అస్సాం.. మిజోరాం మళ్ళీ ‘భాయీ-భాయీ’.. ఒకరిపై ఒకరు కేసుల ఉపసంహరణ.. కొలిక్కి వస్తున్న సరిహద్దు వివాదం
అస్సాం-మిజోరం రాష్ట్రాల మధ్య మళ్ళీ సఖ్యత నెలకొంటోంది. సరిహద్దు వివాదాలు పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గత నెల 26 న సరిహద్దు వద్ద ఘర్షణలను ప్రేరేపించారన్న ఆరోపణపై...
అస్సాం-మిజోరం రాష్ట్రాల మధ్య మళ్ళీ సఖ్యత నెలకొంటోంది. సరిహద్దు వివాదాలు పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గత నెల 26 న సరిహద్దు వద్ద ఘర్షణలను ప్రేరేపించారన్న ఆరోపణపై మిజో నేషనల్ ఫ్రంట్ ఎంపీ కె.వనల్వేనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ను ఉపసంహరించాలని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తమ రాష్ట్ర పోలీసులను ఆదేశించారు. సౌహార్ద సూచనగా ఈ చర్య తీసుకుంటున్నామని, కానీ ఆ రాష్ట్ర పోలీసులపై కేసులు కొనసాగుతాయని ఆయన అన్నారు. తమ రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదాన్ని సానుకూలంగా పరిష్కరించుకుంటామని మిజోరం సీఎం జొరాం తాంగా చేసిన ట్వీట్ ను మీడియా ద్వారా తాను తెలుసుకున్నానని, తామెప్పుడూ ఈశాన్య రాష్ట్రాల మధ్య శాంతినే కోరుతున్నామని ఆయన అన్నారు. హోమ్ మంత్రి అమిత్ షా సూచనపై మిజోరం ముఖ్యమంత్రి మెత్తబడిన సంగతి తెలిసిందే. కాగా హిమంత బిస్వ శర్మపై తమ రాష్ట్ర పోలీసులు పెట్టిన కేసును ఉపసంహరించాలని జొరాం తాంగా కూడా ఆదేశించారు. పైగా రాష్ట్ర ప్రజలు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ఎలాంటి ప్రకటనలు,వ్యాఖ్యలు చేయరాదని కూడా ఆయన సూచించారు.మిజోరం లోని కోలాసిబ్, అస్సాం లోని కచార్ జిల్లాల మధ్య రెండు రాష్ట్రాల పోలీసులు ఎలాంటి ఆయుధాలు తీసుకు వెళ్లకుండా చూడాలని కేంద్రం వీటిని ఆదేశించింది.
బలగాల ఉపసంహరణలో భాగంగా అత్యవసరమైన..లేదా నిత్యావసరాల రవాణాను పునరుద్ధరించాలని కూడా కేంద్రం సూచించింది. చర్చల ద్వారా బౌండరీ వివాదాలను పరిష్కరించుకుంటామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత శర్మ మళ్ళీ స్పష్టం చేశారు. ఇప్పటికే రెండు రాష్ట్రాల సరిహద్దుల వద్ద బలగాలు వాటివాటి స్థానాలకు వెనక్కి మళ్ళాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: Tokyo Olympics 2020 Live: మూడుసార్లు ఒలింపిక్స్ విజేత ఆస్టేలియాను ఓడించి సెమిస్ లో అడుగు పెట్టిన భారత విమెన్ హాకీ టీమ్
Viral Video: మనుషుల గ్యాంగ్ వార్ చూశారు.. మరి కోతుల గ్యాంగ్ వార్ చూశారా? అయితే ఇప్పుడు చూసేయండి..