AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cold-Intensity: చలిపులి పంజా.. వణుకుతున్న భారతీయం.. బారెడు పొద్దెక్కినా..

చలి పులి పంజా విసురుతోంది. చలి గాలుల భయానికి బయటకు రావాలంటే వణికిపోతున్నారు. ఒక్క ఢిల్లీనే కాదు.. ఇటు ఉత్తరాధి నుంచి దక్షిణాధి వరకు ఉక్కరి బిక్కిరి చేస్తోంది.

Cold-Intensity: చలిపులి పంజా.. వణుకుతున్న భారతీయం.. బారెడు పొద్దెక్కినా..
Cold Intensity
Sanjay Kasula
|

Updated on: Dec 20, 2021 | 8:02 AM

Share

Cold-Intensity: చలి పులి పంజా విసురుతోంది. చలి గాలుల భయానికి బయటకు రావాలంటే వణికిపోతున్నారు. ఒక్క ఢిల్లీనే కాదు.. ఇటు ఉత్తరాధి నుంచి దక్షిణాధి వరకు ఉక్కరి బిక్కిరి చేస్తోంది. పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్, రాజస్థాన్‌ రాష్ట్రాల ప్రజలు చలికి వణికిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచు దుప్పటి కమ్మేస్తోంది. ఈ ఏడాది చలికాలంలో అతి తక్కువ ఉష్టోగ్రతలు నమోదు అవుతున్నాయని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు ఆరు డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువగా నమోదయ్యాయి. పగటిపూట పొగమంచు కురుస్తోంది. పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలు, ఉత్తర రాజస్థాన్‌లలో రాబోయే 4 రోజులు తీవ్రమైన చలిగాలులు వీస్తాయని హెచ్చరించింది ఐఎండీ.

ఇప్పుడు నమోదవుతున్న ఉష్టోగ్రతల కంటే, 2 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గుతాయని తెలిపింది. ఫతేపూర్, చురులో ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థాయికి పడిపోయాయి. ఆ ఎఫెక్ట్‌ దేశంలోని ఉత్తర ప్రాంతాలపై పడింది. రాజస్థాన్‌లోని చాలా ప్రాంతాలకు కోల్డ్ వేవ్ వార్నింగ్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఉత్తరాఖండ్‌కు ఆరేంజ్ అలెర్ట్‌ జారీ చేశారు అధికారులు. రాత్రిపూట ప్రజలు బయటకు రావొద్దని సూచిస్తున్నారు.

జమ్ము-శ్రీనగర్ లోని చాలా ప్రాంతాలు మంచులో చిక్కుకున్నాయి. ఇక్కడ ఉష్టోగ్రత సున్నా డిగ్రీలకు పడిపోయింది. ఇక హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో ప్రజలను అలెర్ట్‌ చేశారు అధికారులు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో ఇళ్లు లేకుండా ఫుట్‌పాత్‌లపై పడుకునే వారిని, సేఫ్‌ హోమ్‌లకు తరలించారు అధికారులు. చలిగాలులు, మంచు కురవడంతో విమానం, రైళ్ల ప్రయాణాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు అధికారులు.

తెలుగు రాష్ట్రాల్లో మరింత చలి తీవ్రత పెరగనుంది. ఇప్పటికే రాత్రిళ్లు నెగళ్లు (చలిమంటలు) వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. ఉత్తరం, ఈశాన్యం నుంచి వీస్తున్న చలి గాలులతో రానున్న నాలుగు రోజుల్లో రాత్రి ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోనున్నాయి. హైదరాబాద్‌లో కనిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో పలు జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, సిరిసిల్ల, జగిత్యాల, మహబూబాబాద్‌ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది. ఏపీలోనూ ఇదే పరిస్థితి కనపిస్తోంది.

ఇవి కూడా చదవండి: Afghanistan Heroin: కాబూల్‌ వీధుల్లో యధేశ్చగా మెథామ్‌ విక్రయం.. సంక్షోభం నుంచి బయటపడేందుకు తాలిబన్ల నయా ప్లాన్..

Adimulapu Suresh: గండి పూడ్చకుంటే నేనే చెరువులో దూకుతా.. అధికారులకు ఏపీ మంత్రి స్ట్రాంగ్‌ వార్నింగ్‌