AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కమిషనర్ సజ్జన్నార్‌కు షాక్… ఏమైందంటే?

దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన సైబరాబాద్ కమిషనర్ సజ్జన్నార్‌ను 95 శాతం మంది ప్రజలు పొగుడుతుంటే… మరోవైపు నుంచి మాత్రం ఆయనకు షాక్ ఎదురైంది. దిశను అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి, కిరాతకంగా పెట్రోల్ పోసి తగుల బెట్టిన చర్యను యావత్ ప్రపంచం ముక్తకంఠంతో ఖండించింది. నేరస్థులను బహిరంగంగా శిక్షించాలన్న డిమాండ్‌ను నారీ లోకం ముక్తకంఠంతో వినిపించింది. వినిపిస్తున్న డిమాండ్ల వల్లనో.. లేక నేరస్థులు పారిపోవడానికి ప్రయత్నించడం వల్లనో సైబరాబాద్ పోలీసులు.. నలుగురిని […]

కమిషనర్ సజ్జన్నార్‌కు షాక్... ఏమైందంటే?
Rajesh Sharma
|

Updated on: Dec 06, 2019 | 2:52 PM

Share

దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన సైబరాబాద్ కమిషనర్ సజ్జన్నార్‌ను 95 శాతం మంది ప్రజలు పొగుడుతుంటే… మరోవైపు నుంచి మాత్రం ఆయనకు షాక్ ఎదురైంది. దిశను అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి, కిరాతకంగా పెట్రోల్ పోసి తగుల బెట్టిన చర్యను యావత్ ప్రపంచం ముక్తకంఠంతో ఖండించింది. నేరస్థులను బహిరంగంగా శిక్షించాలన్న డిమాండ్‌ను నారీ లోకం ముక్తకంఠంతో వినిపించింది. వినిపిస్తున్న డిమాండ్ల వల్లనో.. లేక నేరస్థులు పారిపోవడానికి ప్రయత్నించడం వల్లనో సైబరాబాద్ పోలీసులు.. నలుగురిని గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఎన్‌కౌంటర్ చేశారు.

శుక్రవారం తెల్లవారుతుండగానే వినిపించిన ఎన్‌కౌంటర్ వార్తలపై యావత్ తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమ తెలంగాణ పోలీసులను ఆకాశానికెత్తేసింది. మాటలు లేకుండా చేతల్లో నేరస్థులకు శిక్ష వేసి చూపించిన తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్‌పైనా పలువురు ప్రశంసలు కురిపించారు. ఇదంతా బాగానే వున్నా.. అందరి చేత ప్రశంసంలందుకుంటున్న సజ్జన్నార్‌కు తాజాగా షాక్ తగిలింది.

జాతీయ మానవ హక్కుల సంఘం దిశ కేసుల ఎన్‌కౌంటర్‌పై సూమోటోగా రియాక్టయ్యింది. ఎన్‌కౌంటర్ జరిగిన తీరుపై మానవ హక్కుల సంఘం వెంటనే స్పందించింది. పోలీసుల అదుపులో, కస్టడీలో వున్న వ్యక్తులు ఎన్‌కౌంటర్‌కు గురి కావడమేంటని విస్మయం వ్యక్తం చేసింది మానవ హక్కుల సంఘం. దీనిపై అత్యవసర దర్యాప్తునకు ఆదేశించింది.

ఉదంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించాల్సి వుందని అభిప్రాయపడింది ఎన్.హెచ్.ఆర్.సీ. ఎన్‌కౌంటర్ ఉదంతానికి సంబంధించి వాస్తవాలను తెలుసుకునేందుకు ఓ ప్రత్యేక బృందాన్ని హైదరాబాద్‌కు పంపాలని ఎన్.హెచ్.ఆర్.సీ. నిర్ణయించింది. నిజనిర్ధారణ బృందాన్ని పంపి, వీలైనంత త్వరగా నివేదిక తెప్పించుకోవాలని ఎన్.హెచ్.ఆర్.సీ. తీర్మానించింది.

Follow Us
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా కొత్త విమానాశ్రయాలు.. సీఎం రేవంత్..
తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా కొత్త విమానాశ్రయాలు.. సీఎం రేవంత్..
తీవ్ర వాయుగుండంగా అల్పపీడనం.. ఒడిశా, బెంగాల్‌లో భారీ వర్షాలు..
తీవ్ర వాయుగుండంగా అల్పపీడనం.. ఒడిశా, బెంగాల్‌లో భారీ వర్షాలు..
కరివేపాకు రోజూ తింటున్నారా? ఈ ఆరోగ్య సమస్యలుంటే మాత్రం జాగ్రత్త!
కరివేపాకు రోజూ తింటున్నారా? ఈ ఆరోగ్య సమస్యలుంటే మాత్రం జాగ్రత్త!