India Bangladesh Train: భారత్-బంగ్లా సరిహద్దుల్లో చారిత్రాత్మక ఘట్టం.. 56 ఏళ్ల క్రితం నిలిచిపోయిన..
India Bangladesh Train: భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాల విషయంలో చారిత్రాత్మక పరిణామం చోటు చేసుకుంది. 1975లో భారత్-బంగ్లా..
India Bangladesh Train: భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాల విషయంలో చారిత్రాత్మక పరిణామం చోటు చేసుకుంది. 1975లో భారత్-బంగ్లా మధ్య నడిచిన ట్రైన్ సర్వీస్.. 56 ఏళ్ల తరువాత మళ్లీ నడిచింది. పునరుద్ధరించబడిన హల్దిబారి – చిలహతి మార్గం మీదుగా మొదటి గూడ్స్ రైల్ అలిపుర్దార్ డివిజన్‌లోని డామ్ డిమ్ స్టేషన్ నుంచి బంగ్లాదేశ్‌కు వెళ్లింది. ఈ ట్రైన్ డామ్‌డిమ్ స్టేషన్ నుంచి జులై 31వ తేదీన అంటే శనివారం రాత్రి బయలుదేరగా.. ఆగస్టు ఒకవతేదీన బంగ్లాదేశ్‌కు చేరుకుంది.
హల్దిబారి – చిలహతి మార్గం అస్సాం, పశ్చిమ బెంగాల్, నేపాల్, భూటాన్ నుండి బంగ్లాదేశ్‌కి వస్తువుల రవాణా చేస్తుంది. ఈ ప్రయాణానికి చాలా తక్కువ సమయం పడుతుంది. ప్రధాన పోర్టులు, మధ్య తరగతి పోర్టులు, భూ సరిహద్దులలో ప్రాంతీయ వాణిజ్యం అభివృద్ధికి, ఈశాన్య ప్రాంత ఆర్థిక, సామాజిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఈ రైల్ నెట్‌వర్క్ ఉపయోగపడనుంది. అంతేకాదు.. దక్షిణాసియా దేశాల మధ్య ఆర్థిక కార్యకలాపాలు కొనసాగించేందుకు కూడా ఈ లింక్ ఉపయోగపడుతుంది.
హల్దిబారి – చిలహతి రైలు మార్గం భారతదేశం, అప్పటి తూర్పు పాకిస్తాన్ మధ్య 1965 వరకు పనిచేసింది. దేశ విభజన సమయంలో ఇది కోల్‌కతా నుండి సిలిగురికి వెళ్లే బ్రాడ్ గేజ్ ప్రధాన మార్గాల్లో ఒకటి. అస్సాం, ఉత్తర బెంగాల్‌కు ప్రయాణించే రైళ్లు విభజన తర్వాత కూడా అప్పటి తూర్పు పాకిస్తాన్ భూభాగం గుండా ప్రయాణిస్తూనే ఉన్నాయి. అయితే, 1965 యుద్ధం తరువాత భారతదేశం, అప్పటి తూర్పు పాకిస్తాన్(బంగ్లాదేశ్) మధ్య ఉన్న అన్ని రైల్వే ప్రయాణాలను రద్దు చేశారు.
అయితే, హల్దిబారి-చిలహతి రైలు లింక్ గత సంవత్సరం డిసెంబర్ 17వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మధ్య జరిగిన వర్చువల్ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో ప్రారంభించబడింది. అయితే కోవిడ్ మహమ్మారి కారణంగా, సాధారణ రైలు సేవలను ప్రారంభించలేకపోయామని ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం, ఐదు రైలు మార్గాలు బంగ్లాదేశ్-భారతదేశాన్ని కలుపుతాయి. అవి పెట్రాపోల్-బెనపోల్, గేడే-దర్శన, సింహాబాద్-రోహన్పూర్, రాధికపూర్-బీరోల్ మరియు హల్దిబారి-చిలహతి.
The first goods train through Haldibari – Chilahati rail link to Bangladesh crossed the zero point at 16:35 hrs today. This rail link will encourage the economic & social development of the region and help in the growth of regional trade. pic.twitter.com/Ro4PZ00aWP
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 1, 2021
Also read:
TS Weather Alert: తెలంగాణలో చలిగాలులు.. రాగల మూడు రోజుల పాటు ఈ ప్రాంతాల్లో వర్షాలు పడే ఛాన్స్..
Central Govt Scheme: మీరు పాడి రైతులా?.. అయితే రూ. 5 లక్షలను పొందండి.. పూర్తి వివరాలు మీ కోసం..
Viral Video: అమ్మ బాబోయ్.. మొసలితో ముసలావిడ.. వీడియో చూస్తే గుండె గుభేల్..