Rakesh Jhunjhunwala: ఝున్‌ఝున్‌వాలా ‘ఆకాశ ఎయిర్‌’కు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌.. వచ్చే ఏడాది నుంచే విమాన సేవలు..

Shaik Madarsaheb

Shaik Madarsaheb |

Updated on: Oct 12, 2021 | 8:46 AM

Akasa Air - Rakesh Jhunjhunwala: కొత్త విమానయాన సంస్థ ‘ఆకాశ ఎయిర్‌’కు కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. బుల్ దిగ్గజం, ఇన్వెస్ట్‌మెంట్‌ గురు రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా

Rakesh Jhunjhunwala: ఝున్‌ఝున్‌వాలా ‘ఆకాశ ఎయిర్‌’కు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌.. వచ్చే ఏడాది నుంచే విమాన సేవలు..
Rakesh Jhunjhunwala

Follow us on

Akasa Air – Rakesh Jhunjhunwala: కొత్త విమానయాన సంస్థ ‘ఆకాశ ఎయిర్‌’కు కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. బుల్ దిగ్గజం, ఇన్వెస్ట్‌మెంట్‌ గురు రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా మద్దతు ఉన్న ఈ సంస్థకు పౌర విమానయాన శాఖ నో ఆబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌వోసీ) జారీ చేసినట్లు ఆ కంపెనీ సోమవారం వెల్లడించింది. దీనితో 2022 నాటికి కార్యకలాపాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆకాశ ఎయిర్‌ హోల్డింగ్‌ సంస్థ ఎస్‌ఎన్‌వీ ఏవియేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రకటనలో వెల్లడించింది.

ఆకాశ ఎయిర్‌కు ఎన్‌వోసీ జారీ చేసినందుకు.. తమ సంస్థకు మద్దతుగా నిలుస్తున్నందుకు పౌర విమానయాన శాఖకు ధన్యవాదాలంటూ ఆకాశ ఎయిర్‌ సీఈవో వినయ్‌ దూబే ట్విట్ చేశారు. రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా ఇన్వెస్ట్‌ చేస్తున్న ఆకాశ ఎయిర్‌ బోర్డులో.. ప్రైవేట్‌ ఎయిర్‌లైన్స్‌ దిగ్గజం ఇండిగో మాజీ అధ్యక్షుడు ఆదిత్య ఘోష్‌ కూడా ఉన్నారు. ఈ సంస్థ సీఈవోగా నియామకమైన దూబే గతంలో జెట్‌ ఎయిర్‌వేస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఈ సంస్థ ఎయిర్‌ బస్‌, బోయింగ్‌తో చర్చలు జరుపుతున్నట్లు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. వచ్చే నాలుగేళ్లలో సుమారు 70 విమానాలను ఆపరేట్‌ చేయాలని ఆకాశ ఎయిర్ కంపెనీ సన్నాహాలు చేస్తోంది.

ఎన్ఓసీ సర్టిఫికేట్ జారీ చేసిన నేపథ్యంలో ఎయిర్ ఆపరేట్ పర్మిట్ కోసం ఆ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కు దరఖాస్తు చేయనుంది. కాగా.. ఇటీవలనే ఇన్వెస్ట్‌మెంట్‌ గురు రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసిన విషయం తెలిసిందే.

Also Read:

Bank holidays October 2021: ఖాతాదారులకు అలెర్ట్.. వరుసగా 9 రోజులు బ్యాంకులు బంద్.. ఎప్పుడప్పుడంటే..?

హోండా సిటీ కార్.. జీరో డౌన్ పేమెంట్.. ధర రూ.3 లక్షల కన్నా తక్కువే..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu