Telangana Ministers: తాడో పేడో తేల్చుకుంటాం.. ఇవాళ ఢిల్లీలో కేంద్రమంత్రిని కలవనున్న తెలంగాణ మంత్రులు..

వరి ధాన్యం కొనుగోళ్ల అంశం రగడ కొనసాగుతోంది. కేంద్రం వర్సెస్‌ టీఆర్‌ఎస్‌ వార్‌ నడుస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ ఢిల్లీలో కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ను కలవనున్నారు తెలంగాణ మంత్రులు. ధాన్యం కొనుగోళ్లపై..

Telangana Ministers: తాడో పేడో తేల్చుకుంటాం.. ఇవాళ ఢిల్లీలో కేంద్రమంత్రిని కలవనున్న తెలంగాణ మంత్రులు..
Union Minister Piyush Goyal
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 20, 2021 | 8:23 AM

వరి ధాన్యం కొనుగోళ్ల అంశం రగడ కొనసాగుతోంది. కేంద్రం వర్సెస్‌ టీఆర్‌ఎస్‌ వార్‌ నడుస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ ఢిల్లీలో కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ను కలవనున్నారు తెలంగాణ మంత్రులు. ధాన్యం కొనుగోళ్లపై స్పష్టమైన హామీకి ఇవ్వాలని కోరనున్నారు. వరిధాన్యం కొనుగోలు పంచాయతీ… మరోసారి ఢిల్లీకి చేరింది. ఈ విషయమై కేంద్రంతో తాడో పేడో తేల్చుకునేందుకు.. హస్తినకు వెళ్లారు తెలంగాణ మంత్రులు. ప్రధానితో సహా పలువురు కేంద్రమంత్రుల అప్పాయింట్‌మెంట్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సగం కేబినెట్‌… ఢిల్లీకి చేరుకోగా.. మరికొందరు మినిస్టర్లు కూడా అక్కడికి వెళ్లనున్నారు. దేశరాజధానిలో మకాం వేసిన తెలంగాణ కేబినెట్‌… వరిధాన్యం కొనుగోలుపై కేంద్రం నుంచి స్పష్టత కోరుతోంది.

రబీ సీజన్‌లో బాయిల్డ్‌ రైస్‌ కొనేది లేదని.. పార్లమెంట్‌ లోపలా, వెలుపలా… ఇప్పటికే స్పష్టం చేసింది కేంద్రప్రభుత్వం. దీంతో పోరుబాట పట్టింది తెలంగాణ అధికార పార్టీ టీఆర్‌ఎస్‌. రేపు పియూష్‌ గోయల్‌తో తెలంగాణ మంత్రుల భేటీ ఏం తేల్చనుందనే విషయమై ఆసక్తి నెలకొంది. కేంద్ర వైఖరిలో మార్పు ఉంటుందా? ధాన్యం కొనుగోలుకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందిస్తారా? అనేది తెలియాల్సి ఉంది.

మరోవైపు ఢిల్లీలో కేంద్రపెద్దలతో మంతనాలు చేస్తూనే.. క్షేత్రస్థాయిలో పోరాటం చేయాలని టీఆర్‌ఎస్‌ పిలుపునిచ్చింది. కేంద్రం తీరును నిరసిస్తూ.. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఊరేగింపులు, శవడప్పు కార్యక్రమాలు నిర్వహించనుంది. గజ్వేల్‌లో ధర్నాలో పాల్గొననున్నారు మంత్రి హరీష్‌రావు.

మరోవైపు, టీఆర్‌ఎస్‌ తీరుపై మండిపడుతోంది బీజేపీ. కావాలని రాజకీయం చేస్తోందని ఆరోపిస్తోంది. మొత్తానికి మరోసారి హస్తినకు చేరిన వరివార్‌.. ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి: Afghanistan Heroin: కాబూల్‌ వీధుల్లో యధేశ్చగా మెథామ్‌ విక్రయం.. సంక్షోభం నుంచి బయటపడేందుకు తాలిబన్ల నయా ప్లాన్..

Adimulapu Suresh: గండి పూడ్చకుంటే నేనే చెరువులో దూకుతా.. అధికారులకు ఏపీ మంత్రి స్ట్రాంగ్‌ వార్నింగ్‌