Loudspeakers: దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న లౌడ్ స్పీకర్లు.. శబ్ద కాలుష్యం వినికిడి శక్తికి విఘాతం ఎంత!

Azaan-Hanuman Chalisa Controversy: మహారాష్ట్రలో జారీ అయిన అజాన్ VS హనుమాన్ చాలీసా వివాదం దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది.

Loudspeakers: దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న లౌడ్ స్పీకర్లు.. శబ్ద కాలుష్యం వినికిడి శక్తికి విఘాతం ఎంత!
Loudspeakers
Follow us

|

Updated on: Apr 25, 2022 | 4:54 PM

Azaan-Hanuman Chalisa Controversy: మహారాష్ట్రలో జారీ అయిన అజాన్ VS హనుమాన్ చాలీసా వివాదం దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉన్నావ్‌లోని ప్రాంతీయ మంత్రి మరియు హిందూ జాగరణ్ మంచ్ ఇన్‌ఛార్జ్ విమల్ ద్వివేది లౌడ్ స్పీకర్ కట్టారు. మంగళవారం నుండి ఆలయం . హనుమాన్ చాలీసాను రోజుకు 5 సార్లు ప్రారంభించారు. అది కూడా ఆజాన్ సమయంలో.. అంతే కాదు చేతిలో అజాన్ VS హనుమాన్ చాలీసా పోస్టర్లతో జై శ్రీరామ్ నినాదాలు కూడా చేశారు. దీనితో పాటు, హిందూ జాగరణ్ మంచ్ నగరంలోని దేవాలయాల వెలుపల హనుమాన్ చాలీసా పోస్టర్లను కూడా పంపిణీ చేసింది. నగరంలోని మొహల్లా హౌసింగ్ డెవలప్‌మెంట్ వద్ద ఉన్న శివాలయంలో లౌడ్ స్పీకర్లను అమర్చడం ద్వారా హిందూ జాగరణ్ మంచ్ ప్రావిన్షియల్ మంత్రి విమల్ ద్వివేది హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

మరోవైపు. ఈ హనుమాన్ చాలీసా కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. మసీదుల్లో లౌడ్ స్పీకర్ల ద్వారా ఆజాన్ చేసే సమయంలోనే హనుమాన్ చాలీసా నిర్వహిస్తున్నారు. హిందూ జాగరణ్ మంచ్ ఈ చర్య కారణంగా వివాదం మరింత రాజుకుంది. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మంగళవారం సాయంత్రం ఉత్తరప్రదేశ్‌లో మతపరమైన ప్రదేశాల్లో లౌడ్‌స్పీకర్‌ కార్యక్రమం ఉండరాదని ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడికక్కడ లౌడ్ స్పీకర్లను సీజ్ చేయాలని పోలీసులను ఆదేశించారు. ఈ క్రమంలో ఎక్కడైతే లౌడ్ స్పీకర్లు అమర్చినవారిపై కేసులు నమోదు చేస్తున్నారు.

ముఖ్యమంత్రి ఆదేశానుసారం హిందూ జాగరణ్ మంచ్ ఈ చర్య తీసుకోవడంతో వివాదం పెరిగింది. మత స్వేచ్ఛ ఏకపక్షంగా ఉండకూడదని ప్రావిన్సు మంత్రి విమల్ ద్వివేది అన్నారు. ముస్లిమేతర మెజారిటీ సమాజం మసీదుల నుండి ఆజాన్ ఎందుకు వినాలి? ఇందులో కేవలం అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించాలని చెప్పారు. ఇది ఎక్కడో హిందువుల మత స్వేచ్ఛకు భంగం కలిగించడమే. అలాగే లౌడ్‌స్పీకర్ ఇస్లాంలో భాగం కాదనీ, కొన్ని దశాబ్దాల క్రితం నాటి కల్పన అని, అయితే కోర్టు ఆదేశాలిచ్చినా, కోర్టు ఆదేశాలను అమలు చేయలేక పాలకులు మసీదుల నుంచి లౌడ్‌స్పీకర్లు రావడం లేదు. అందువల్ల, హిందూ జాగరణ్ మంచ్ దేవాలయాల నుండి 5 సార్లు హనుమాన్ చాలీసాను ప్లే చేస్తుంది. అలాగే జిల్లాలోని ప్రతి దేవాలయం వరకు హిందూ సమాజంచే ఇది ప్రారంభమవుతుందని మంత్రి స్పష్టం చేశారు.

ఇదిలావుంటే, ఒ పక్క పలు రాష్ట్రాల్లో మైకుల వాడకంపై నిరసనలు కొనసాగుతున్నాయి. మసీదుల్లో మైకులను నిషేధించాలని ఆందోళనలు చేపడుతున్నారు హిందూ వాహిని కార్యకర్తలు. మైకులను నిషేధించకుంటే.. అదే స్థాయిలో హనుమాన్ చాలీసా, శివస్త్రోత్రాలు మైకుల్లో వినిపిస్తామంటున్నాయి కొన్ని హిందూ సంస్థలు. ఈ నేపథ్యంలో ధార్మిక స్థలాల్లో మైకుల వాడకాన్ని నిషేధించాలంటూ యూపీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తదితర రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో యూపీలో తొలి అడుగు పడింది. ఇప్పటికే సెంట్రల్ పొల్యుషన్ కంట్రోల్ బోర్డ్(సీపీసీబీ) నిర్దేశకాలున్నప్పటికీ అమలు అంతంత మాత్రమే. అన్ని మతాలవారీకి మైకుల్లో ప్రార్థనలు, ఊరేగింపులంటే మక్కువ.. యూపీలో అన్ని మతాల ప్రార్థన స్థలాలు, మందిరాల్లో మైకుల వినియోగంపై ఆంక్షలు విధించింది రాష్ట్ర ప్రభుత్వం. ఆలయాలు, ఇతర మతపరమైన ధార్మిక సంస్థలు ఉన్న మార్గాల్లో, ఆలయాలు, ఇతర ప్రార్థన స్థలాల్లో మైకులు ఉపయోగించడంపై నిషేధం విధించింది యూపీ ప్రభుత్వం. ఇప్పటికే లౌడ్ స్పీకర్లు ఉపయోగిస్తున్న ప్రార్థన స్థలాల్లో శబ్దం నిర్ణీత ప్రదేశాన్ని, పరిమితిని మించకూడదని ఆంక్షలు విధించింది.

కొత్త ధార్మిక స్థలాల్లో లౌడ్ స్పీకర్ల వినియోగానికి ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేసింది. ఇక శోభాయాత్రలు, ఊరేగింపులు తీయడానికి అనుమతులపై షరతులు విధించింది.ఈ నిబంధనలన్నీ అన్ని మతాలకు వర్తిస్తాయన్న యూపీ సర్కార్ స్పష్టం చేసింది. ఆధ్యాత్మిక పరమైన సభలు, సమావేశాలు, ఊరేగింపులు, ర్యాలీలకు సంబంధించి పోలీసులు అనుమతిస్తేనే నిర్ణీత పరిమితి మేరకు చేపట్టే వీలు కల్పించింది సీఎం యోగి ఆదిత్యానాథ్ సర్కార్. మే 3 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి తేనున్నట్లు యోగి సర్కార్ ప్రకటించింది.

ఇదీ తీరు ఇటు మహారాష్ట్రలో సైతం ఇదే తీరు చట్టం అమలుకు శ్రీకారం చుట్టింది సీఎం ఉద్ధవ్ ఠాక్రే సర్కార్. ధార్మిక ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లు వాడాలంటే పోలీసులనుంచి అనుమతులు తప్పనిసరి చేసింది. ముంబైలో సైతం ఇదే తరహా నిబంధనలు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. ముంబైలోని కనీసం 72 శాతం మసీదుల్లో ఉదయం 5గంటలకు చేసే అజాన్ లకు లౌడ్ స్పీకర్ల వినియోగం నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇది సంచలన నిర్ణయమంటున్నారు విశ్లేషకులు.

ఇదే డిమాండ్ ఇతర రాష్ట్రల్లో వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. యూపీలో 3.5లక్షలకు మించి ఆలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారలు ఉన్నాయి. అనునిత్యం ఇక్కడ పూజలు, ప్రార్థనలు చేస్తూ.. లౌడ్ స్పీకర్లతో హోరెత్తిస్తుంటారు. ఈ ధార్మిక సంస్థల వద్ద ఏర్పాటుచేసిన మైకుల వల్ల శబ్ద కాలుష్యం ఏర్పడుతోందని గతంలోనే ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా సరికొత్త ఆదేశాలను జారీచేసింది యూపీ సర్కార్.

ఇంతకీ శబ్ద కాలుష్యం ఎంతవరకు ఉండవచ్చు? సెంట్రల్ పొల్యుషన్ కంట్రోల్ బోర్డ్(సీపీసీబీ) నిర్దేశకాలు.. యూపీ సర్కార్ సీపీసీబీ నిర్దేశకాలమేరకు శబ్ద కాలుష్యంపై ఆంక్షలు విధించింది. ప్రధానంగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి శబ్ద కాలుష్యం కారకులపై వెయ్యి నుంచి లక్ష రూపాయల వరకు జరిమానా విధించేందుకు 2000 సంవత్సరంలోనే నిబంధనలను రూపొందించింది. అన్ని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లు వీటిని అమలు చేయాలని కూడా నిర్దేశించింది. భారీ భవనాల నిర్మాణాలు జరిగే ప్రాంతాల్లో రాత్రి పగలు కూడా పనులు జరుగుతుంటాయి. రాత్రిపూట జరిగే పెద్ద పెద్ద వివాహ మహోత్సవాలు వంటివి, భారీ వాహనాలు తిరిగే జాతీయ రహదారి పక్కనే ఉన్నవారికి ఎదురవుతున్న శబ్ద కాలుష్యం ఎంత అన్నది సరైన లెక్కలే లేవు. 2020 జూన్​లో జాతీయ హరిత ట్రైబ్యునల్ ఈ శబ్ద కాలుష్యాన్ని తీవ్రంగా పరిగణించాలని నిర్దేశించింది.

లౌడ్ స్పీకర్లు ద్వారా శబ్ద కాలుష్యానికి పరిమితికి మించితే కనీస జరిమానా పదివేల రూపాయలుగా నిర్ణయించింది. డీజిల్ జనరేటర్ ద్వారా వెలువడే శబ్ద కాలుష్యానికి పది వేల నుంచి లక్ష రూపాయల వరకు జరిమానా వేయ్యొచ్చు. నిర్మాణ సామగ్రి వల్ల కలిగే ధ్వని కాలుష్యానికి 50 వేల వరకు జరిమానా విధించొచ్చు. 2011లో మెట్రో సిటీలు పెద్దనగరాలు కలిపి ఎనిమిదింటిలో దాదాపు 70కి ప్రదేశాలలో పైగా నేషనల్ యాంబియెంట్ నోయిస్ మానిటరింగ్ నెట్ వర్క్​గా ఏర్పాటు చేశారు. వీటి పరిశీలన ద్వారా 95 శాతం పైగా ప్రదేశాల్లో పరిమితికి మించిన శబ్ద కాలుష్యమే ఉందని వెల్లడైంది.పారిశ్రామిక ప్రాంతాల్లో 75 డెసిబుల్స్, రాత్రి పూట 70 డెసిబుల్స్​కి మించి ఉండకూడదు. వాణిజ్య ప్రాంతాల్లో పగటి పూట 65, రాత్రిపూట 55 డెసిబుల్స్​కి మించి ఉండకూడదు. నివాస ప్రాంతాల్లో ఇది పగటి పూట 55, రాత్రి పూట 45 డెసిబుల్స్​గా ఉంటుంది. అయితే, పబ్లిక్ ఎమర్జెన్సీ సమయంలోనూ వాడొచ్చు. రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, రాష్ట్రాల అవతరణ దినోత్సవాలు, పండగలు, సాంసృతిక ప్రదర్శనలు, మతపరమైన కార్యక్రమాల సమయంలో కొన్ని పరిమితుల మధ్య రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు మైకులు వాడేందుకు అధికారులు అనుమతులు ఇవ్వొచ్చు. అయితే ఏడాదిలో 15 రోజులు మాత్రమే ఇందుకు అనుమతించాల్సి ఉంటుంది.

ఇవి కాకుండా పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, న్యాయస్ధానాలు వంటివి సైలెంట్ జోన్లుగా పాటించాల్సి ఉంది. ఎట్టి పరిస్దితుల్లోనూ ఇక్కడ 40 డెసిబుల్స్​కి మించి శబ్ద కాలుష్యం ఉండకూడదు.శబ్ద కాలుష్యం ప్రధానంగా రాత్రిపూట నిద్రకు భంగం కలిగించి సుదీర్ఘ కాలం ఇదే పరిస్ధితి ఎదుర్కొంటున్నవారికి మాత్రం వినికిడి సమస్యలే కాకుండా, మానసిక సమస్యలు కూడా తలెత్తుతున్నాయన్నది నిపుణుల పరిశీలన. శబ్దకాలుష్యం తీవ్ర స్దాయిలో రికార్డు అవుతోందా లేదా అన్న అంశంపై విస్తృతంగా మీటర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు అంగీకరిస్తున్నారు.

పరిమితి మించిన శబ్దం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం.. శబ్ధకాలుష్యం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశముంది. 70 డెసిబెల్స్ మించిన ధ్వని మెదడుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. రక్తపోటు పెరగడం, మానసిక అనారోగ్యం కలుగుతుంటాయన్న అధ్యయన నివేదిక పేర్కొంది. సౌదీ అరేబియాలో సైతం శబ్ద కాలుష్యంపై చర్యలు చేపట్టింది. ముఖ్యంగా రంజాన్ సందర్భంగా అజాన్ ప్రార్థనల్లో అక్కడి లౌడ్ స్పీకర్ల ధ్వని తీవ్రతను మూడొంతుల్లో ఒక వంతు తగ్గించింది సౌదీ ప్రభుత్వం. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం భారత్‌లో ధ్వని కాలుష్యంతో 6.30 కోట్ల మంది వినికిడి సామర్థ్యం తగ్గిందని వెల్లడించింది. వరల్డ్ హియరింగ్ ఇండెక్స్ అనుసరించి ప్రపంచంలో ధ్వనికాలుష్యంతో ప్రభావితమైన టాప్ టెన్ నగరాల్లో ముంబై, ఢిల్లీలున్నాయని పేర్కొంది,

మసీదుల్లో మైకుల మీద చట్టాలు ఎలా ఉన్నాయంటే..? మసీదుల్లో మైకులు వాడటమనేది ఇస్లాంలో అతి ముఖ్యమైన సంప్రదాయం కాదని గతంలో అలహాబాద్ హై కోర్టు వ్యాఖ్యలు చేసింది. గతంలో మైకుల్లో అజాన్ ప్రసారం చేయడం మీద యూపీ ప్రభుత్వం ఆంక్షలు విధించిన నేపథ్యంలో 2020లో హైకోర్టులో పిటిషన్ వేశారు కొందరు. మైకుల్లో అజాన్ ప్రసారం చేయడమనేది ముఖ్యమైన మత సంప్రదాయం కాదు. మైకులు లేకుండానే అజాన్ పఠించ వచ్చని కోర్టు తీర్పు వెలువరించింది. ధ్వని కాలుష్య నిబంధనల ప్రకారం అనుమతులు లేని వారు మైకుల్లో అజాన్ పఠించకూడదని కోర్టు వెల్లడించింది.

Read Also…  Congress: తెలంగాణలో కాంగ్రెస్‌ హైకమాండ్‌ వ్యూహమేంటి? పదవుల ప్రొటోకాల్‌తో కొత్త కమిటీల ప్రయోజనమెంత?