Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel Guidelines: పాస్‌పోర్ట్ ఉన్నా.. ఇలా పేరు ఉన్న వారు మాత్రం.. ఈ దేశానికి వెళ్లలేరు.. వెళితే ఇక అంతే

సాధారణంగా పాస్‌పోర్ట్ ఉంటే చాలు.. ఏ దేశానికైనా సులువుగా వెళ్లి రావొచ్చు.. ఆయా దేశాల్లో అడుగుపెట్టాలన్నా, నివాసం ఉండాలన్నా.. అక్కడి ప్రభుత్వం ఇచ్చే వీసా మీద ఆధారపడి ఉంటుంది. ఇదంతా ఒకత్తైతే.. పాస్ పోర్టుపై ఒక పదం పేరు ఉంటే మాత్రం..

Travel Guidelines: పాస్‌పోర్ట్ ఉన్నా.. ఇలా పేరు ఉన్న వారు మాత్రం.. ఈ దేశానికి వెళ్లలేరు.. వెళితే ఇక అంతే
Flight
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 24, 2022 | 1:27 PM

UAE’s travel guidelines: సాధారణంగా పాస్‌పోర్ట్ ఉంటే చాలు.. ఏ దేశానికైనా సులువుగా వెళ్లి రావొచ్చు.. ఆయా దేశాల్లో అడుగుపెట్టాలన్నా, నివాసం ఉండాలన్నా.. అక్కడి ప్రభుత్వం ఇచ్చే వీసా మీద ఆధారపడి ఉంటుంది. ఇదంతా ఒకత్తైతే.. పాస్ పోర్టుపై ఒక పదం పేరు ఉంటే మాత్రం తమ దేశంలోకి ఎంట్రీ ఉండదని.. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ స్పష్టంచేసింది. అంతర్జాతీయ ప్రయాణికుల ప్రవేశ నిబంధనల్లో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ఇటీవల కీలక మార్పులు చేసింది. యూఏఈ (UAE) అంతర్జాతీయ ప్రయాణికుల ప్రవేశ నియమాలను మార్చడంతోపాటు.. నవంబర్ 21 నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. ఈ మేరకు ఎయిర్ ఇండియా, ఇండిగో వంటి భారతీయ విమానయాన సంస్థలు.. యూఏఈ తాజా మార్పుల గురించి ప్రయాణికులకు తెలియజేస్తూ ప్రకటనలను సైతం విడుదల చేశాయి. పాస్‌పోర్టుపై పూర్తి పేరు లేకుండా కేవలం ఒక పదంతో.. మాత్రమే పేరు ఉండే వారిని తమ దేశంలోకి అనుమతించబోమని అన్ని విమానయాన సంస్థలకు స్పష్టం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కొత్త మార్గదర్శకాలు నవంబరు 21 నుంచే అమల్లోకి వచ్చినట్లు ఎయిరిండియా, ఇండిగో ప్రయాణికులకు సమాచారమిచ్చాయి.

యూఈఏ నిబంధనల ప్రకారం.. టూరిస్టు లేదా ఇతర రకాల వీసాదారులైనా పాస్‌పోర్టుపై పూర్తి పేరు లేకుండా ఒకే పదంతో పేరు ఉంటే వారిని యూఏఈలోకి అనుమతించరని భారత ఎయిర్‌లైన్లు వేర్వేర్లు ప్రకటనల్లో తెలిపాయి. పాస్‌పోర్టుపై ఒకే పదంతో పేరు ఉండే వారికి యూఏఈ వీసాలు జారీ చేయడం లేదని.. ఒకవేళ అలాంటి పాస్‌పోర్టుదారులకు ఇప్పటికే వీసా జారీచేసినప్పటికీ.. అరబ్‌ దేశ ఇమ్మిగ్రేషన్‌ విభాగం అనుమతించట్లేదని విమానయాన సంస్థలు ప్రయాణికులకు స్పష్టంచేశాయి.

ఈ కొత్త నిబంధన విజిట్‌ వీసా, వీసా ఆన్‌ అరైవల్‌, ఉపాధి లేదా తాత్కాలిక వీసాదారులకు వర్తిస్తుందని ఎయిర్ లైన్లు వెల్లడించాయి. యూఏఈలో శాశ్వత లేదా నివాస హోదా ఉన్న వారికి ఈ నిబంధన వర్తించదని పేర్కొన్నాయి. శాశ్వత/నివాస హోదా ఉన్నవారికి పాస్‌పోర్టుపై ఒకే పదంతో పేరు ఉంటే.. అదే పేరును “first name” లేదా “surname’’ కాలమ్‌లో అప్‌డేట్‌ చేసుకోవాలని విమానయాన సంస్థలు వెల్లడించాయి. ఈ నిబంధన గురించి పలు భారత ఎయిర్‌లైన్లు ప్రయాణికులకు పలు సూచనలు కూడా చేశాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..

గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.
అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో
అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో
అయ్యో చేప ఎంతపని చేసింది.. వీడియోలో మీరే చూడండి!
అయ్యో చేప ఎంతపని చేసింది.. వీడియోలో మీరే చూడండి!
దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో
దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో
రెస్టారెంట్‌ వింత ఆఫర్‌.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో
రెస్టారెంట్‌ వింత ఆఫర్‌.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో
మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బ
ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బ
నకిలీ డాక్టర్ మాజీ స్పీకర్‌ని చంపేసాడా? వీడియో
నకిలీ డాక్టర్ మాజీ స్పీకర్‌ని చంపేసాడా? వీడియో