AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఇంటి మధ్యలో గుంత.. అందరూ ప్రశ్నించగా ఆమెలో కంగారు.. ఏంటని తవ్వి చూడగా..

భార్యాభర్తల మధ్య తలెత్తే చిన్న చిన్న గొడవలే.. చిలికి చిలికి గాలివానలా మారుతాయి. అదే కోపంలో..

Viral: ఇంటి మధ్యలో గుంత.. అందరూ ప్రశ్నించగా ఆమెలో కంగారు.. ఏంటని తవ్వి చూడగా..
Viral
Ravi Kiran
|

Updated on: Nov 24, 2022 | 1:36 PM

Share

భార్యాభర్తల మధ్య తలెత్తే చిన్న చిన్న గొడవలే.. చిలికి చిలికి గాలివానలా మారుతాయి. అదే కోపంలో చివరికి దారుణాలకు తెగబడుతున్నారు. తాజాగా బీహార్‌లో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. స్థానికంగా సంచలనం సృష్టించిన ఆ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే..

ముజఫర్‌పూర్ పరిధి బోచాహాకు చెందిన విభ అనే మహిళకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల కాలంలో ఆర్ధిక సమస్యలు కారణంగా విభ, ఆమె భర్త తరచూ గొడవ పడుతుండేవారు. ఈ క్రమంలోనే భర్త వేరుగా ఉండటం మొదలుపెట్టాడు. ఆమెను వదిలి.. 15 రోజులుగా బావమరిది ఇంట్లో ఉంటున్నాడు. దీంతో విభకు కోపం మరింతగా పెరిగింది. ఈ క్రమంలోనే ఆదివారం తన ఇంటికి వచ్చిన మూడేళ్ల మేనల్లుడు నితిక్‌పై చూపించింది. ఆ చిన్నారిని గొంతు నులిమి హత్య చేయడమే కాదు.. నోట్లో ఇటుక రాళ్లు, మట్టి నింపింది. అనంతరం తనపైకి కేసు రాకుండా ఉండేందుకు ఆ మృతదేహాన్ని గుంత తవ్వి ఇంటి మధ్యలోనే పాతిపెట్టింది.

మరోవైపు తన కుమారు కనిపించట్లేదంటూ చుట్టు పక్కల ప్రాంతాలన్నీ వెతికిన నితిక్‌ తల్లిదండ్రులు.. చివరకు విభ ఇంటికి వచ్చారు. చిన్నారి గురించి అడగ్గా.. తనకు ఏం తెలియదంటూ బుకాయించింది. చివరికి ఇంటి మధ్య గొయ్యి చూసిన వాళ్లు.. అదేంటని అడగ్గా.. ఎలుకలు తవ్వాయని విభ కట్టుకథ అల్లింది. దీంతో అనుమానం వచ్చిన వారికి ఆ గుంత తవ్వి చూడగా.. చిన్నారి మృతదేహం బయటపడింది. కాగా, ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకొని ఘటనాస్థలిని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని నిందితురాలిని అరెస్ట్ చేశారు.