Tele-MANAS: దేశ వ్యాప్తంగా ప్రారంభమైన టెలీ-మెంటల్ హెల్త్ సర్వీస్ ‘టెలి-మనస్’..

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మానసిక ఆరోగ్య రంగంలో కొత్త మైలురాయిని నెలకొల్పుతూ.. కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ టెలి మెంటల్

Tele-MANAS: దేశ వ్యాప్తంగా ప్రారంభమైన టెలీ-మెంటల్ హెల్త్ సర్వీస్ ‘టెలి-మనస్’..
Union Minister Bharati Pravin Pawar
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 11, 2022 | 12:45 PM

దేశంలో 24 గంటలపాటు మానసిక ఆరోగ్య సేవలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సోమవారం టెలి-మానస్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రారంభించబడిన టెలీ మెంటల్ హెల్త్ అసిస్టెన్స్ అండ్ నెట్‌వర్కింగ్ అక్రోస్ స్టేట్స్ (టెలి-మనస్), టోల్ ఫ్రీ నంబర్-14416లో 24×7 మానసిక ఆరోగ్య సేవలను అందజేస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

మానసిక ఆరోగ్య సంక్షోభం, కోవిడ్-19 మహమ్మారి కారణంగా తలెత్తిన సవాళ్లను తట్టుకునే డిజిటల్ మెంటల్ హెల్త్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయవలసిన తక్షణ అవసరాన్ని పేర్కొంటూ.. భారత ప్రభుత్వం 2022-23 యూనియన్ బడ్జెట్‌లో నేషనల్ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ (NTMHP)ని ప్రకటించింది. Tele-MANAS లో భాగంగా దేశవ్యాప్తంగా ఉచిత టెలి-మెంటల్ ఆరోగ్య సేవలను 24 గంటలూ అందించడం లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. ప్రత్యేకించి మారుమూల ప్రాంతాల ప్రజలకు ఈ సేవలను విస్తరించాలని తలంచింది సర్కార్. ఈ ప్రోగ్రామ్‌లో 23 టెలీ-మెంటల్ హెల్త్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ నెట్‌వర్క్ ఉంది. ఈ నెట్‌వర్క్‌కి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్(NIMHANS) నోడల్ సెంటర్, ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-బెంగళూరు (IIITB), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) బెంగళూరు, నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్ (NHRSC) సాంకేతిక సహాయాన్ని అందిస్తాయి. కాగా, ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలో కనీసం ఒక టెలి-మానస్ సెల్‌‌ను ఓపెన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ సేవలను పొందేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక టోల్‌ ఫ్రీ నెంబర్‌ను కూడా ఏర్పాటు చేసింది. 14416 హెల్ప్ లైన్ నెంబర్ 24/7 దేశ వ్యాప్తంగా సేవలు అందిస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ సేవలను పొందేందుకు ప్రాంతీయ భాషలను ఎంచుకునే సదుపాయం కూడా కల్పించింది. 1-800-91-4416 నెంబర్‌కు కాల్ చేయడం ద్వారా కూడా ఈ సేవలు పొందవచ్చునని తెలిపింది కేంద్రం. ఎవరైనా ఈ నెంబర్లకు కాల్ చేస్తే.. సదరు కాల్స్ సంబంధిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని టెలి-మానస్ సెంటర్లకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుందని వివరించారు.

ఇవి కూడా చదవండి

టెలి-మానస్ రెండంచెల వ్యవస్థ..

టెలి-మానస్ రెండంచెల వ్యవస్థలో పని చేస్తుంది. మొదటిది రాష్ట్ర టెలి-మానస్ సెల్‌లను కలిగి ఉంటుంది. ఇందులో శిక్షణ పొందిన కౌన్సెలర్లు, మానసిక ఆరోగ్య నిపుణులు ఉంటారు. ఇక రెండో వ్యవస్థలో ఫిజికల్ కన్సల్టేషన్ కోసం డిస్ట్రిక్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్స్(DMHP)/మెడికల్ కాలేజీ/ ఆడియో విజువల్ కన్సల్టేషన్ కోసం ఇ-సంజీవని నిపుణులు ఉంటారు. ప్రస్తుతం 5 ప్రాంతీయ సమన్వయ కేంద్రాలతో పాటు 51 టెలి-మానస్ సెల్‌లను ఏర్పాటు చేశారు.

కేంద్రీకృత ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (IVRS) ద్వారా ప్రైమరీ సపోర్ట్, కౌన్సెలింగ్‌ను అందించే రోల్‌ అవుట్‌ను అన్ని రాష్ట్రాలు, యూటీలలో ఉపయోగించడానికి అనువుగా ఏర్పాట్లు చేశారు. ఇది తక్షణ మానసిక ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడంలో సహాయపడటమే కాకుండా, నిరంతర సంరక్షణను సులభతరం చేస్తుంది. నేషనల్ టెలి-కన్సల్టేషన్ సర్వీస్, ఇ-సంజీవని, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్, మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు, ఎమర్జెన్సీ సైకియాట్రిక్ సదుపాయాలు వంటి ఇతర సేవలతో టెలి-మనస్‌ని అనుసంధానం చేయడం ద్వారా ప్రత్యేక సంరక్షణను అందిస్తోంది. మొత్తంగా ఇది అన్ని ఆరోగ్య వ్యవస్థలను ఏకీకృతం చేస్తుంది. కాగా, నిమ్హాన్స్ మెజారిటీ రాష్ట్రాలు/యుటిల నుండి 900 మంది టెలి-మానస్ కౌన్సెలర్లకు శిక్షణనిచ్చింది.

మెంటరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు ఇవే..

AIIMS, పాట్నా, AIIMS రాయ్‌పూర్, CIP రాంచీ, AIIMS భోపాల్, AIIMS కళ్యాణి, AIIMS భువనేశ్వర్, PGIMER చండీగఢ్, హాస్పిటల్ ఫర్ మెంటల్ హెల్త్, అహ్మదాబాద్, గుజరాత్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్ బాంబోలిమ్ గోవా, AIIMS, నాగ్‌పూర్, AIIMS జోధ్‌పూర్, KGMU లక్నో, AIIMS రిషికేశ్, IHBAS ఢిల్లీ, IGMS సిమ్లా, సైకియాట్రిక్ డిసీజెస్ హాస్పిటల్ Govt. మెడికల్ కాలేజీ శ్రీనగర్, LGBRIMH తేజ్‌పూర్, నిమ్హాన్స్ బెంగళూరు, IMHANS కోజికోడ్ కేరళ, IMH చెన్నై, IMH హైదరాబాద్, JIPMER, AIIMS మంగళగిరి.

టెలి-మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్‌ ప్రారంభించిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఇవే..

ఆంధ్రప్రదేశ్, అస్సాం, అండమాన్ – నికోబార్ దీవులు, ఛత్తీస్‌గఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ – డయ్యూ, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, కేరళ, లడఖ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్,పశ్చిమ బెంగాల్.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో