Income Tax: ఆదాయపు పన్ను చెల్లించేవారు ఆ రాష్ట్రంలోనే ఎక్కువ.. కీలక విషయాలు బయటపెట్టిన ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక
ఇటీవల ఎస్బీఐ రీసెర్చ్ చేపట్టిన నివేదిక కీలక విషయాలు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజల ఆదాయం భారీగా పెరుగుతోందని చెప్పింది. అలాగే దీంతో పాటు ప్రభుత్వ పన్ను చెల్లించే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు అధికారులు. గత మూడు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఆదాయపు పన్ను చెల్లించేవారి సంఖ్య 18 లక్షలు పెరిగిందని తెలుస్తోంది.
ఇటీవల ఎస్బీఐ రీసెర్చ్ చేపట్టిన నివేదిక కీలక విషయాలు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజల ఆదాయం భారీగా పెరుగుతోందని చెప్పింది. అలాగే దీంతో పాటు ప్రభుత్వ పన్ను చెల్లించే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు అధికారులు. గత మూడు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఆదాయపు పన్ను చెల్లించేవారి సంఖ్య 18 లక్షలు పెరిగిందని తెలుస్తోంది. అయితే ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెరుగుదల లేదని తెలిపింది. ఇదిలా ఉండగా 2015 నుంచి చూసుకుంటే 2020 వరకు దేశవ్యాప్తంగా పన్ను చెల్లించేవారి సంఖ్య 3.81 కోట్లకు చేరింది. అయితే ఈ సంఖ్య 2020 నుంచి 2023 వరకు కోటీ మాత్రమే తెలుస్తోంది.
అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం గత ఐదు సంవత్సరాల్లో 5 లక్షల మంది ఆదాయపు పన్ను చెల్లించేవారు పెరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు. అలాగే ఏపీలో గత ఎనిమిది సంవత్సరాల్లో 23 లక్షల మంది పన్ను చెల్లించేవారు పెరిగినట్లు నివేదిక చెబుతోంది. ముఖ్యంగా గత 3 సంవత్సరాల్లో ప్రజల ఆదాయ భారీగా పెరిగిందని తెలిపింది. అయితే తక్కువ ఆదాయ ఉన్నవారు మధ్యతరగతిలోకి, మధ్యతరగతిలో ఉన్నవారు ఎగువ మధ్యతరగతి ఆదాయంలోకి వెళ్తున్నారని చెప్పింది. అలాగే 2023లో ఆదాయపు పన్ను దాఖలు చేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ సహా పలు రాష్ట్రాలు అగ్రభాగాన నిలిచాయి. ఇదిలా ఉండగా 2014లో మధ్యతరగతి సగటు ఆదాయం రూ.4.4 లక్షలు కాగా.. ఇది 2023 నాటికి రూ.13 లక్షలకు పెరిగినట్లు నివేదిక తెలిపింది. ఇక 2047 సంవత్సరం నాటికి సగటు ఆదాయ రూ.49.7 లక్షలకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
గత 10 సంవత్సరాల్లో చూసుకుంటే 5 లక్షల రూపాయల ఆదాయం కేటగిరీ నుంచి 10 లక్షల రూపాయల ఆదాయ కేటగిరిలో పన్ను చెల్లించేవారు 8.1 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు 10 లక్షల రూపాయల ఆదాయ కేటగిరి నుంచి దాదాపు 20 లక్షల రూపాయల ఆదాయ కేటగిరికి వెళ్లినవారు 3.8 శాతంగా ఉన్నారు. కోటికి పైగా ఆదాయ కేటగిరిలో 0.02 శాతం పెరిగినట్లు నివేదిక తెలిపింది. ఇక ఆదాయపు పన్ను చెల్లించేవారి ఉద్యోగుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్నట్లు వెల్లడించింది. మరోవైపు ఇటు దేశ జనాభ 2047 సంవత్సరం వాటికి 161 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం జనాభాలో 37.9 శాతం మంది ఉద్యోగులు ఉన్నారు. అయితే ఈ ఉద్యోగుల సంఖ్య 45 శాతానికి పెరుగుతుందని నివేదిక తెలిపింది. ఇదిలా ఉండగా క్రమంగా ఆదాయపు పన్ను చెల్లించేవారి సంఖ్య పెరుగడం పట్ల.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..