Viral Video: సడెన్‌గా ప్రత్యక్షమైన సింహం.. హడలిపోయిన టూరిస్ట్‌లు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

Viral Video: గుజరాత్‌లోని సాసన్ గిర్‌లోని దేవాలియా పార్క్‌కు సంబంధించిన భయానక వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అతోంది.

Viral Video: సడెన్‌గా ప్రత్యక్షమైన సింహం.. హడలిపోయిన టూరిస్ట్‌లు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..
Lion
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 02, 2021 | 12:55 PM

Viral Video: గుజరాత్‌లోని సాసన్ గిర్‌లోని దేవాలియా పార్క్‌కు సంబంధించిన భయానక వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అతోంది. నిత్యం రద్దీగా ఉండే పార్క్‌లోకి ఓ భారీ సింహం ప్రవేశించింది. రోడ్డుపై స్వేచ్ఛగా తిరుగాడింది. ఆ సింహాన్ని చూసి టూరిస్టులు బెంబేలెత్తిపోయారు. ఆ సింహం కంటపడకుండా జాగ్రత్త పడ్డారు. సింహం అలా సంచరిస్తుండగా.. కొందరు దానిని వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. అయితే గుజరాత్ వీధుల్లో సింహాలు తిరగడం ఇదే తొలిసారి కాదు. దీనికి ముందు కూడా అనేకసార్లు సింహాలు బహిరంగ ప్రదేశాల్లో తిరుగాడిన సందర్భాలు ఉన్నాయి. వాటి తాలూకు వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.

ఇదిలాఉంటే.. ససాన్ గిర్ నేషన్ పార్క్‌లో సింహం స్వేచ్ఛగా తిరుగుతున్న వీడియోను ట్విట్టర్ యూజర్ @zubinashara సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘కింగ్ ఎంటర్ అయ్యాడు’ అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ పెట్టాడు. కాగా, 15 సెకన్ల ఈ వీడియోలో సింహం స్వేచ్ఛగా రోడ్డుపై తిరిగింది. అడవిలో ఫ్రీగా ఉన్నట్లుగా.. రోడ్డుపై తిరుగాడింది. ఈ వీడియో ఎప్పుడు తీశారనే దానిపై సమాచారం లేదు కానీ.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

కాగా, ఈ ట్వీట్‌కు ఐఎఫ్ఎస్ అధికారి సురేన్ మెహ్రా స్పందించారు. ఇది అడవి నుంచి వచ్చిందా? అంటూ ప్రశ్నించారు. దీనికి బదులిచ్చిన ఓ నెటిజన్.. ‘ఇది అడవికి చెందిన సింహం. ఎందుకంటే ఇది పార్క్ వెలుపల నుంచి వస్తోంది’ అని కామెంట్ మెన్షన్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు 4 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.

Viral Video:

Also read:

CET Exams: తెలంగాణలో రేపటి నుంచి సెట్ ఎగ్జామ్స్.. ఏ పరీక్ష ఎప్పుడంటే.. పూర్తి వివరాలు మీకోసం..

Viral Video: మనుషుల గ్యాంగ్ వార్ చూశారు.. మరి కోతుల గ్యాంగ్ వార్ చూశారా? అయితే ఇప్పుడు చూసేయండి..

India Bangladesh Train: భారత్-బంగ్లా సరిహద్దుల్లో చారిత్రాత్మక ఘట్టం.. 56 ఏళ్ల క్రితం నిలిచిపోయిన..