కన్నడ సీఎంకు గుడ్ న్యూస్ చెప్పిన ఎగ్జిట్ పోల్స్..
యడియూరప్పకు ఎగ్జిట్ పోల్స్ గుడ్ న్యూస్ చెప్పాయి. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో జరిగిన 15 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో.. కాషాయ జెండా రెపరెపలాడనుందని.. ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈనెల 5న ఉప ఎన్నికలు జరగగా, 67 శాతం పోలింగ్ నమోదైంది. అథాని, గోకక్, యెల్లాపుర, కాగ్వాడ్, రనిబెన్నూరు, విజయ్‌నగర, హైరెకెరూర్, కేఆర్ పుర, చిక్‌బల్లాపుర, యశ్వంత్‌పుర, శివాజీనగర, హోసకోటె, మహాలక్ష్మీ లేఅవుట్, కేఆర్ పెటె, హున్సూరు నియోజకవర్గాల్లో ఈ […]
యడియూరప్పకు ఎగ్జిట్ పోల్స్ గుడ్ న్యూస్ చెప్పాయి. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో జరిగిన 15 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో.. కాషాయ జెండా రెపరెపలాడనుందని.. ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈనెల 5న ఉప ఎన్నికలు జరగగా, 67 శాతం పోలింగ్ నమోదైంది. అథాని, గోకక్, యెల్లాపుర, కాగ్వాడ్, రనిబెన్నూరు, విజయ్‌నగర, హైరెకెరూర్, కేఆర్ పుర, చిక్‌బల్లాపుర, యశ్వంత్‌పుర, శివాజీనగర, హోసకోటె, మహాలక్ష్మీ లేఅవుట్, కేఆర్ పెటె, హున్సూరు నియోజకవర్గాల్లో ఈ బైపోల్స్ జరిగాయి.
కాగా, ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం బీజేపీ మెజారిటీ సీట్లు దక్కించుకోనుండగా.. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు మూడు నుంచి 6 సీట్లు మాత్రమే గెలుచుకునే అవకాశం ఉన్నట్లు తెలిపాయి. పవర్ టీవీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. బీజేపీ 8 నుంచి 12 స్థానాల్లో గెలుస్తుందని తెలుపగా.. కాంగ్రెస్ 3-6 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఇక జేడీఎస్ ఖాతా కూడా తెరవదని తేల్చేసింది. ఇక పబ్లిక్ టీవీ ఫలితాల ప్రకారం.. బీజేపీ 8 నుంచి 10, కాంగ్రెస్ 3-5, జేడీఎస్ 1 నుంచి 2 సీట్లలో గెలుస్తాయని తెలిపింది. బీటీవీ ప్రకారం.. బీజేపీ 9 నుంచి 11, కాంగ్రెస్ 2 నుంచి 4, జనతాదళ్‌కు 2 సీట్లు దక్కే అవకాశాలున్నాయని పేర్కొంది. ఇక సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం మాత్రం.. బీజేపీ ఏకంగా.. 12 నుంచి 15 స్థానాలను గెల్చుకునే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అదేసమయంలో.. కాంగ్రెస్‌కు మాత్రం 3 స్థానాలు దక్కే అవకాశాలున్నట్లు పేర్కొంది. అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమవుతాయా లేదా అనేది తేలాలంటే.. మరో రెండు రోజులు.. అనగా.. డిసెంబర్ 9వ తేదీ వరకు వేచిచూడాల్సిందే.
అయితే ఈ ఫలితాల్లో బీజేపీకి 6కు పైగా సీట్లు రాకపోతే.. యడియూరప్ప ప్రభుత్వానికి తిప్పలు తప్పవు. ఎందుకంటే.. ఆరు సీట్ల కంటే తక్కువ వస్తే.. మళ్లీ బలనిరూపణ జరిగితే.. ఈ సారి మళ్లీ సీఎం సీటు నుంచి దిగిపోవాల్సిందే. కాబట్టి ఈ ఫలితాలు.. యడియూరప్పకు కీలకమైనవి.