AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లిప్‌స్టిక్ పెట్టుకునే ఆడ‌వాళ్లు హంగామా చేస్తారు.. ఆర్జేడీ నేత వివాదస్పద వ్యాఖ్యలు

ఇటీవల జరిగిన ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ బిల్లు అంశంపై ఆర్జేడీ నేత అబ్దుల్ బారీ సిద్దిఖీ ప్రస్తావించారు. అలాగే దీనిపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లిప్‌స్టిక్‌లు బాబ్ కట్ చేసుకున్న మహిళలలు ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతో ముందుకు వస్తారని పేర్కొన్నారు.

లిప్‌స్టిక్ పెట్టుకునే ఆడ‌వాళ్లు హంగామా చేస్తారు.. ఆర్జేడీ నేత వివాదస్పద వ్యాఖ్యలు
Abdul Bari Siddiqui
Aravind B
|

Updated on: Sep 30, 2023 | 8:26 PM

Share

ఇటీవల జరిగిన ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ బిల్లు అంశంపై ఆర్జేడీ నేత అబ్దుల్ బారీ సిద్దిఖీ ప్రస్తావించారు. అలాగే దీనిపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లిప్‌స్టిక్‌లు బాబ్ కట్ చేసుకున్న మహిళలలు ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతో ముందుకు వస్తారని పేర్కొన్నారు. అయితే ఆయన మాట్లాడిన ఈ వ్యాఖ్యలను ఇండియా కూటమిలోని నేతలు సైతం విభేదించారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని ముజాఫర్‌పూర్‌లో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో సిద్దిఖీ మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది కావున ఇకనుంచి లిప్‌స్టిక్‌లు పెట్టుకునే ఆడవాళ్లు బాబ్ కట్ చేసుకునే ఆడవాళ్లు మహిళా రిజర్వేషన్ పేరు చెప్పి హంగామా చేయడం ప్రారంభిస్తారు చూడండంటూ మాట్లాడారు.

ఈ తర్వాత ఈ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. అయితే గ్రామస్తులకు అర్ధమయ్యే విధంగా చెప్పడం కోసం తాను ఇలా మాట్లాడాల్సి వచ్చిందని అబ్దుల్ బారీ సిద్దిఖీ అన్నారు. ముందునుంచి కూడా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుకు తమ పార్టీ మద్దతు ఇస్తూనే ఉందని పేర్కొన్నారు. అలాగే ఇటీవల జరిగినటువంటి ప్రత్యేక సమావేశాల్లో కూడా ఆర్జేడీ పార్టీ బిల్లుకు మద్దతు ఇచ్చిందని తెలిపారు. అయితే ఈ మహళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీలను చేర్చకపోవడంపై మాత్రం తమ పార్టీ తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసిందని అన్నారు. ఇదిలా ఉండగా అబ్దుల్ బారీ సిద్దిఖీ చేసినటువంటి వ్యాఖ్యలపై బీజేపీ నేత కౌశల్ కిషోర్ స్పందించారు. అయితే దీన్ని బట్టి ఆయన ఆలోచనలు ఎంత కింది స్థాయిలో ఉన్నాయో తమకు స్పష్టంగా అర్థమవుతున్నాయని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

అలాగే మహిళలు చట్టాలను, రాజ్యాంగాన్ని అధ్యయనం చేసి ప్రజల గొంతును చట్టసభల్లో వినిపించడానికి వస్తున్నారని అన్నారు. ఒక కారుకు చక్రాలు ఉన్నట్లుగానే పార్లమెంటులో కూడా పురుషులు మహిళలు చట్టాలు చేసే విషయంలో భాగస్వాములు అవుతారని పేర్కొన్నారు. అయితే ఆ మాత్రం కూడా అవగాహన లేకుండా ఎలా ఇలా మాట్లాడతారని ప్రశ్నల వర్షం గుప్పించారు. మరోవైపు సిద్దిఖీ చేసినటువంటి వ్యాఖ్యలను ఇండియా కూటమిలో ఉన్నటువంటి జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ నేతలు ఖండించారు. అయితే ఆ పార్టీకి చెందినటువంటి రాజ్యసభ ఎంపీ మహువా మాజి మాట్లాడుతూ.. మనం 21వ శతాబ్దంలో ఉన్నామని.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు. అలాగే ఓబీసీలతో సహా ఎస్సీ,ఎస్టీ వంటి వెనుకబడిన వర్గాల వారు సైతం రిజర్వేషన్‌లో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు.

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్