యూపీ, ఏపీ సీఎం పేర్ల లొల్లి.. అక్కడో టైపు.. ఇక్కడో టైపు!

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు గాని శత్రువులు గాని ఉండరనేది జగమెరిగిన సత్యం. టీడీపీ- కాంగ్రెస్, కాంగ్రెస్- బీజేపీ.. ఇలా ఎన్నో పార్టీలు చాలా ఏళ్లుగా శత్రువులుగా ఉండి.. ఆ తర్వాత రాజకీయ లబ్ది కోసం మిత్రులుగా మారిన సందర్భాలు కోకొల్లలు. అంతేకాక ఇరు పార్టీల నేతలు ఎల్లప్పుడూ హుందాతనంగానే వ్యవహరించేవారు. అయితే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. గత కొద్దిరోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేస్తున్న వ్యాఖ్యలు హద్దు మీరుతున్నాయని […]

యూపీ, ఏపీ సీఎం పేర్ల లొల్లి.. అక్కడో టైపు.. ఇక్కడో టైపు!
Follow us

|

Updated on: Dec 07, 2019 | 3:57 PM

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు గాని శత్రువులు గాని ఉండరనేది జగమెరిగిన సత్యం. టీడీపీ- కాంగ్రెస్, కాంగ్రెస్- బీజేపీ.. ఇలా ఎన్నో పార్టీలు చాలా ఏళ్లుగా శత్రువులుగా ఉండి.. ఆ తర్వాత రాజకీయ లబ్ది కోసం మిత్రులుగా మారిన సందర్భాలు కోకొల్లలు. అంతేకాక ఇరు పార్టీల నేతలు ఎల్లప్పుడూ హుందాతనంగానే వ్యవహరించేవారు. అయితే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. గత కొద్దిరోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేస్తున్న వ్యాఖ్యలు హద్దు మీరుతున్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు బీజేపీపై ప్రశంసలు కురిపిస్తూ.. మరో వైపు వైసీపీని తీవ్రంగా విమర్శించడం వెనుక కమలదళం హస్తం కూడా ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ చేసిన తీవ్రమైన వ్యాఖ్యల్లో ఒకటి.. తాను సీఎం జగన్ మోహన్ రెడ్డిని సీఎంగా గుర్తించనని ప్రకటించడం.. రాజకీయంగా ఎన్ని విబేధాలు ఉన్నా.. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి విషయంలో ఇలా మాట్లాడటం సరికాదని విశ్లేషకులు అంటున్నారు. మోదీ అంటే కాంగ్రెస్ వాళ్లకు ఎంత పడకపోయినా.. ఆ పార్టీ నేతలందరూ ఆయన్ని ప్రధానమంత్రి అనే సంబోధిస్తారని.. ఆ హోదాతోనే గౌరవిస్తారని గుర్తు చేశారు.

ఇక ఇదంతా పక్కన పెడితే.. ఇటీవల యూపీ సీఎం యోగీ ఆదిత్యనాధ్‌ను అసలు పేరు పెట్టి పిలిచినందుకు ఒక ప్రతిపక్ష నేతపై కేసు నమోదు అయ్యింది. యూపీ సీఎం అసలు పేరు అజయ్ సింగ్ బిస్తా. ఆయన యోగిగా మారిన తర్వాత రాజకీయాల్లోకి రావడంతో పేరు మార్చుకున్నారు. ఇక ఆ పేరుతోనే కొనసాగుతున్నారు. అయితే రీసెంట్‌గా సమాజ్‌వాదీ పార్టీ నేత ఐపీ సింగ్ ట్విటర్లో స్పందిస్తూ యోగి ఆదిత్యనాథ్‌ను ఆయన అసలు పేరు అజయ్ సింగ్ బిస్తా అని సంబోధించారు. దీనితో ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా.. కేసు నమోదు చేశారు. దీని బట్టి చూస్తే.. పవన్ కళ్యాణ్‌పై వైసీపీ నేతలు ఎన్ని కేసులు పెట్టిస్తారో.?