రాజకీయ నాయకులను తింటాను’’ అని చెప్పేవారు ఆయన. రాజీవ్ గాంధీ హత్య తర్వాత కూడా ఆయన అప్పటి ప్రభుత్వాన్ని అడగకుండానే లోక్ సభ ఎన్నికలను వాయిదా వేశారు. అక్టోబర్ 1993లో, పివి నరసింహారావు ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌కు ఇద్దరు అసిస్టెంట్ కమీషనర్లను నియమించడం ద్వారా ఎన్నికల కమిషన్‌ను బహుళ సభ్య సంఘంగా మార్చింది. శేషన్ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా కొనసాగినప్పటికీ, ఆయన అధికారాలు కొంతమేర తగ్గాయి. ఈ అంశంపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని శేషన్ కోరారు. అయితే కోర్టు నిర్ణయం ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది.
ఫోటో ID కోసం యుద్ధం
ప్రజాప్రాతినిధ్య చట్టంలోని రూల్ 37 ప్రకారం, ఎన్నికలను జరపడానికి లేదా నిర్వహించకుండా ఉండటానికి ఎన్నికల కమిషన్‌కు హక్కు ఉంది. నకిలీ ఓటర్లను అరికట్టేందుకు శేషన్ ఫొటోతో కూడిన ఓటర్ ఐడీని తీసుకురావాలన్నారు. ఫొటోతో కూడిన ఓటరు ఐడీ తీసుకురావడానికి ప్రభుత్వం ఆలస్యం చేస్తే రూల్ 37ను ఉపయోగిస్తామని శేషన్ తేల్చి చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది. మాజీ ప్రధాని విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ దీనిని ‘ప్రజాస్వామ్య ప్రతిష్టంభన’గా పోల్చారు. అయితే అప్పటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతి బసు శేషన్‌ను ‘పిచ్చి కుక్క’ అని కూడా అన్నారు. న్యాయపరమైన జోక్యం తర్వాత శేషన్ కొంత మేర వెనకడుగు వేశారు. కాగా, ప్రస్తుతం ఫోటోతో కూడిన ఓటరు గుర్తింపు కార్డు ఆయన సంకల్పానికి ఫలితమే. ఇంకా నవంబర్‌లో జరిగిన ఓ కేసు సందర్భంగా సుప్రీం కోర్టు ‘‘సీఈసీగా ఉత్తమైన వ్యక్తి ఉండాలి.. టీఎన్ శేషన్ లాంటి వ్యక్తి వ్యవస్థకు అవసరం’’ అని ఆయనను పరోక్షంగా కీర్తించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..