Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bengaluru rain: భారీ వర్షం.. వరద నీటిలో ఎయిర్‌పోర్టు.. ట్రాక్టర్లలో ప్యాసింజర్ల ప్రయాణం.. వైరల్ వీడియో

Bengaluru rain:  అల్పపీడన ప్రభావంతో కర్ణాటకలో వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరు పూర్తిగా స్తంభించిపోయింది. సోమ‌వారం రాత్రి కురిసిన

Bengaluru rain: భారీ వర్షం.. వరద నీటిలో ఎయిర్‌పోర్టు.. ట్రాక్టర్లలో ప్యాసింజర్ల ప్రయాణం.. వైరల్ వీడియో
Bengaluru Air Port
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 12, 2021 | 9:48 AM

Bengaluru rain:  అల్పపీడన ప్రభావంతో కర్ణాటకలో వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరు పూర్తిగా స్తంభించిపోయింది. సోమ‌వారం రాత్రి కురిసిన భారీ వ‌ర్షాన్ని జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. బెంగ‌ళూరు పట్టణమంతా జ‌ల‌మ‌యం కావడంతో ప్రయాణికులు, పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోత‌ట్టు ప్రాంతాల్లోకి భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరింది. ఎక్కడచూసినా నీరే కనిపిస్తుండంటతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

కాగా.. బెంగ‌ళూరులోని కెంపేగౌడ అంత‌ర్జాతీయ విమానాశ్రయం, దాని ప‌రిస‌రాల్లోకి భారీగా వరద నీరు చేరింది. వరద ధాటికి విమానాశ్రయానికి వెళ్లే రహదారి పూర్తిగా దెబ్బతింది. దీంతోపాటు నీరు భారీగా నిలిచిపోవ‌డంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొంత‌మంది ప్రయాణికులు అయితే ట్రాక్టర్లల్లో సైతం ప్రయాణం చేశారు. ఎయిర్‌పోర్టుకు చేరుకునేందుకు వారు ట్రాక్టర్లల్లో ప్రయాణం చేశారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

అధికారుల నిర్లక్ష్యం కారణంగా, సరైన ప్రణాళిక లేకపోవడంతో నీరు నిలిచిపోయినట్లు ప్రయాణికులు అసహనం వ్యక్తంచేశారు. ఇదిలాఉంటే.. మంగళవారం కూడా బెంగ‌ళూరు పట్టణంలో ఉరుములు, మెరుపుల‌తో కూడిన భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

Also Read:

Rakesh Jhunjhunwala: ఝున్‌ఝున్‌వాలా ‘ఆకాశ ఎయిర్‌’కు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌.. వచ్చే ఏడాది నుంచే విమాన సేవలు..

PM Narendra Modi: నేడు ఎన్‌హెచ్‌ఆర్‌సీ వ్యవస్థాపక దినోత్సవం.. జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..