Galwan Valley: వారి త్యాగం ఎప్పటికీ మరువలేనిది.. గాల్వాన్ వీరులకు రాజ్‌నాథ్ సింగ్ నివాళి..
వారి ధైర్యసాహసాలు, పోరాటం, దేశం కోసం వారి అత్యున్నత త్యాగం ఎప్పటికీ మరువలేనిది.. అమరులకు నివాళులు అర్పిస్తున్నానంటూ కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.
Galwan valley 2nd anniversary: తూర్పు లడఖ్‌లోని గాల్వాన్ లోయలో రెండేళ్ల క్రితం (జూన్ 2020) చైనా సైనికుల దురాఘతానికి 20 మంది భారత సైనికులు అమరులైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు కూడా ప్రాణాలు కోల్పాయారు. చైనా హింసాత్మక ఘటనకు నేటితో రెండేళ్లు పూర్తయింది. భారత సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రధాని మోడీతోపాటు, కేంద్రమంత్రులు నివాళులర్పించారు. 2020 జూన్ 15-16 తేదీల్లో చైనా PLAతో జరిగిన హింసాత్మక పోరాటంలో దేశం గౌరవం కోసం ధైర్యంగా పోరాడి తమ ప్రాణాలను అర్పించిన గాల్వాన్ వీరులను స్మరించుకున్నారు. జవాన్ల ధైర్యసాహసాలు, పోరాటం, దేశం కోసం వారి అత్యున్నత త్యాగం ఎప్పటికీ మరువలేనిది.. గాల్వాన్ అమరులకు నివాళులు అర్పిస్తున్నానంటూ కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. హింసాత్మక ఘటన రెండో వార్షికోత్సవం సందర్భంగా గల్వాన్ వీరులకు గురువారం రాజ్‌నాథ్ సింగ్ నివాళులర్పించారు.
ఈ మేరకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం జమ్మూలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనకు వెళ్లిన రాజ్‌నాథ్ కాశ్మీర్, సరహద్దు ప్రాంతాల్లోని దళాలతో సంభాషించారు. దీంతోపాటు గల్వాన్ లోయ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు నివాళులర్పించారు. తూర్పు ప్రాంతంలో చైనా PLAతో జరిగిన హింసాత్మక పోరాటంలో కనీసం 20 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వారి త్యాగం మరువలేనిదని.. ధైర్యంగా పోరాడి అమరులయ్యారంటూ రాజ్‌నాథ్ పేర్కొన్నారు.
అనంతరం రాజ్‌నాథ్ సింగ్ బారాముల్లాలో ఆర్మీ అధికారులతో భోజనం చేశారు. సైనికులతో ఇంటరాక్ట్ సందర్భంగా.. దేశాన్ని కాపాడేందుకు సైనికులు ప్రాణాలను పణంగా పెడుతున్నారని పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సిద్ధంగా ఉండాలంటూ సూచించారు. కవ్వింపు చర్యలపై అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు.
రాజ్‌నాథ్ సింగ్ జమ్మూకశ్మీర్ పర్యటన సందర్భంగా శుక్రవారం జమ్మూలో జరిగే మహారాజా గులాబ్ సింగ్ ‘రాజ్యాభిషేక్ వేడుక’ 200వ వార్షికోత్సవానికి హాజరుకానున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..