Telangana: అసెంబ్లీ ఎన్నికలపై కీలక విషయాలు పంచుకున్న రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికి అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పలు విషయాలను వివరించారు. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికార యాత్రంగాన్ని అన్ని విధాలుగా సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో ప్రత్యేక సవరణ విషయంలో ఇదివరకు ఎప్పుడూ లేనంతంగా ఈసారి ఎన్నికలకు దాదాపు 21 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయని అన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికి అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పలు విషయాలను వివరించారు. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికార యాత్రంగాన్ని అన్ని విధాలుగా సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో ప్రత్యేక సవరణ విషయంలో ఇదివరకు ఎప్పుడూ లేనంతంగా ఈసారి ఎన్నికలకు దాదాపు 21 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయని అన్నారు. మరో విషయం ఏంటంటే ముఖ్యంగా ఇందులో మార్పులు, చేర్పుల కోసమే దాగాపు 9 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. అయితే గత ఎన్నికల సమయంలో 1-2 లక్షలు కూడా వచ్చేవి కాదని తెలిపారు. అభ్యర్థుల నామినేషన్ల దాఖలుకు సంబంధించి 10 రోజుల ముందువరకు వచ్చిన ఓటరు దరఖాస్తులను ఆయా నియోజకవర్గాల అధికారులు పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
అలాగే ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసిన నేపథ్యంలో ఏవైనా మార్పులు, చేర్పులు.. అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్ 19వ తేదిలోదా అప్లై చేసుకోవాలని తెలిపారు. ఇక చివరికి అక్టోబర్ 4వ తేదిన ఓటర్ల తుది జాబితాను విడుదల చేస్తామన్నారు. ఈసారి పెద్ద సంఖ్యలో తొలితరం ఓటర్లు నమోదుకావడంతో.. ఓటర్ల సంఖ్య పెరిగిందని దీనివల్ల పోలింగ్ కేంద్రాలు కూడా భారీగా పెరిగాయని అన్నారు. ప్రతికేంద్రంలో 1500 మంది ఓటర్ల వరకు ఉండేలా చూస్తామని తెలిపారు. ఒకే కుటుంబంలో ఉండే ఓటర్లు వేరు వేరు కేంద్రాలకు వెళ్లకుండా కసరత్తులు చేస్తున్నామని తెలిపారు. ఇదిలా ఉండగా ఆగస్టు 26, 27 వ తేదీల్లో నిర్వహించినటువంటి ఓటరు నమోదు కార్యక్రమానికి మంచి స్పందన వచ్చిందని అన్నారు. అలాగే సెప్టెంబర్ 2. 3వ తేదీల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఇక తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఒకే ఇంటి నంబరుతో ఆరు అంతకు మించి ఓటర్లు ఉండేచోట గత మే నెలలో ఇంటింటికి నిర్వహించామని తెలిపారు. సుమారు 7.5 లక్షల ఇళ్ల నివాసల పరిధిలో ఉన్న 75 లక్షల ఓటర్ల వివరాలను కూడా ఇప్పటికే పరిశీలించామని తెలిపారు. అలాగే పెద్ద సంఖ్యలో ఓటర్లు ఆ చిరునామాల్లో లేరని చెప్పారు. వారిలో ఎక్కువభాగంగా.. మారిన ప్రాంతాల్లోనే ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోందని అన్నారపు. చిరునామలో లేనటువంటి ఓటర్లకు నోటీసులు కూడా జారీచేస్తామని తెలిపారు. అయితే వీటిపై 15 రోజుల్లో సంబధిత ఓటర్లు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆ తర్వాత పోలింగ్ కేంద్రం స్థాయి అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలించి.. ఓటరు కోరుకున్న ప్రాంతంలో ఓటు ఉంచి మరో ప్రాంతంలో తొలగిస్తామని తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం