దిశ కేసు.. వీరి రూటే సెపరేటు.. ముగ్గురు నేతల భిన్న స్వరాలు

దిశ కేసు.. వీరి రూటే సెపరేటు.. ముగ్గురు నేతల భిన్న స్వరాలు

దిశ కేసు నిందితులైన నలుగురి ఎన్ కౌంటర్ పై దేశమంతా హర్షం వ్యక్తం చేస్తుండగా..ముగ్గురు నేతలు మాత్రం భిన్న స్వరాలు వినిపించారు. బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి మేనకాగాంధీ, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం కుమారుడు, ఎంపీ కార్తీ చిదంబరం, సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరి.. ఈ విధమైన ఎన్ కౌంటర్ల వల్ల దాదాపు ప్రయోజనం శూన్యమన్న తీరులో స్పందించారు. ఇలా నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసినా వ్యవస్థలో మార్పు రాదని, ఇలా […]

Anil kumar poka

|

Dec 06, 2019 | 2:06 PM

దిశ కేసు నిందితులైన నలుగురి ఎన్ కౌంటర్ పై దేశమంతా హర్షం వ్యక్తం చేస్తుండగా..ముగ్గురు నేతలు మాత్రం భిన్న స్వరాలు వినిపించారు. బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి మేనకాగాంధీ, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం కుమారుడు, ఎంపీ కార్తీ చిదంబరం, సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరి.. ఈ విధమైన ఎన్ కౌంటర్ల వల్ల దాదాపు ప్రయోజనం శూన్యమన్న తీరులో స్పందించారు.

ఇలా నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసినా వ్యవస్థలో మార్పు రాదని, ఇలా చేస్తే ఏం లాభమని ప్రశ్నించారు మేనకా గాంధీ.. ఈ విధంగా పోలీసులు వ్యవహరిస్తూ పోతే ఇక వారి అవసరం ఏముంటుందని, నిందితులను శిక్షించడమన్నది చట్ట నిబంధనల ప్రకారం జరగాలని ఆమె అభిప్రాయపడ్డారు. ఇక కార్తీ చిదంబరం.. రేప్ అన్నది చాలా దారుణ నేరమని, చట్టం ప్రకారం అత్యంత కఠినంగా దీన్ని పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుందని అన్నారు. ఈ విధమైన కిరాతకాలకు పాల్పడేవారికి కఠిన శిక్ష విధించవలసిందే.. కానీ ఈ విధానం మన వ్యవస్థకు ఓ మచ్చ అని ఆయన పేర్కొన్నారు. తక్షణ న్యాయం జరగాల్సిన అవసరం ఉంది కానీ ఈ తీరులో కాదని కార్తీ చిదంబరం ట్వీట్ చేశారు.

ఇక సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి కూడా దాదాపు ఇదే విధమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎక్స్ ట్రా జుడిషియల్ కిల్లింగ్స్ .అన్నది మహిళల రక్షణకు సంబంధించిన అంశంలో సరైన ‘ సమాధానం ‘ కాదని ఆయన పేర్కొన్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu