MAA Elections 2021: మా ఎన్నికలపై స్పందించిన దర్శకేంద్రుడు.. ఇంత అలజడి సృష్టించడం ఇండస్ట్రీకి మంచిది కాదంటూ..
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఎట్టకేలకు పూర్తయ్యాయి. గత కొద్ది నెలలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెర పడింది.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఎట్టకేలకు పూర్తయ్యాయి. గత కొద్ది నెలలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెర పడింది. నువ్వా నేనా అంటూ జరిగిన మా అధ్యక్ష పోరులో ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు విజయం సాధించారు. గతంలో ఎన్నడు లేనంతగా ఈసారి మా ఎన్నికల పోలింగ్ నమోదైంది. అంతేకాదు.. సార్వత్రిక ఎన్నికలను తలపిస్తూ..ఈ సారి మా ఎన్నికలు జరిగాయి. మా అసోసియేషన్లో ఉన్నది 900 మంది.. అయినా రాష్ట్ర ఎన్నికలను తలపిస్తూ.. ఆరోపణలు, విమర్శలు ఒక్కటేమిటి ఎన్నో ఆసక్తికర పరిణామాల మధ్య మా ఎన్నికలు జరిగాయి. అయితే మా ఎన్నకలతో ఇప్పుడు టాలీవుడ్ లో కొత్త చర్చ మొదలైంది..
ప్రాంతీయ వాదం వెలుగులోకి వచ్చింది. తెలుగు వాడు కాదంటూ నన్ను ఓడించారని.. అలాంటి అసోసియేషన్ లో ఉండలేనని ప్రకాష్ రాజ్ నిన్న మా సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు మా అధ్యక్ష పదివికి మంచు విష్ణు గెలుపొందిన కాసేపటికే మెగా బ్రదర్ నాగబాబు సైతం మా సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో మరిన్ని రాజీనామాలు వచ్చే విధంగా కనిపిస్తుంది. ఇక మా ఎన్నికలు జరిగిన తీరు.. అభ్యర్థుల మధ్య జరిగిన వాగ్వాదాలపై పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. తాజాగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు సైతం మా ఎన్నికలపై స్పందించారు.
శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీలీలా జంటగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో డైరెక్టర్ గౌరీ రోనంకీ తెరకెక్కించిన సినిమా పెళ్లి సందD. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఇక నిన్న ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విశాఖ వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. మా ఎన్నికలు ఇంతలా అలజడి సృష్టించడం తెలుగు సినీ పరిశ్రమకు మంచిది కాదన్నారు. సినిమా పెద్దలు అందరూ కలిసి మా అధ్యక్షునిగా ఎవర్నో ఒకర్ని ఏకగ్రీవంగా ఎన్నుకుని ఉంటే బాగుండేదన్నారు. అదే మంచి పద్ధతి అని… మంచు విష్ణు మా అధ్యక్షుడిగా రాణిస్తాడనే నమ్మకం ఉందని ఆయన తెలిపారు.
Anasuya: వెండితెరపై దూసుకుపోతున్న అందాల యాంకరమ్మ.. మరో స్పెషల్ సాంగ్లో అనసూయ..