Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jammu and Kashmir: జమ్మూ కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం..

Jammu and Kashmir: జమ్మూ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో..

Jammu and Kashmir: జమ్మూ కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం..
Encounter J And K
Follow us
Shiva Prajapati

| Edited By: Ravi Kiran

Updated on: Oct 12, 2021 | 11:46 AM

Jammu and Kashmir: జమ్మూ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో లష్కర్ ఈ తోయిబా-ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారి వద్ద నుంచి భారీ స్థాయిలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు జమ్మూ కశ్మీర్ పోలీసులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ‘‘షోపియాన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారంతా లష్కర్ ఈ తోయిబా-ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌కు చెందిన వారిగా గుర్తించాం. ఉగ్రవాదుల వేట ఇంకా కొనసాగుతోంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించడం జరుగుతుంది.’’ అంటూ జమ్మూకశ్మీర్ పోలీసులు అధికారిక ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. కాగా, షోపియాన్‌లోని తుల్‌రాన్, ఇమామ్‌సహాబ్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది.

ఇదిలాఉంటే.. సోమవారం నాడు జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లా సూరన్‌కోట్‌లోని ఓ గ్రామంలో ఉగ్రవాదులు, జవాన్లకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ కొసాగిస్తుండగా.. టెర్రరిస్టులు అకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డారు. దాంతో ఈ ఘటనలో ఐదుగురు జవాన్లకు బుల్లెట్ గాయాలవగా వారు ప్రాణాలు కోల్పోయారు.

Also read:

Wi-Fi Calling: వై-ఫై కాలింగ్ అంటే ఏంటి..? స్మార్ట్‌ఫోన్‌లలో దీనిని ఎలా ఉపయోగించాలి..?

Bengaluru rain: భారీ వర్షం.. వరద నీటిలో ఎయిర్‌పోర్టు.. ట్రాక్టర్లలో ప్యాసింజర్ల ప్రయాణం.. వైరల్ వీడియో

MAA Elections 2021: మా ఎన్నికలపై స్పందించిన దర్శకేంద్రుడు.. ఇంత అలజడి సృష్టించడం ఇండస్ట్రీకి మంచిది కాదంటూ..