AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘చాయ్ వాలా’గా మారిన తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మిత్ర.. అరె ! కప్పు రూ. 15 లక్షలు మాత్రమేనట ! ఎవరికంటే ..?

బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మిత్రా 'చాయ్ వాలా' గామారిపోయారు. టీ అమ్మే వ్యక్తిగా అవతారమెత్తారు. కోల్ కతా లోని భవానీపూర్ వీధుల్లో ఆయన నిన్న ఇలా టీ ఇస్తూ కనిపించారు.

'చాయ్ వాలా'గా మారిన తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మిత్ర.. అరె ! కప్పు రూ. 15 లక్షలు మాత్రమేనట ! ఎవరికంటే ..?
Tmc Mla Madan Mitra Turns As Chaiwala
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: Aug 02, 2021 | 1:52 PM

Share

బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మిత్రా ‘చాయ్ వాలా’ గామారిపోయారు. టీ అమ్మే వ్యక్తిగా అవతారమెత్తారు. కోల్ కతా లోని భవానీపూర్ వీధుల్లో ఆయన నిన్న ఇలా టీ ఇస్తూ కనిపించారు. ఈ టీ ఫ్రీగా ఇస్తున్నానని, కానీ ప్రధాని మోదీకి ‘సన్నిహితులైనవారికి మాత్రం కప్పు టీ రూ. 15 లక్షలని’ ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ప్రతి పౌరుడి బ్యాంకు అకౌంట్ లో తన ప్రభుత్వం నుంచి రూ. 15 లక్షలు జమ అవుతాయని మోదీ 2014 లో ఇచ్చిన హామీని ఈ సందర్భంగా మిత్రా గుర్తు చేశారు. నేడు ఈ హామీ ఏమైందన్నారు. ఇది స్పెషల్ టీ అని, ఒకప్పుడు రైల్వే స్టేషన్లలో మోదీ అమ్మిన చాయ్ కన్నా రుచిగా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. దీని ధర అడిగితే మాత్రం..ప్రతి భారతీయుడి ఖాతాలో 15 లక్షలు పడుతుందన్న మోదీ ‘ధరకే’ ఇది లభ్యమవుతుందని ఆయన సెటైర్ వేశారు.

దేశంలో పెట్రో ఉత్పత్త్తుల ధరల పెరుగుదలకు నిరసనగా ఈ మాజీ మంత్రి లోగడ ఎడ్ల బండి నడిపారు. ఒకప్పుడు సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి ఈయన సన్నిహితుడు కూడా.. మదన్ మిత్రా చేసే వ్యాఖ్యల పట్ల ఈయన రాజకీయ ప్రత్యర్థి, బీజేపీ నేత దిలీప్ ఘోష్ కూడా సరదాగా స్పందించి కాంప్లిమెంట్ చేస్తుంటారు. ఇక ఫేస్ బుక్ లైవ్స్ లో మిత్రా చేసే కామెంట్స్, యూత్ ని ప్రత్యేకంగా ఆకర్షిస్తుంటాయి.

మరిన్ని ఇక్కడ చూడండి: Tokyo Olympics 2020: ఆమె కులమేంటి? భారత స్టార్ షట్లర్‌ పీవీ సింధుపై సోషల్ మీడియాలో ‘చెత్త’ చర్చ

Covid Cases: ఆస్ట్రేలియాను వణికిస్తున్న కోవిడ్ కేసులు.. నగరాల్లో స్ట్రిక్ట్ లాక్ డౌన్.. సిడ్నీలో రంగంలోకి సైన్యం