AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NTA JIPMAT Admit Card – 2021: జిప్‌మాట్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ విడుదల.. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..

NTA JIPMAT Admit Card - 2021: జిప్‌మాట్ పరీక్ష కోసం అడ్మిట్ కార్డును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జారీ చేసింది. మేనేజ్‌మెంట్ ..

NTA JIPMAT Admit Card - 2021: జిప్‌మాట్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ విడుదల.. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..
Jipmat
Shiva Prajapati
|

Updated on: Aug 02, 2021 | 1:31 PM

Share

NTA JIPMAT Admit Card – 2021: జిప్‌మాట్ పరీక్ష కోసం అడ్మిట్ కార్డును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జారీ చేసింది. మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్‌లో జాయింట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్‌కు హాజరయ్యే అభ్యర్థులు NTA JIPMAT, jipmat.nta.ac.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

జిప్‌మాట్ పరీక్ష 10 ఆగస్టు, 2021 న జరుగనుంది. జాయింట్ ఇండికేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జిప్‌మాట్) కోసం దరఖాస్తు ప్రక్రియ 1 ఏప్రిల్ 2021 న ప్రారంభమవగా.. దరఖాస్తు చేసుకోవడానికి 30 ఏప్రిల్, 2021 వరకు అవకాశం కల్పించారు. అదే పొరపాట్ల సర్దుబాటు కోసం మే 5వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఈ పరీక్ష (NTA JIPMAT Exam 2021) కోసం అడ్మిట్ కార్డును విడుదల చేశారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ అయిన jipmat.nta.ac.in నుంచి అడ్మిట్ కార్డును డౌన్‌ లోడ్ చేసుకోవచ్చునని అధికారులు తెలిపారు.

అడ్మిట్ కార్డును ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి.. 1. అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేయడానికి ముందుగా NTA JIPMAT- jipmat.nta.ac.in యొక్క అధికారిక వెబ్‌సైట్‌‌కి వెళ్లాలి. 2. ఇక్కడ అడ్మిట్ కార్డ్స్ ఫర్ జాయింట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (JIPMAT) -2021 పై క్లిక్ చేయండి. 3. ఆ తరువాత అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేయడం ద్వారా లాగిన్ ఇవ్వాలి. 4.లాగిన్ అయిన తర్వాత అడ్మిట్ కార్డు ఓపెన్ అవుతుంది. 5. అలా ఓపెన్ అయిన అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాలి. అనంతరం ప్రింట్ ఇచ్చుకోవాలి.

అడ్మిట్ కార్డ్‌లో ఏదైనా తేడా ఉన్నా.. డౌన్‌లోడ్ చేయడంలో ఏదైనా ఇబ్బంది తలెత్తినా.. అభ్యర్థులు NTA హెల్ప్‌లైన్ నంబర్: 011-4075 9000 కి కాల్ చేయవచ్చు. లేదా మెయిల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.

Also read:

Viral Video: సడెన్‌గా ప్రత్యక్షమైన సింహం.. హడలిపోయిన టూరిస్ట్‌లు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

CET Exams: తెలంగాణలో రేపటి నుంచి సెట్ ఎగ్జామ్స్.. ఏ పరీక్ష ఎప్పుడంటే.. పూర్తి వివరాలు మీకోసం..

Viral Video: మనుషుల గ్యాంగ్ వార్ చూశారు.. మరి కోతుల గ్యాంగ్ వార్ చూశారా? అయితే ఇప్పుడు చూసేయండి..