Viral Video: అమ్మ బాబోయ్.. మొసలితో ముసలావిడ.. వీడియో చూస్తే గుండె గుభేల్..

Viral Video: చాలా మంది జంతువులంటే ఇష్టపడుతారు. తమ పెంపుడు జంతువలను తమ కుటుంబ సభ్యుల వలే చూసుకుంటారు. అమితమైన ప్రేమను చూపుతారు.

Viral Video: అమ్మ బాబోయ్.. మొసలితో ముసలావిడ.. వీడియో చూస్తే గుండె గుభేల్..
Viral Pic

Viral Video: చాలా మంది జంతువులంటే ఇష్టపడుతారు. తమ పెంపుడు జంతువలను తమ కుటుంబ సభ్యుల వలే చూసుకుంటారు. అమితమైన ప్రేమను చూపుతారు. పెంపుడు జంతువులు కూడా అంతే స్థాయిలో తమ యజమానుల ప్రేమను ప్రదర్శిస్తుంటాయి. అయితే, చాలా మటుకు జనాలు.. తమ ఇంట్లో కుక్కలను, పిల్లులను, పక్షులను పెంచుకుంటారు. కొద్ది మంది మాత్రం క్రూర మృగాలను సైతం పెంచుకుంటారు. భయంకరమైన ఆ జంతువులు.. వారి ప్రేమకు దాసోహమైపోతాయి. సాధారణంగా క్రూర మృగాలైన సింహం, చిరుతను చూస్తే హడలిపోతారు. అలాగే మొసలిని చూసినా భయపడిపోతారు. ఎందుకంటే అవి మనుషులను చంపుకు తింటాయి కాబట్టి.

అయితే, తాజాగా ఓ వృద్దురాలికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వృద్దురాలు సాదు జీవిగా ఏం పెంచుకుందో చూస్తే మీ ఊపిరి ఆగిపోవడం ఖాయం అనే చెప్పాలి. ఎందుకంటే.. ఆమె ఏకంగా ఓ మొసలిని పెంచుకుంటోంది. అదంటే ఆమెకు ప్రాణం. ఆ మొసలికి కూడా తన యజమానికి అంటే చాలా ఇష్టం. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆ మొసలిని వాకింగ్ కోసం తన వెంటకు బయటకు తీసుకురావడం. సరదాగా బయటకు వచ్చిన ఆమె.. తన వెంట మొసలిని వాకింగ్‌కు తీసుకువచ్చింది. అది చూసి జనాలు బెంబేలెత్తిపోయారు. మొసలిని పట్టుకుని ఆమె అలా నడుస్తూ వస్తుంటే.. అది చూసిన వారి గుండె డబేల్‌మని కిందకు జారినట్లయ్యింది.

అయితే, చాలా మంది ఇలాంటి ప్రమాదకరమైన జీవులను సాదుకోవడం చాలాసార్లు చూస్తుంటాం. అయితే, వాటిని తమ ఇంటికే పరిమితం చేస్తుంటారు. ఇంట్లోనే వాటితో సరదాగా ఆడుకుంటూ ఉంటారు. అలాంటి వాటికి సంబంధించి వీడియోలో సోషల్ మీడియాలో ఎన్నో మనం చూడొచ్చు. కానీ ఈ వృద్దురాలు మాత్రం ఏకంగా.. మొసలిని పట్టుకుని వాకింగ్‌కు రావడం హడలెత్తించింది. మొసలిని ఒక గొలుసుతో కట్టి.. ఆ గొలుసును తన చేతిలో పట్టుకుంది. అలా దానితో కలిసి నడవసాగింది. అయితే, ఈమె వెంట మరో వ్యక్తి కూడా ఉన్నాడు. మొసలి పట్టుకున్న వృద్దురాలు, ఆ వ్యక్తి ఇద్దరూ డ్యాన్స్ చేస్తూ సంతోషంగా అడుగులు ముందుకు వేయడం ఆ వీడియోలో చూడొచ్చు.

కాగా, వీరిని వీడియో తీసిన పలువురు.. ఆ వీడియోను jayprehistoricpets పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రమ అకౌంట్‌లో షేర్ చేశారు. దాంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటి వరకు 5 లక్షలకు పైగా వ్యూస్ రాగా, 2.25 లక్షల లైక్స్ వచ్చాయి. మరెందుకు ఆలస్యం.. ఈ వీడియోను మీరూ చూసేయండి.

Viral Video:

 

View this post on Instagram

 

A post shared by Jay Brewer (@jayprehistoricpets)


Also read:

Chanakya Niti: ఆరోగ్యంగా ఉండటానికి వీటిని పాటించండి.. ఆచార్య చాణక్య చెప్పిన అద్భుతమైన సూచనలు..

Viral Video: పడుకున్న కుక్కను ఆట పట్టించిన పిల్లి.. ఆ తరువాత ఏం జరిగిందో చూస్తే నవ్వుకుంటారు..

India Post GDS Results 2021: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారా..?.. ఫలితాలపై క్లారిటీ..!

Click on your DTH Provider to Add TV9 Telugu