లోక్ సభలో దిశకేసు.. నిందితుల ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కౌంటర్‌పై రచ్చ .. రచ్చ

లోక్ సభలో దిశకేసు.. నిందితుల ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కౌంటర్‌పై రచ్చ .. రచ్చ

దిశకేసులో నలుగురు నిందితులు పోలీసుల ఎన్ కౌంటర్ లో మరణించిన ఉదంతం శుక్రవారం లోక్ సభను కుదిపివేసింది. జీరో అవర్ లో కాంగ్రెస్ మొదట ఈ అంశాన్ని లేవనెత్తింది. ఈ పార్టీ నేత అధిర్ రంజన్ చౌదరి..దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, దిశ కేసుకు సంబంధించి హైదరాబాద్ లో పోలీసులు నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేసి హతమార్చడాన్ని చూసి ఈ ప్రభుత్వం సిగ్గుపడాలని అన్నారు. మహిళల రక్షణకు సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందని ఆయన […]

Pardhasaradhi Peri

| Edited By: Ram Naramaneni

Dec 06, 2019 | 3:09 PM

దిశకేసులో నలుగురు నిందితులు పోలీసుల ఎన్ కౌంటర్ లో మరణించిన ఉదంతం శుక్రవారం లోక్ సభను కుదిపివేసింది. జీరో అవర్ లో కాంగ్రెస్ మొదట ఈ అంశాన్ని లేవనెత్తింది. ఈ పార్టీ నేత అధిర్ రంజన్ చౌదరి..దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, దిశ కేసుకు సంబంధించి హైదరాబాద్ లో పోలీసులు నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేసి హతమార్చడాన్ని చూసి ఈ ప్రభుత్వం సిగ్గుపడాలని అన్నారు. మహిళల రక్షణకు సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ పోలీసుల తీరును చూసి ఇతర రాష్ట్రాల ఖాకీలు నేర్చుకోవలసింది ఎంతయినా ఉందన్నారు. అయోధ్యలో రామాలయాన్ని నిర్మిస్తున్న ఈ తరుణంలో ‘ సీతలను కాల్చేస్తున్నారని ‘ ఆయన ఆవేశంగా వ్యాఖ్యానించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకే చెందిన ప్రతాపన్.. సభ వెల్ లోకి దూసుకువఛ్చి.. ఏవో నినాదాలు చేస్తుండగా ఆ పార్టీ ఎంపీలు, ఎన్సీపీ సభ్యులు కొంతమంది ఆయనను వెనక్కి లాగేశారు అటు-యూపీలోని ఉన్నావ్ లో ఓ రేప్ బాధితురాలిపై కొంతమంది కిరోసిన్ పోసి నిప్పంటించిన ఘటనను మరికొంతమంది సభ్యులు ప్రస్తావించారు. ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందని వారు నిలదీశారు. . సభలో ఇలా గందరగోళం జరుగుతుండగా .. స్పీకర్ కొద్దిసేపు సభను వాయిదా వేశారు. కాగా-కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.. విపక్ష సభ్యుల తీరును.. ముఖ్యంగా అధిర్ రంజన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మహిళల రక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని చెప్పిన ఆమె.. ప్రతి అంశాన్నీ ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని, వీటికి మతం రంగును పులుముతున్నాయని అన్నారు. పశ్చిమ బెంగాల్ లోని మాల్టా లో ఉన్నావ్ కేసు వంటిదే జరిగితే సభ్యులు మాట్లాడడం లేదెందుకని స్మృతి ఇరానీ ప్రశ్నించారు. ఇలా ఉండగా రాజ్యసభ సభ్యురాలు జయ బచ్ఛన్ .. దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ పై స్పందిస్తూ .. ఇప్పటికైనా బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగిందని అన్నారు. కాస్త ఆలస్యం జరిగినా.. చివరకు న్యాయమే గెలిచిందని ఆమె వ్యాఖ్యానించారు. మరోవైపు..యూపీ మాజీ సీఎం, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి హైదరాబాద్ పోలీసుల తీరును ప్రశంసించారు. యూపీ పోలీసులు తెలంగాణ పోలీసుల నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉందన్నారు. తెలంగాణ పోలీసుల చర్య ఎంతో ప్రశంసనీయం.. యూపీలో ఇలాంటి (దిశ ఉదంతం) ఘటనలు ప్రతి జిల్లాలో జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. యువతులనే కాక వృధ్ధ మహిళలను కూడా మృగాళ్లు వదలడంలేదని, ఈ రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని మాయావతి దుయ్యబట్టారు. తాను సీఎంగా ఉండగా.. తన సొంత పార్టీ సభ్యులపైనే చర్య తీసుకున్నానని ఆమె గుర్తు చేశారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu